పుస్తక సమీక్ష - -ఎన్.గోపీ కృష్ణమాచార్యులు

book review

శ్రీ నరసిమ్హ క్షేత్రాలు
వెల : రూ. 120/-
పేజీలు : 136
ప్రతులకు : పి.ఎస్.ఎం. లక్ష్మి
బి.391, శ్రీ కృష్ణానగర్,,
యూసుఫ్ గూడ,
హైదరాబాద్-500 045,
చరవాణి : 9866001629

కళ్ళతో చూసింది నోటితో చెప్పలేరు చాలా మంది...కాగితం మీద పెట్టలేరు మరికొంతమంది....కళ్ళతో చూసింది, కష్టపడి సేకరించింది కళ్ళకు కట్టినట్టు రాయడం అంత సులభమేమీ కాదు....తమ పుస్తకాల ద్వారా పాఠకులకు యాత్రా దర్శనం చేయించి ఆ అనుభూతిని కలిగించడంలో పి.ఎస్.ఎం లక్ష్మి గారు సిద్ధ హస్తులు...అదే క్రమంలో వారి నుండి వచ్చిన మరో మంచి పుస్తకమే యాత్రాదీపిక -6వది, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ నరసిమ్హ క్షేత్రాలు.
శ్రీ నరసిమ్హ స్వామిని ఇలవేల్పుగా కొలిచే వారికి ఈ పుస్తకం తప్పకుండా పూజా మందిరంలో దాచుకోవలసిన పుస్తకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆధ్యాత్మిక పుస్తకాల మాదిరిగానే కాకుండా, ఆయా క్షేత్రాలలో ఉండే వింతలూ-విశేషాలతో, పర్యటకులనూ ఆకట్టుకునే చక్కని శైలితో కొనసాగుతుందీ పుస్తకం ఆధ్యంతం. మధ్యమధ్యలో అమర్చిన చాయాచిత్రాలు వ్యాసాలకు మరింత వన్నెతెచ్చాయి.

-ఎన్.గోపీ కృష్ణమాచార్యులు

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్