గోతెలుగు కథా సమీక్షలు - ..

కథ : మార్పు
రచయిత :  పి.బి రాజు గారు
సమీక్ష : నల్లాన్ చక్రవర్తుల గోపీ కృష్ణమాచార్యులు 
గోతెలుగు 82వ సంచిక!

 

ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులపట్ల పిల్లలకు భయం కంటే భక్తీ, గౌరవం వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. కానీ, ప్రస్తుత కాలంలో అటు ఉపాధ్యాయుల్లోనూ, ఇటు విద్యార్థుల్లోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి. దండన అనేది పిల్లల సక్రమమైన పెరుగుదలకూ, అభివృద్ధికీ ఆవశ్యకం. అయితే, దండన తప్పుదారి పట్టేటప్పటికి పిల్లలూ, తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి.

ఇకపోతే, రచన రెండు రకాలు. ఒకటి ముక్కుసూటిగా చెప్పడం, రెండు వర్ణనను జోడించి చెప్పడం. 'మార్పు ' కథాగమనంలో రచయిత పి.బి.రాజు మొదటి దారినే ఎంచుకున్నారు. ఈ కథకు ముక్కుసూటిగా చెప్పడమే సరైంది. పిల్లలపట్ల తల్లిదండ్రుల ప్రేమ హద్దుల్లో వుండడం మంచిదని చక్కగా వర్ణించారు. కథ చదవక ముందే అందులోని భావాన్ని సంపూర్ణంగా పాఠకులకు ఆకళింపు చేసేది బొమ్మ. మార్పు కథకు మాధవ్ వేసిన బొమ్మ కథలోని అంతర్లీనమైన భావాని ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది.

సమాజాన్ని అంతర్గతంగా బాధిస్తున్న సున్నితమైన అంశాన్ని చక్కని కథగా అందించిన రచయిత పి.బి.రాజుకూ, ఆ కథకు గీతల్లో అందమైన రూపునిచ్చిన మాధవ్ అభినందనీయులు. ఇలాంటి చక్కని కథలను అందిస్తున్న 'గో తెలుగు.కాం' వారికి కృతజ్ఞతలు.

 

  మీరూ యీ కథ చదివేవుంటారు లేకపోతే కింద లింకు ఓపెన్ చేసి చదవండి http://www.gotelugu.com/issue82/2193/telugu-stories/marpu/

 

 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం