నమోః గంగ వీడియో గీతం డల్లాస్, అమెరికా - డా. గజల్ శ్రీనివాస్ -

namo ganga video song

గంగా ప్రక్షాలనపై అవగాహన కలిగించేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్ "నమోః గంగ" వీడియో గీతాన్ని నిర్మిస్తోంది  దీనికోసం శ్రీ రసరాజు మరియు శ్రీ సతీష్  శ్రీవాస్తవ్ లు తెలుగు, హిందీ భాషలలో రచించిన గీతాలను డా. గజల్ శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించి గానం చేసి ఇటీవల రికార్డు చేయడం జరిగింది. పై గీతానికి  డా. గజల్ శ్రీనివాస్ అభినయనం చేస్తుండగా వారణాసి, గంగా పరీవాహక ప్రాంతంలో ఈ వీడియో గీతాన్ని 3 రోజుల పాటు 5 అత్యాధునిక కెమేరాలు ఉపయోగించి పాటను చిత్రీకరించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు తెలిపారు. 

ఈ వీడియో గీతానికి కేంబూరు సతీష్ కుమార్ దర్శకత్వం వహించారని, తోట రమణ ఛాయాగ్రహణం నిర్వహించారని, అతి త్వరలో గ్రాఫిక్స్, ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఈ గీతాన్ని ఢిల్లీలో పెద్దల సమక్షంలో "స్వచ్ఛ గంగ ప్రాజెక్ట్" కి అంకితం చేయనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం