23-06-2017 నుండి 29-06-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద  చేపట్టిన పనులను స్వల్ప సమయంలో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆత్మీయులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట అనేది సూచన. ఉద్యోగంలో అసంతృప్తిని కలిగి ఉంటారు,చాలావరకు సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకోనుటలో విఫలం అవుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొనుట అలాగే నూతన పెట్టుబడులకు దూరంగా ఉండుట సూచన. మీ ఆలోచనల్లో అలాగే మానసికంగా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు అనుగుణంగా మెలగడం వలన మేలుజరుగుతుంది. 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. చేపట్టు పనుల విషయంలో స్పష్టత ఉండుట ద్వారా మరింత ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. అధికారుల నుండి పనిఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో మార్పులకు అవకాశం ఉంది వాటికి అనుగుణంగా మీయొక్క ఆలోచనలు మార్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు,వారినుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయల్లో కాస్త ఇబ్బందిని పొందుతారు. సోదరుల నుండి సమయానికి సహకారం లభిస్తుంది. మొండినిర్ణయాలు తీసుకొనే అవసరం వచ్చే అవకాశం ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి.  
 

.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయోగాలు చేయుటకు ఇష్టపడుతారు. అధికారులతో నూతన పనులను ఆరంభించే విషయంలో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. రాజకీయరంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు అలాగే పరిచయాలు కలుగుతాయి. చిననాటి మిత్రులు లేదా మీ శ్రేయోభిలాషుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన లేదా తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో బద్ధకం వీడండి. సర్దుబాటు విధానం కొన్ని కొన్ని విషయాల్లో అవసరం అని గుర్తిస్తారు. విదేశీప్రయాణ అవకాశాలు మెరుగుపడుతాయి,ప్రయత్నం చేయుట సూచన. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది.         

 


కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన నలుగురిలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంభంలో సంతానం విషయంలో మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. మానసికంగా అనుకోని ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థిరాస్తి లేదా చరాస్థి కొనుగోలు విషయంలో తగిన శ్రద్ద తీసుకోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింత బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి విలువైన సమాచారం పొందుతారు అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరకశ్రమను కలిగి ఉంటారు ముఖ్యంగా భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట సూచన. మార్పులను స్వాగతించుట వలన నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం లభిస్తుంది.



 సింహ రాశి :  ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో గతంలో ఆగిన పనులను ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం ఆశించిన మేర ఫలితాలను ఇస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క మాటతీరు మీ అనుకొనే వాళ్ళను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే బద్దకాన్ని వదిలి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. విలువైనవాటిని కొనుగోలుచేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మానసికంగా అధికంగా ఊహించుకోవడం వలన కొంత ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు.  

 

కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద ఉద్యోగప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడుతాయి, ఒకనాటి పరిచయాలు ఈ విషయంలో మీకు సహాయపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం కలదు. నూతన పెట్టుబడులకు సంబంధించి పనులు వేగంగా ముందుకు కదులుతాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. స్త్రీ / పురుషుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశం నుండి ఒక వార్తను వినే అవకాశం ఉంది. బంధువులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మీయొక్క మాటతీరును సరిదిద్దుకోకపోతే మాత్రం వివాదాలు ఏర్పడే అవకాశం కలదు. నూతన పరిచయాలు అయ్యే ఆస్కారం కలదు.  
 

తులా రాశి : ఈవారం మొత్తంమీద స్పెక్యులేషన్ వ్యపారాలు చేయు వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు సమయాన్ని వృధాచేసే అవకాశం ఉంది జాగ్రత్త. పెద్దలతో చర్చలు చేయునపుడు వారి ఆలోచనలు గమనించి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉండి వాటిని పూర్తిచేసే దిశగా  అడుగులు వేస్తారు. అధికారులతో కలిసి చేపట్టిన పనులలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది,వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. కుటుంబంలో విలువైన వస్తువులను కొనుగోలుచేసే అవకాశం ఉంది.  

   

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. నూతన ప్రయత్నాలు ఇతరులతో కలిసి పనిచేసే విషయంలో సర్దుబాటు విధానం వలన లబ్దిని పొందుతారు. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. మేరె ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం కలదు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంప్రదాయ పనులలో బాగా రాణిస్తారు కావున,ఈ విషయంలో సరైన ప్రయత్నాలు చేయుట మంచిది. సోదరసంబంధమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది,సర్దుబాటు విధానం మంచిది. సంతానం మూలాన సంతోషాన్ని పొందుతారు,వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు.     

 

ధనస్సు రాశి :   ఈవారం మొత్తంమీద జీవిత భాగస్వామితో మీ ఆలోచనలు పంచుకొనే విషయంలో ఏమాత్రం తొందరపాటు లేదా ఆవేశం వద్దు, మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట వలన లబ్దిని పొందుతారు. తోటివారితో సర్దుకుపోకపోతే నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులతో కలిసి సమయాన్ని విందులకు ఇస్తారు వాటిలో పాల్గొంటారు . ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయత్నం చేయండి. చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది. 

 

మకర రాశి :  ఈవారం మొత్తంమీద  విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఒక సంతోషకరమైన వార్తను వినే అవకాశం ఉంది. సినిమారంగంలోని వారికి మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును. సంతానం మూలాన అనుకోని ఖర్చులను పొందుతారు. వ్యాపారసంబంధమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి ఊహించని మార్పులకు ఆస్కారం ఉంది. వాహనముల మూలాన లేక అగ్నిసంభందమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. గతంలో మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో గుర్తింపును పొందుతారు. మానసికంగా దృడంగా ఉండుట వలన విలువైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.

 

   కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద గతంలో ఎప్పుడో మీరు తీసుకున్న నిర్ణయాల వలన ఇప్పుడు లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. ఉద్యోగంలో మాత్రం బాగుంటుంది అలాగే అధికారులకు అనుగుణంగా తీసుకొనే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దూరప్రదేశం నుండి విలువైన సమాఛారం అందుతుంది. మీయొక్క మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును కావున సర్దుబాటు అవసరం. మానసికంగా చిన్న చిన్న విషయల మూలాన అధికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం అనేది సూచన. మిత్రులతో చేయు చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. కుటుంభసభ్యుల నుండి సహకారం ఆశిస్తారు మిశ్రమఫలితాలు వస్తాయి.      

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద  విదేశీ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన కాలం. ఉన్నతవిద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. కాస్త ప్రయత్నం పెంచుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో సత్సంభందాలు ఉంటారు అలాగే వారితో కలిసి చర్చాసంబంధమైన విషయాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో సభ్యులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే క్రమంలొ అనుగుణంగా వ్యవహరించుట మేలు. మాటపట్టింపులకు పోకపోవడం వలన విభేదాలు తగ్గుతాయి. చాలావిషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు  అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చర్చలకు దూరంగా ఉండుట వలన లాభం పొందుతారు.

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం