జ్యోతిషం - విజ్ఞానం - శ్రీకాంత్

 
 
సూర్యగ్రహణం ,చంద్రగ్రహణం అనగా ?

సూర్యుని చుట్టూ భూమి అలాగే భూమి చుట్టూ చంద్రుడు నిరంతరం ఒక యజ్ఞంలా ఎవరో వారికి పని అప్పచెప్పినట్లుగా తిరుగుతుంటారు. మనం అందరం పుస్తకాల్లో చదువుకున్నాం సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు సరళరేఖ కక్ష్యలో వస్తే సూర్యగ్రహణం అని... సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక కక్ష్యలోకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని... సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు పట్టుకాలం 365. 99 రోజులకు సమానం. ఒక సంవత్సరకాలంలో చంద్రుడు భూమిచుట్టూ పన్నెండు ప్రదక్షణలు చేస్తాడు. మరి ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు తరుచుగా గ్రహణాలు ఏర్పడాలి కదా... మరి ఎందుకు ఏర్పడటం లేదు.?

సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలను మాన్ ఋషులు ముందే చెప్పగలిగారా?

అవును, అనే చెప్పవచ్చు. మన వేద జ్యోతిషం ప్రకారం చంద్రుడు అతివేగంగా సంచరించే గ్రహం ఒక రాశిలో కేవలం 2-1/2 రోజులు మాత్రమే ఉంటాడు. అంటే ఒక సంవత్సర కాలంలో పెన్నెండు రాశులు పన్నెండు సార్లు తిరుగుతాడు. అంటే ఒక నెలలో, మొత్తం రాశులు తిరుగుతాడన్నమాట. అనగా శాస్త్రవేత్తల కూడా ఇలానే చెప్పారు. మరి తరుచు గ్రహణాలు ఎందుకు ఏర్పడవు... మన పూర్వీకులు వీటిని పురాణ రూపంలో చెప్పారు. రాహువు, కేతువు అని ఇద్దరు రాక్షసులు వీరిని మింగుతారు అని చెప్పారు. అదే రాహు, కేతువులను పాశ్చాత్యులు నోడ్స్ అంటారు. గ్రహాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను మన పూర్వీకులు ఈ రెంటికి ఇచ్చారు. అందుకే, వీటిని ఛాయగ్రహలు అన్నారు. మరిశాస్త్రవేత్తలు ఎం చెప్పారు... సూర్య, చంద్రులు ఇద్దరు ఒకే తలంలో ఉండక 50 డిగ్రీల కోణంలో ఉండటం మూలాన నెలకు రెండుసార్లు సూర్యమర్గాన్ని చంద్రుడు దాటతాడు. కాని అలా నెలకు రెండు సార్లు గ్రహణాలు ఏర్పడవు. మన వేదజ్యోతిషం ప్రకారం రాహుకేతువులు అనబడే నోడ్స్ మూలాన మాత్రమే గ్రహణాలు ఏర్పడుతాయి. అనగా సూర్య, చంద్రులు ఒక దానికొకటి రెండు బిందువుల దగ్గర కండించుకుంటాయి ఆ బిందువులనే నోడ్స్ అంటారు.                  

సూర్య, చంద్రగ్రహణాలు జ్యోతిషాన్ని బలపరుస్తున్నయా ?

బాగా ఆలోచిస్తే అవును అని చెప్పకతప్పదు. ఒకసారి గమనిద్దాం. మనం ఒకసారి గత కొన్ని సంవత్సరాలుగా గ్రహణాలు ఏర్పడ్డ రోజులను పరిశీలిద్దాం.

* 1982 లో ఏర్పడ్డ సూర్య, చంద్రగ్రహణాలను చూస్తే...
:-   సూర్యగ్రహణాలు వరుసగా *జనవరి  25, జూలై 20, డిసెంబర్ 15న,
:- చంద్రగ్రహణాలు వరుసగా * జనవరి 09, జూలై 06, డిసెంబెర్ 15 రోజుల్లో ఏర్పడ్డాయి.
"అదేవిధంగా 2038 సంవత్సరాల్లో ఏర్పడే గ్రహణాల గురుంచి పరిశీలిస్తే... "
:- సూర్యగ్రహణాలు జనవరి 05, జూలై 02, డిసెంబెర్ 26 లు వరుసగా 
:- చంద్రగ్రహణాలు జనవరి 21, జూన్ 7,జూలై 16 మరియు డిసెంబెర్ 11 లలో వరుసగా ఏర్పడనున్నాయి. 
అదేవిధంగా 2016 సంవత్సరంలో ఏర్పడే గ్రహణాల గురుంచి ఒకసారి చూద్దాం.
:- 09 మార్చ్ అలాగే 23 మార్చ్ లలో గ్రహణాలు ఏర్పడనున్నాయి

 ఒకసారి గ్రహణాలు ఏర్పడ్డ రోజులను కనుక గమనిస్తే, మనకు ఒక విషయం అవగతమవుతుంది. గ్రహణాలు కేవలం పౌర్ణమి, అలాగే అమావాస్యల్లో మాత్రమే ఏర్పడుతున్నాయి. కనుకనే మన పూర్వీకులు రాహు, కేతువులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రహణాలను అలాగే గ్రహణాలు వచ్చే సమయాలను గణించగలిగారు. ఈరోజు మనకు ఎన్నో పంచాంగాలు చాలా సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చినవి కూడా ఉన్నాయి. వాటిలో గ్రహణాల గురుంచి రాయడం జరిగింది. వారికి అస్ట్రానమి పైన ఎటువంటి అవగాహన లేదు, కేవలం గణితజ్యోతిషం ప్రకారం మాత్రమే రాయగలిగారు. మనకు అందుబాటులో ఉన్న అతి గొప్ప శాస్త్రాల్లో జ్యోతిషం ఒకటిగా భావిద్దాం.  అలాగే  ఒక విషయాన్ని మరవద్దు- విమర్శించే ముందు ఆ వ్యవస్థ పై కనీసం ఒక ప్రాథమిక అవగాహన కైనా రావాలి అని నా భావన. స్వామి వివేకానందుడు- మనం ఏదైనా అవగాహన చేసుకున్న తర్వాతే దాని గురుంచి మాట్లాడటం మంచిది అన్నారు.    

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు