కాకూలు - సాయిరాం ఆకుండి

భలే మిత్రులు

అందరూ అధికారం అడిగేవారే ...
బాధ్యతగా నిలబడేవారు లేనేలేరే!

పాలకవర్గమూ ప్రతిపక్షమూ ఒకటే దారి...
పరదాలు తీసేస్తే అసలు రంగు వేరే!!


అన్ - రియాలిటీ షో

సహజత్వానికి దూరంగా రియాలిటీ షోలు...
ఛానెళ్లకు నిజంగా ఇవి రాబడి మార్గాలు!

సహనాన్ని పరీక్షించే ఓవర్ రియాక్షన్లు...
చిరాకును కలిగించే డబ్బింగ్ ఎక్స్ ప్రెషన్లు!!


ప్రజాస్వామియం

ప్రజలమధ్య ద్వేషాలను రగిలించడం...
సామరస్య పునాదులను పెకిలించడం...

సహజీవన సౌందర్యానికి మసి పూయడమ్...   
పబ్బం గడవాలంటే తప్పదు మరి జగడం!!  

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు