కాకూలు - సాయిరాం ఆకుండి

క్రూరగాయలు!

మండే ధరలకు జేబులు ఖాళీ...
పప్పూ దినుసూ ఇంకేం కొనాలి !!

దళారి ముసుగులో రాజకీయ రంగేళీ ...
ప్రజా పంపిణీ అస్తవ్యస్తానికి ఎవరు జవాబు దారీ ?


నిషాచరులు

నడి వీధిన బార్లా తెరిచిన బెల్టు షాపులు ... 
నిర్లజ్జగా బారులు తీరిన మందు బాబులు !

దిగజారిన బతుకులతో భార్యా బిడ్డలకెంత దిగులు.... 
జగమెరిగిన సత్యమే, ఇది సర్కారుకున్న తెగులు !!


 

బుక్ వర్మ్స్

చదువునిచ్చే బుక్కులకి నిండా కొరత ...
గెలుపుని శాసించే బుకీలకు లేదే కొదవ !

పుస్తకాలు లేకున్నా మార్కుల కోసం తప్పదు శ్రమ ...
గెలిచే సత్తా సున్నా అయినా విన్నరెవరో మెలోడ్రామా !!

మరిన్ని వ్యాసాలు

బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్