పంజాబీ-ఉర్దూ కవి "రాజేంద్రనాద్ రెహబర్" కు డా. సి. నారాయణరెడ్డి సాహితీ పురస్కారం-2015 - డా. గజల్ శ్రీనివాస్

dr . c. narayana reddy award for rajendranath rehabar

పంజాబీ-ఉర్దూ  కవి "రాజేంద్రనాద్ రెహబర్" కు డా. సి. నారాయణరెడ్డి సాహితీ పురస్కారం-2015 

ప్రఖ్యాత పంజాబీ-ఉర్దూ కవి "రాజేంద్రనాద్ రెహబర్" ను డా. సి. నారాయణరెడ్డి సాహితీ పురస్కారం-2015 తో సత్కరించనున్నట్లు  గజల్ చారిటబుల్ ట్రస్ట్ అద్యక్షులు డా. గజల్ శ్రీనివాస్  తెలిపారు 

పంజాబ్ రాష్ట్రంలోని పటాన్ కోట్ నగరంలో  హోటల్ యునైట్ పాలెస్ లో 19 డిసెంబర్ 2015  తేది సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రముఖ బాలివుడ్ నటులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ కన్నా, మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత, హిందీ ప్రచార సమితి సభ్యులు ప్రొ. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ల చేతులమీదుగా  అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారంతో పాటుగా 25,000 రూపాయల నగదు బహుమతిని, జ్ఞాపికను  మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు  తెలిపారు. 

1995 నుండి ప్రతి సంవత్సరము ఈ పురస్కారాన్ని ప్రముఖ సాహితీ మూర్తులకు  అందజేస్తున్నట్లు, ఈ  2015 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని శ్రీ "రాజేంద్రనాద్ రెహబర్" కు అందజేస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పంజాబ్ డిప్యూటి స్పీకర్  శ్రీ దినేష్ సింగ్ విశిష్ఠ  అతిధి గా  పాల్గొంటారని  అలాగే  గౌరవ అతిధిలుగా  శ్రీ అశ్విన్ శర్మ, పటాన్ కోట్ శాసన సభ్యులు మరియు శ్రీ అనీల్ వాసుదేవ్, మేయర్ పటాన్ కోట్ లు పాల్గొంటారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గ్రీట్ వే ఇండో అమెరికా నిర్వహించిన చిత్రలేఖన పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కూడా జరుగుతుందని అలాగే  "మాస్ట్రో" డా. గజల్ శ్రీనివాస్ మరియు ఆయన కుమార్తె కుమారి సంస్కృతి “షామ్-రెహబర్” ఉర్దూ గజల్ కార్యక్రమం ఉంటుందని కార్యక్రమ సంచాలకులు శ్రీ కేవల్ కృష్ణ కలియా, పటాన్ కోట్ తెలిపారు. 

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్