తింగరి మావయ్య - మోహరావు మంత్రిప్రగడ

Tingari maamayya

హలో పద్మగారా! చాలాకాలానికి కనిపించారు,"రండి ఎలా సాగుతోంది మీ యాంకరింగు" అడిగాడు రమేష్. "అదా సరైన పార్టీ దొరకటంలేదండి చాలా చప్పచప్పగా నడుస్తోంది ఏం త్రిల్ లేదండి" అంది పద్మ నీరసంగా. "అయతే మామావయ్య ఒకాయనున్నాడు ఆయన చాలా తింగర మనిషి మంచి పిడివాదకుడు. ఆయన చాలా గొప్పవాడని ఆయనే అనుకుంటాడు లెండి. ఓసారి గాన్నీస్ బుక్ వాళ్ళు వద్దామని ఎవరో ఏదో చెప్పారని మానుకొన్నారటండి. మీరు తట్టుకొంటానంటే ఆయన్ని పిలుస్తాను" అన్నాడు రమేష్.

"అలాగ పిలవండి అలాంటివాళ్ళని ఓ వంద మందిని పడకొట్టేసాను నా టాలెంటుతో" అంది. "మావయ్య ఓసారిరా" పిలిచాడు రమేష్. "ఆ వస్తున్నా" అంటు ఆయన పరుగున బైటకొచ్చాడు. "ఇదిగో వీరు పద్మగారని టివి యాంకరు నిన్ను ఇంటర్య్య చేస్తారట".అన్నాడు రమేష్. "ఓకే అలాగే కాని నేనురెడి" అన్నాడు మావ.య్య. "సరే రమేష్గారు మీకేదైన పనుంటే చూసుకురండి మీరు వచ్చే సరికి ఈయన్ని నేను పడకొట్టేస్తాను" అంది పద్మ నవ్వుతు."సరే నెనలా మార్కెట్టుకు వెళ్ళొస్తా" అని బైటకి దారి తీసాడతను

మావయ్యగారు పద్మకి ఎదురుగా కూర్చొన్నాడు, "సార్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను వాటికి జవాబులు చెప్పండి" అంది పద్మ. "ఓకే అలాగే ఐతె మీరు ముందుగా ఎన్నిప్రశ్నలు అడగాలనుకొన్నారో ముందే అడిగెయండి ఆతరవాత నేను జవాబులు చెప్పడం మొదల పెట్టాక మీకు మరోప్రశ్న అడిగే అవకాసం రాకపోవచ్చు" అన్నాడు మావయ్య. "సరేనండి ముందుగా ఓ ప్రశ్న.మీరుఇంతవరకు పెళ్ళేందుకు చేసుకోలేదు. మీకు సినిమాలంటే ఇష్టమా,మీకు రాజకీయలంటే ఇష్టమా" అడిగింది పద్మ, "అంతేనామరేదైన అడుగుతారా" అని అడిగాడు మావయ్య. ముందువీటికి జవాబు చెప్పండి" అంది పద్మ సోఫాకి జారబడి. మావయ్య ఓ నవ్వు నవ్వి సర్దుకు కూర్చోని మొదలెట్టాడు, ఏవండీ మీరు దోమలు పెళ్ళి చేసుకోవడం చూసారా, అలాగె ఈగలు నల్లులు వివాహంగురించి విన్నారా, చేపలు కప్పలు పెళ్ళి చేసుకొంటయా,అంతెందుకు మనకి రోజు కనపడే కాకులు వివాహం చేసుకొంటాయా, ఒకెలాఉండే నక్కలు కుక్కలు కలిసికాపరం చేస్తాయా, గాడిదలు గుర్రాలు పెళ్ళి చేసుకొంటాయ, అని మొదలెట్టి ఎక్కడ ఆగకుండా నాన్ స్టాపుగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జంతులు పక్షులు గురించి ఆఫ్రికా యడారిలో గల జంతులు వాటి పెళ్ళిళ్ళగురించి, గుక్క తిప్పుకోకుండా చెప్పెస్తున్నాడు, మధ్యలో ఏదో అడుగుదాం అనుకొని ఆయన వాగ్ధాటికి ఆగిపోయింది పద్మ , కళ్ళుతిరిగినట్లయి అలాగే సోఫాలో వాలిపోయింది పద్మ. మావయ్య అదేంగమనించకుండా "ఇప్పుడే వస్తానుండమ్మాయి" అని బయటకి వెళ్ళాడు.

ఇంతలొ రమేష్ వచ్చి పద్మని చుసి కంగారుపడి కాసిన్ని నీళ్ళు మొహంమీద చిలకరించాడు వెంటనె ఆవిడ లెచి "ఆపండి బస్సాపండి నెను దిగాల" అంటు అరచింది. "కూల్ కూల్ పద్మగారు మీరిప్పుడు బస్లొ లేరు మాఇంట్లొ ఉన్నారు" అన్నాడు రమేష్. "ఇది బస్ కాదా విమానమా" అనిఅడిగింది కంగారుగా. ఈసారి రమేష్ సీసా నీళ్ళు ఆవిడ నెత్తిమీద పోసాడు, "వర్షం, వర్షం అంటు అరిచింది. "పద్మగారు మీరు కంగారు పడకండి, లేవండోసారి అన్నాడు "అసలు నాకేమయిందండి నేను ఇక్కడకెలవచ్చాను" అని కంగరుగా అడిగింది. "మీకేంకాలేదు ముందు లేచి నాతొరండి" అని గదిలోకి తీసుకెళ్ళి ఏ సి వేసి అక్కడ కుర్చీలొ కూర్చొ పెట్టాడు. ఆ తరవాత ఓ అరగంటకి ఆవిడ తేరుకొని హాల్లోకి వచ్చింది. రమేష్ టీ ఇచ్చాడు త్రాగింది. ఇంతలో మావయ్య మళ్ళావచ్చాడు, ఆయన్ని చూసి పద్మ కంగారుపడది. "పద్మగారు కంగాపడకండి నే ఉన్నాగా" అన్నాడు, రమేష్. "అరే ఇందాకా మధ్యలో ఆగిపోయింది మిగతాది చెపుతాను" అని కుర్చిలో కూర్చున్నాడు. మావయ్య "అది సరే మావయ్య ఇందాక నీఫ్రండు ఆనందం కనిపించాడు నిన్ను అడిగాడు" అన్నాడు. వెంటనే మావయ్య లేచి వచ్చాడా సన్యసి తప్పించుకు తిరుగు తున్నాడు, ఈవాళ వాడ్ని కడిగేస్తాను" అని బైటకి పరుగు తీసాడు. "అయ్యో అదేమిటండి ఆయనెవరినో బలిచేసారు పాపం" అంది పద్మ. "మీరేం కంగారుపడకండి ఆయన ఈఊరు వదిలేసి వెళ్ళిపోయాడు" అన్నాడురమేష్నవ్వుతు. ఆతరవాత పద్మ వెళ్ళిపోయింది.

మావయ్య డీలాగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. "అదేం మావయ్య ఎప్పుడు ఉషారుగా వచ్చేవాడివి ఈరోజు డల్గా వచ్చావేమిటి" అడిగాడు "అదా నేను ఆ ఆనందం గాడి కోసం వెతుకుతుంటే నాకు మరో ఆయన తగిలాడు ఇదే చాన్సని ఓపట్టుపడదామని కూర్చున్నా, ఆయన నాకంటే మహా అవధాననుకొంటాను కాలుకేస్తే వేలికి వేలికేస్తే కాలికి వేసి ముప్పుతిప్పలు పెట్టి మూడుచరువుల నీళ్ళు తాగించాడురా" అని వాపోయాడు మావయ్య. "పోనిలే మావయ్య నాలుగురోజులాగి వెళ్ళు ఆపాటికి ఆయనవెళ్ళాపోతాడు" అన్నాడు రమేష్. "ఒరే నేను రేపటినించీ ఈపిడివాదం వదిలేద్దామనుకొంటున్నానురా" అన్నాడు మావయ్య. "అదేంమావయ్య" ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. "అంటే ఇంతకాలం నేనందర్ని పిడివాదం వాదించి బాధించేవిడిని కాని ఈరోజు నేనుబాధ పడ్డాక తెలిసిందిరా నావల్ల ఎదరవాళ్ళు ఎంత బాధ పడ్డారోఅని అందుకని దీనికి స్వస్ధి చెపుదామనుకొంటున్నానురా" అన్నాడు మావయ్య. "మంచి నిర్ణయం మావయ్య" అన్నాడు రమేష్. ఆరోజునించి మావయ్యని చూసి ఎవరు పారిపోవటం లేదు************

మరిన్ని కథలు

The wake
ది వేక్
- AKEPATI KRISHNA MOHAN
Taalibottu
తాళిబొట్టు
- అనిసా తబస్సుమ్ sk (Anisa Tabassum sk)
Aatmarpana
ఆత్మార్పణ
- డా: సి.హెచ్. ప్రతాప్
Cherigina sarihaddulu
చెరిగిన సరిహద్దులు
- డా: సి.హెచ్. ప్రతాప్
Pay back to society
పే బేక్ టు సొసైటీ
- కామేశ్వర రావు రాపాక