సినీ పాటల - రచయితలు .
మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.
పాటలోని భాగాలు .
పల్లవి : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
అనుపల్లవి : పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి 3-5 ఉంటాయి.
పాటల రకాలు.
అప్పగింతల పాటలు, ఎంకి పాటలు ,కలుపు పాటలు, కూనలమ్మ పదాలు, కోతల పాటలు, గొబ్బిళ్ళ పాటలు ,చెక్కభజన పాటలు ,జట్టిజాం పాటలు,జానపద గీతాలు,జోల పాటలు,దేశభక్తి గేయాలు,నాట్ల పాటలు, నీలగిరి పాటలు,పిల్లల పాటలు,పెళ్ళి పాటలు,లాలి పాటలు,మంగళహారతి పాటలు,మేలుకొలుపు పాటలు,భక్తి పాటలు,విషాద గీతాలు,యుగళ గీతాలు,శివుని పాటలు,సినిమా పాటలు,రాముని పాటలు వంటివి ఎన్నో.ఇలా పలు రకాల పాటలు ప్రచారంలో ఉన్నా బంగారు ఊయలలోనో, చిరుగుల చీరలోనో ,పాత పంచలోనో ఊగుతూ,మనం వినేతొలిపాట , అమ్మ పాడే జోలపాట. కఛ్ఛితంగా ఈభూమిపైన ఇదే తొలి పాట .
తొలి సినిమా పాటగా గుర్తింపు ' జాజ్ సింగర్ ' అనే ఆంగ్ల చిత్రం( 6/10/ 1927) లో తొలి శబ్ధ చిత్రంలో వచ్చింది . ఈచిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి.
తొలుత మన సినిమాల్లో పాటని ' కీర్తన ' అనేవారు . భారత దేశపు తొలి శబ్ధ చిత్రం ఆర్ధేష్ ఇరాని ' ఆలం ఆరా ' ఈ సినిమా నాలుగు నెలల కాలంలలో, నలభై వేల రూపాయలతో ,10,500 అడుగుల నిడివితో నిర్మించ బడింది. ఈ చిత్రం (14/3/1931) న బొంబాయి లోని మెజస్టిక్ ధియోరలో విడుదల జరిగింది. ఇందులో ' దేదే ఖుదాకి నామ్ సే ' అనే పాట ఫకీరు పాత్రధారి w.m.ఖాన్ స్వయంగా పాడుకున్నారు.
మరి మన తెలుగు సినీ గేయ రచయితలు పాటతో కాని,పద్యంతో కాని ఏసంవత్సరం ,ఏసినిమాతో రంగప్రవేశం చేసారో ఇప్పుడు తెలుసుకుందాం!.
చందాల కేశవదాసు - భకక్త ప్రహ్లాద 1932.
బలిజేపల్లి లక్ష్మికాంతం - లవకుశ " "
వారణాసి సీతారామ శాస్త్రి - సీతా కల్యాణం 1934.
చిలమర్తి లక్ష్మి నరసింహం - సతీ సక్కుబాయి 1935.
స్ధానం నరసింహరావు - శ్రీకృష్ణ తులాభారం 1935.
అయ్యగారి బాపిరాజు శర్మ - సంపూర్ణ రామాయణం 1936.
వేదుల సత్యనారాయణ శాస్త్రి - ప్రేమ విజయం. 1936.
పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి - ద్రౌపతి వస్త్రాపహరణం 1936.
దువ్యురి రామి రెడ్డి - సతీ తులసి 1936.
బి.టి.రాఘవాచారి - బాలయోగిని 1937.
స్ధానపతి సత్యనారాయణ శాస్త్రి - దశావతారములు 1937.
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి - విప్రనారాయణ 1937.
కనకతార - సముద్రాల రాఘవాచార్యులు 1937.
ప్రపుల్ల చంద్ర - విప్రనారాయణ 1937.
యస్ .సి.హెచ్ .కృష్ణామా చార్యులు కచ - దేవయాని 1938.
మల్లాది విశ్వనాధ కవి రాజు - భక్త మార్కండేయ 1938.
చిత్రపు హనుమంతురావు - జయప్రద 1939.
బుచ్చన్న శాస్త్రి - వెంకటేశ్వర మహత్యం " " .
విశ్వనాధం - " " " " ".
వెంకట్రామ నాయుడు - రైతుబిడ్డ 1939.
తుమ్మల సీతారామమూర్తి - " " " ".
దైతా గోపాలం - వరవిక్రయం 1939.
కొసరాజు రాఘవయ్య చౌదరి - రైతుబిడ్డ 1939.
కాటూరి - మీరాబాయి 1940.
కొప్పరపు సుబ్బారావు - చండిక 1940.
వేలూరి శివరామ శాస్త్రీ భోజకాళిదాసు " ".
తల్లావజ్ఘుల శివశంకర శాస్త్రి - విశ్వమోహిని " ".
పింగళి నాగేంద్రరావు - భలేపెళ్ళి 1941.
వెంపటి సదాశివ బ్రహ్మం - తెనాలి రామకృష్ణ 1941.
శంకరంబాడి సుందరాచారి - దీనబంధు 1942.
శ్రీరాముల సచ్చితానంద శాస్త్రి - భక్త కబీరు 1943.
బాలాంత్రపు రజనీకాంతారావు - స్వర్గసీమ 1945.
ఊటుకూరి సత్యనారాయణ - మాయామశ్ఛింద్ర " "
తాపీ ధర్మారావు - మోహినీ రుక్మాంగద 1947.
నరసింహ మెహతా - మనదేశం 1947.
దుర్భా - సువర్ణమాల 1948.
ప్రయాగ - బాలరాజు " ".
ఆరుద్ర - బీదలపాట్లు 1950.
వడ్డాది - " " " "
తోలేటి వెంకటరెడ్డి -అదృష్టదీపుడు 1950.
ఆదినారాయణరావు - పల్లెటూరిపిల్ల " ".
కొండముది గోపాలరాయ శర్మ - శ్రీలక్ష్మమ్మ కథ 1950.
ఆచార్య ఆత్రేయ -దీక్ష 1951.
కోపల్లి వెంకటరమణ రావు - చంద్రవంక 1951.
దేవులపల్లి కృష్ణశాస్త్రి - మల్లేశ్వరి 1951.
శ్రీశ్రీ - నిర్ధోషి 1951.
విశ్వనాధ సత్యనారాయణ - ఆకాశరాజు 1951.
వేదాంతం లక్ష్మికాంతకవి - మాయలమారి " ".
సుదర్శనాచార్య యన్ .టి. - పెంకిపిల్ల " ".
మల్లాది రామకృష్ణ శాస్త్రి - చిన్నకోడలు 1952.
అనిసెట్టి సుబ్బారావు - రాజేశ్వరి 1952.
గిడుతూరి సూర్యం - " " " ".
సుంకర - పల్లెటూరు 1952.
వాసిరెడ్డి - " " " " .
సముద్రాల జూనియర్ -బ్రతుకుతెరువు 1953.
మల్లాది వేంకట కృష్ణ శర్మ -పరదేశి " " .
ముద్దుకృష్ణ - పక్కింటి అమ్మాయి 1953.
అయ్యపు వెంకట కృష్ణయ్య - పుట్టిల్లు " ".
యండమూరి సత్యనారాయణరావు - రొహిణి " ".
యడవల్లి లక్ష్మినారాయణ - నాయీల్లు " ".
సూరిశెట్టి సాంబశివరావు బాబ్జి - లక్ష్శి " ".
రావూరి వెంకిట సత్యనారాయణ - చక్రపాణి 1954.
కొండెపూడి లక్ష్మీ నారాయణ - జ్యోతి " ".
కొనకళ్ళ వెంకటరత్నం - అంతామనవాళ్ళే " ".
న్యాయపతి రాఘవరావు - బాలానందం " " .
న్యాయపతి కామేశ్వరి - " " " ".
పినిశెట్టి - బీదల ఆస్తి 1955.
జి.కే.మూర్తి - సదారమ 1956.
పరశురామ్ - నాగుల చవితి . " ".
ఆచార్య బి.వి.యల్ .యన్ - చరణదాసి 1956.
ఎరమాకుల ఆదిశేషారెడ్డి - భాగ్యరేఖ 1957.
రామ్ చంద్ - వద్దంటే పెళ్ళి 1957.
యల్లోరా - శోభ 1958.
రాజశ్రీ - ఆడపెత్తనం 1958.
జంపన - పతిభక్తి 1958.
పి.వసంతకుమార్ రెడ్డి - శోభ 1958.
బి.యన్ .చారి - వీరభాస్కరుడు 1959.
జాషువా - వచ్చిన కోడలు నచ్చింది " ".
తాండ్ర సుబ్రమణ్యం - సతీతులసి " ".
మహరథి - కూతురు కాపురం " ".
నారపరెడ్డి - జయభేరి " " .
పాలగుమ్మి పద్మరాజు - భక్త అంభరీష 1959.
మస్త్నూరు కృష్ణమూర్తి - రమాసుందరి 1960.
దాశరధి - వాగ్ధానం 1961.
కోటా సత్యరంగయ్య శాస్త్రి " " .
సి.నారాయణరెడ్డి - గుళేబకావళికథ 1962.
వీటూరి - స్వర్ణగౌరి 1962.
నార్ల చిరంజీవి - ఆరాధన " ".
కొంగర జగ్గయ్య - పదండి ముందుకు " " .
ముళ్ళపూడి వెంకట రమణ -ప్రేమించిచూడు 1965 .
ఆదుర్తి సుబ్బారావు - మంగళసూత్రం. 1966.
అప్పలాచార్య - పొట్టీప్లీడరు 1966.
కనకమేడల - విజయెశంఖం " ".
వసంతాదేవి కే.జి. - " " " " .
యస్వీ.భుజంగరాయ శర్మ - రంగులరాటట్నం 1967.
వక్కలంక లక్ష్మిపతిరావు - గొప్పవారి గోత్రాలు " " .
మల్లెమాల - భార్య 1968.
వడ్లమాని పార్ధసారధి - గ్రామదేవతలు 1968.
విద్వాన్ రాజశేఖర్ - జీవితంధం " ".
సరోజిని వి. - చిన్నారిపాపలు " ".
ఎ.వేణుగోపాలాచార్యులు -అమాయకుడు " ".
సి.యస్ .రావు. - మామకు తగ్గ కోడలు 1969.
విశ్వప్రసాద్ - జగత్ కిలాడిలు 1969.
మైలవరపు గోపి - చిరంజీవి 1969.
చక్రవర్తి - సంగీత దర్శకుడు మళ్ళిపెళ్ళి 1970.
నల్లరామ్మూర్తి - మెరుపు వీరుడు 1970.
సి.వి.రమణ - మూగప్రేమ 1970.
అంకిశ్రీ - జైజవాన్ - జైకిసాన్ " ".
జి.విజయరత్నం - కథానాయకురాలు 1971.
ఉషఃశ్రీ - మానవుడు దానవుడు 1972.
మొదుకూరి జాన్స్ న్ " " " ".
జి.రామారావు - అత్తను దిద్దిన కోడలు 1972.
వేటూరి సుందరరామ్మూర్తి - ఓసీత కథ 1974.
గుంటూరు శేషాద్రిశర్మ - ముత్యాల ముగ్గు 1975.
దాసరి నారాయణరావు - మనుషులంతా ఒక్కటే 1976.
గణేష్ పాత్రో - అల్లుడొచ్చాడు 1976.
జాలాది - పల్లెసీమ 1976.
దాసం గోపాలకృష్ణ - చిల్లకొట్టు చిట్టెమ్మ 1977.
నాగభైరవ కోటేశ్వరరావు - గడుసు అమ్మాయి " " .
గొల్లపూడి మారుతిరావు - గడుసు అమ్మాయి 1978.
ఎమ్వీయల్ - ఇంటింటి రామాయణం 1979.
నార్ల రామిరెడ్డి - కార్తికదీపం 1979.
అదృష్టదీపక్ - యువతరం కదిలింది 1980.
తాతినేని చలపతిరావు - " " " ".
ఆచార్యతిరుమల - డప్పుసాయిగాడు 1980.
ధవళ సత్యం - ఎర్ర మల్లెలు 1981.
ప్రభు - " " "" .
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ -కృష్టావతారం 1982.
వంగపండు ప్రసాద్రావు -విప్లవశంఖం " " .
విజయలక్ష్మి - " " " " .
గజ్జల మల్లారెడ్డి - ప్రజాశక్తి 1983.
శ్రీకాంత్ - ప్రజాశక్తి 1983.
సత్యనారాయణ యస్వి. - ప్రజాశక్తి 1983.
జ్యోతిర్మయి - మూడుముళ్ళు " ".
బళ్ళాకృష్ణస్వామి - నేటిభారతం " " .
భానూరి సత్యనారాయణ - నవోదయం " ".
గద్దర్ - రంగులకల 1984.
లక్ష్మి నారాయణ కె. - దేశంలో దొంగలు పడ్డారు 1985.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి -సిరి వెన్నెల 1986.
సాహితి - కిలాడి కృష్ణుడు 1986.
వతా కృష్ణంరాజు - సంసారం ఓ సంగీతం 1986.
భువన చంద్ర - నాకు పెళ్ళాంకావాలి 1987.
యస్ .పి.బాలసుబ్రహ్మణ్యం - పడమటి సంధ్యారాగం 1987.
జొన్నవిత్తుల - రౌడి పోలీస్ 1987.
శ్రీసాయి హర్ష -సిరిపురం చిన్నోడు 1988 .
రసరాజు - అల్లుడుగారు 1990.
వేదవ్యాస - రంగవల్లి " ".
జే.కే.భారవి - " " " ".
గురుచరణ్ - మాయింటికథ " ".
సుద్దాల అశోక్ తేజా - నమస్తే అన్నా 1994.
సామవేదం షణ్ముఖ శర్మ - పెదరాయుడు 1995.
వెన్నెలకంటి - శ్రీరామచంద్రుడు 2003.
పైడిపాల గారి సౌజన్యంతో .
ఛాయాచిత్రం : భువనచంద్ర గారితో వ్యాసకర్త.

