కంటిని కాపాడే శుక్లాలు - .అంబడిపూడి శ్యాం సుందర రావు

kantini kapade shuklaalu
శుక్లము అనేది  సామాన్యముగా  వృద్దులలో ఎదురయే కంటి చూపుకు సంబంధించిన సమస్య.  చూపు మందగించి క్రమేణ అంధత్వము ప్రాప్తిస్తుంది కాబట్టి ముందుగానే లక్షణాలను బట్టి సమస్యను గుర్తించి శస్త్ర చికిత్సద్వారా నయము చేసుకోవచ్చు. ప్రస్తుతము లయన్స్ ,రోటరీ వంటి స్వచ్చంద సంస్తలు ప్రముఖ నేత్ర వైద్యాలయాలు క్యాంపులు నిర్వహిస్తు పేదలకు ఉచితముగా శుక్లాలకు ఆపరేషన్లు చేస్తున్నారు. మనము ఈ "శుక్లాలు (కేటరాక్టు)" గురించి కొంత తెలుసుకుందాము .

ఈ శుక్లము అనేది కంటి లోని కటకములో వచ్చే సమస్య దీని ఫలితముగా ముందు చూపు మసకబారుతుంది క్రమేణ హ్రస్వదృష్టి(మయోపియ) గా మార్పు చెందుతుంది. ఈ దశలో వ్యక్తీ నీలము రంగును గుర్తించలేడు. ఈ దశలో సరిఅయిన వైద్యము అందకపోతే పూర్తీ అంధత్వము వస్తుంది . చిన్న వయస్సులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వృద్దాప్యములో దీని బారిన పడకుండా రక్షింప బడవచ్చు ముఖ్యముగ ఎక్కువ కాలము స్టీరాయిడ్శ్ (ఉత్ప్రేరకాలు) ట్రాంక్విలైజర్లు(మత్తు పదార్ధాలు) సోరియాసిస్ (చర్మవ్యాధి) సంబంధించిన మందుల వాడకము వల్ల త్వరగా కంటిలో శుక్లాలు ఏర్పడవచ్చు. అదేవిధముగా మధుమేహ వ్యాధి గ్రస్తులు రక్తములో గ్లూకోజ్ శాతాన్ని అదుపు చేసుకోక పోతే వీరిలో  చాలా ముందుగా చిన్న వయస్సులోనే  శుక్లాలు ఏర్పడే అవకాశము ఉన్నది .
కళ్ళను అతినీల లోహిత కిరణాలనుంచి కాపాడుకోవాలి ఈ కిరణాలు శుక్లాలను కలుగజేస్తాయి అందుచేత ఎండలో తిరిగేటప్పుడు చలువ కళ్ళద్దాలను  వాడటము మంచిది .

నేత్రవైద్ల్యులు శాస్త్ర వేత్తల అభిప్రాయము ప్రకారము యాంటి ఆక్సిడెంట్ విటమిన్లు విటమిన్ సి ,విటమిన్ ఇ మరియు బీటా కెరోటిన్ వంటి పోషకాలు శుక్లాలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి .కాబట్టి పైన చెప్పిన పోషకాలను శరీరానికి అందేటట్లు చూసుకోవాలి వెన్న నూనెలు (ఆలివ్ ఆయిల్ తప్ప) ఉప్పువంటి ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటము వల్ల శుక్లాలు వచ్చే అవకాసాలు ఎక్కువ అవుతాయి. మధుమేహము అదుపుపులో లేనప్పుడు వీరు,  ముఖ్యముగా కంటికి ఏదైన గాయము అయినప్పుడు  చూపు మసక బారినప్పుడు అశ్రద్ద చేయకుండా నేత్ర వైద్యుడిని సంప్రదించాలి లేకపోతే అందులవుతారు  కంటిచూపు బాగా ఉండటానికి అవసరమైన విటమిన్ ఎ అధికముగా గల ఆహారము అంటే ఆకు కూరలు,టమోటాలు,నిమ్మ జాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. క్యాడ్మియమ్,ఐరన్ కాపర్,సీసము వంటి లోహాలను  ఆహారములో లేకుండా దురముగా ఉంచాలి. ఇవి శుక్లాలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి  ఏది ఏమైనా వయస్సును ఆపలేము కాబట్టి పెరిగే వయస్సు ద్వారా వచ్చే శుక్లాలను నివారించలేము కాని తగిన జాగ్రత్తలు మంచి విటమిన్ సహిత ఆహారము తీసుకోవటమువల్ల శుక్లాలు త్వరగా వచ్చే అవకాశాన్ని వీలైనంత వరకు ఆలస్యము చేయవచ్చు.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు