పదవి -బాధ్యత - చలసాని పునీత్ సాయి

Padavi - Badhyatha

సోమనాథ్, రవి బ్యాంకు ఉద్యోగులు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ కష్టపడి పని చేసేవాళ్లు సోమనాథ్ మరింత కష్టపడి పనిచేసేవాడు .రవి కంటే ముందు సోమనాథ్ కు మేనేజర్ గా ప్రమోషన్ లభించింది. రవి కంటే పై స్థాయి ఉద్యోగం .పై స్థాయి ఉద్యోగం లభించిన తర్వాత సోమనాథ్ రవితో మాట్లాడటం మానేశాడు ఇప్పటివరకు మంచి మిత్రులుగా ఉండేవారు. మేనేజర్ ఐ న సోమనాథ్ రవిపై పెత్తనం చెలాయించసాగాడు అలాగే బ్యాంకులోని మిగతా ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించేవాడు .కష్టపడి పనిచేసిన ఈ పద్ధతి ఖాతాదారులను కూడా నొప్పించేది. బాధ్యత తెలియక పదవి అహంకారంతో ఉన్న సోమనాథ్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రవితో సహా అందరూ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఒకరోజు బ్రాంచ్ తనిఖీ కోసం పై బ్రాంచ్ అధికారి హరి రామ్ ఖాతాదారుడి వేషంలో బ్యాంకుకు వచ్చాడు . ఉద్యోగులతో, మిగిలిన ఖాతాదారులతో సోమనాథ్ దురుసు ప్రవర్తన గమనించిన హరి రామ్ నేరుగా సోమనాథ్ వద్దకు వెళ్లి నేను ఖాతాదారున్ని కాదని తనిఖీకి వచ్చిన పై అధికారినని పరిచయం చేసుకున్నాడు. నీ దురుసు ప్రవర్తన మొత్తం పరిశీలించానని తక్షణమే పదవి నుంచి తప్పిస్తున్నానని హరి రామ్ చెప్పాడు. ఆ మాట వినగానే సోమనాథ్ నిర్గాంతపోయాడు పదవి నుంచి తప్పించొద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ ప్రయోజనం లేదు. ఆ మేనేజర్ పదవిలో తానే ఉంటానని హరి రామ్ చెప్పాడు .తన పాత ఉద్యోగం కొనసాగుతుందని సోమనాథ్ కు చెప్పాడు. మేనేజర్ పదవి నుంచి తప్పించిన తర్వాత మరుసటి రోజు బ్యాంకుకు సాధారణ ఉద్యోగిగా వచ్చి తన పాత స్థానంలోనే కూర్చున్నాడు .ఒకప్పుడు ఎలా ఉండేవాడు అలాగే అందరితో ఆప్యాయంగా మాట్లాడడం ప్రారంభించాడు. రవితో మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ సోమనాథ్ ఎంత మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోలేదు. అతనితో అందరూ తీసికట్టుగా వ్యవహరించే వారు. కొద్ది రోజుల్లోనే తన తప్పు తెలుసుకున్నాడు .ఒకరోజు భోజనం విరామ సమయంలో తన తప్పు తెలుసుకున్నానని మేనేజరును అనే అహంకారంతో ప్రవర్తించానని క్షమించమని కోరాడు . సోమనాథ్ మాటలు అతని ప్రవర్తనలో మార్పు గమనించిన రవితో సహా అందరూ సహోద్యోగులు సోమనాథ్ ను క్షమించి ఆదరించారు. హరి రామ్ మేనేజర్ గా సోమనాథ్ రవితో సహా మిగిలిన ఉద్యోగులందరూ తమ పనులు తాము చక్కగా చేసేవారు సోమనాథ్ మరింత కష్టపడి పని చేశాడు. ఇలా మూడు నెలలు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం రవిని బ్రాంచ్ మేనేజర్ గా నియమించాలని పై బ్రాంచ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. హరి రామ్ తిరిగి తన స్థానానికి రావాలని. చక్కగా పనిచేసిన సోమనాథ్ కు మెయిన్ బ్రాంచ్ మేనేజర్ బాధ్యతలు అప్పగిస్తూ పై బ్రాంచ్ నుంచి ఆదేశాలు అందాయి. ఆదేశాల అందిన తర్వాత హరి రామ్ స్వయంగా రవిని మేనేజర్ సీట్లో కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించాడు. తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గా పదోన్నతి పొందిన సోమనాథ్ కు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు మేనేజర్ రవి ,సహోద్యోగులు. ఒకటి రెండు రోజుల్లోనే మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గా సోమనాథ్ పదవి స్వీకారం చేశాడు పదవి అంటే అహంకారం కాదని బాధ్యతను గుర్తించి మరింత బాధ్యతతో మెలుగుతూ అప్పుడప్పుడు తన పాత సహోద్యోగులు మిత్రుడు రవిని కలుస్తూ అనతి కాలంలోనే మరింత ఉన్నత స్థానానికి ఎదిగాడు.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)