గోతెలుగు కథాసమీక్షలు - కర్రా నాగలక్ష్మి

 

 

సి.ఉమాదేవిగారి కథ ' కిటికీలో చెయ్యి '  గురించి చెప్పాలంటే రచయిత్రి చిన్న అజాగ్రత్త ని చక్కని కథగా మలిచారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు . స్థూలంగా ఆఫీసులో వున్న విశ్వం నిద్ర పోవాలనే కోరికతో కథ మొదలవుతుంది , కలీగ్స్ యెగతాళుల మధ్య రాత్రి తాను చూసిన కిటికీలో చెయ్యి గురించి చెప్తాడు . విశ్వం స్నేహితులలోకలిగిన సందేహాలే మనలో కూడా తలెత్తుతాయి . చివరలో యెలక్ట్రీషియన్ పొరపాటు వల్ల పెద్దాయనకి కలిగిన యిబ్బంది , రాత్రి నిద్రపట్టక డాబా పైకి వచ్చిన విశ్వం కిటికీలో చెయ్యి చూసిపెద్దాయనని రక్షించడం తో తిరుగు పొరుగు వారు  చాలా రాత్రి వరకు తమతమ అనుభవాలు చెప్పుకోవడంతో  విశ్వం రాత్రి నిద్ర కి దూరమవుతాడు. కథ యింతే , కాని యీ కథ చదువుతూ వుంటే మనకు మన అనుభవాలు గుర్తుకు రాక మానవు . ఇలాంటి చిన్నపెద్ద అనుభవాలు మనందరకీ అయేవుంటాయి.  ఇంట్లోవాళ్లు వుండి కూడా పెద్దాయనని పట్టించుకోలేదు అంటే కాస్త బాధ అనిపించినా అందరికీ కనువిప్పు కలుగ చేసే కథ . ఇలాంటి నిర్లక్ష్యాలకు చిన్నపిల్లలు మరణించడం కూడా చాలాచోట్ల జరిగింది కూడా.

 ' అబ్బే మా కెప్పడూ అలాంటి అనుభవం కాలేదు ' అని  యెవరైనా అంటే మాత్రం నమ్మకండి . ఏది యేమైనా కధ చిన్నదైనా చాలా రోజులు మనని వెంటాడుతూ వుండే కథ . చిన్న సంఘటనని తీసుకొని చివరివరకు ఊపిరి బిగబట్టి చదివించేటట్లు రాసిన రచయిత్రిని అభనందించకుండావుండలేము . మీరూ యీ కథ చదివేవుంటారు లేకపోతే కింద లింకు ఓపెన్ చేసి చదవండి

http://www.gotelugu.com/issue101/2660/telugu-stories/kitikeelo-cheyyi/

మరిన్ని వ్యాసాలు

జలియన్ వాలాబాగ్ .2.
జలియన్ వాలాబాగ్ .2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జలియన్ వాలాబాగ్ .1.
జలియన్ వాలాబాగ్ .1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital mayajalam lo navataram
డిజిటల్ మాయాజాలంలో నవతరం
- సి.హెచ్.ప్రతాప్
మన చరిత్ర పరిరక్షకుడు బ్రౌన్ .
మన చరిత్ర పరిరక్షకుడు బ్రౌన్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మెకంజి.
మెకంజి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అపర భగీధరుడు కాటన్ దొర.
అపర భగీధరుడు కాటన్ దొర.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు