సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question

1) తెలంగాణా వార్తా పత్రికల్లో తెలంగాణా మాండలికంలో వార్తలుండాలి. లేకపోతే ఆ యాసని, ఆ పదజాలాన్ని పరిరక్షించుకోలేము. జనం మాట్లాడే యాసే భాష. ప్రస్తుతం ఉన్న తెలంగాణా దిన పత్రికల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రా పేపర్లలో భాష లాగే ఉంటోంది.

2) యాసలు పలురకాలు. ఉత్తరాంధ్ర, విశాఖ, గోఓదావరి, నెల్లూరు, గుంటూరు, సీమ ...ఇలా! ఒక్కో యాసకి ఒక్కో పత్రిక ఉంటే దేనికీ పాఠకులు పెద్ద సంఖ్యలో ఉండరు. తెలుగు భాష ఎక్కడ ఏ విధంగా మాట్లాడినా పత్రికా భాష మాత్రం ఒక్కటే ఉండాలి. అప్పుడే భాష ఉనికి ఉంటుంది. లేకపోతే నానా గందరగోళంగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణా పత్రికలు అనుసరిస్తున్న తీరు సరైనదే.
 

పై రెండింట్లో ఏది కరెక్ట్?