షాపింగ్‌మాల్స్‌కి వెళ్లి డ్రస్సులు సెలెక్ట్ చేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. ఇంట్లో కూర్చునే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేయడం నయా ఫ్యాషన్. ఇప్పుడు దాన్ని కూడా డామినేట్ చేసే మరో కొత్త ఫ్యాషన్ వచ్చేసింది. అదే మన వద్ద ఉన్న వాటిలో నుండే కొత్త కొత్త ట్రెండ్స్‌ని క్రియేట్ చేసుకోవడం ఈ నయా ఫ్యాషన్ ట్రెండ్. ఈ ట్రెండ్‌నే ఫాలో చేస్తోంది నేటి యువత. సోషల్ మీడియాని యూజ్ చేసుకుని నయా ట్రెండ్స్‌లో మెలకువలు నేర్చుకుంటోంది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందిస్తోంది. వీటన్నింటికీ సోషల్ మీడియా కరెక్ట్ ప్లాట్‌ఫామ్ అయ్యింది. సోషల్ మీడియాను యూజ్ చేసుకుని, మన చిట్టి మెదడుకు కూసింత పదును పెడితే చాలు ఎవ్వరూ ఊహించని, ఇంతకు ముందెవ్వరూ ధరించని కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఎంచక్కా ఇంట్లో కూర్చునే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ధరించడమే కాదు, ఇతరులకూ ఈ నయా ట్రెండ్స్‌ని సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ తరహా ఆన్‌లైన్ బిజినెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది.
అలా పుట్టుకొస్తున్నవే రకరకాల ఆన్‌లైన్ బిజినెస్‌లు. వీటికి యూత్ బాగా ఎట్రాక్ట్ అవుతోంది. ఈ రకమైన వేలో బిజినెస్ చేయడానికీ, షాపింగ్ చేయడానికీ రెండు వైపులా ఎట్రాక్ట్ అవుతున్నారు. బయటి ధరల కన్నా, ఇక్కడే తక్కువ ధరలకు వస్తున్నాయని వినియోగదారులు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ బిజినెస్ మూడు పువ్వులు ముప్పై ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో సంపాదించే జీత భత్యాల కన్నా ఈ రకమైన ఆన్‌లైన్ బిజినెస్ కారణంగానే ఎక్కువ ఆదాయం లభిస్తోందని అంటోంది నేటి యువత. ఇద్దరు ముగ్గరు ఓ టీమ్‌లా ఫామ్ అయ్యి ఈ బిజినెస్‌లో భాగస్వాములవుతున్నారు. ఈ ఫ్యాషన్‌కి కేవలం హైఫై ట్రెండ్సే కాకుండా, ట్రెడిషనల్ వేర్, వెడ్డింగ్ వేర్, కిడ్స్‌వేర్ అంటూ రకరకాలుగా డివైడ్ చేసి సేల్ చేస్తున్నారు. అంతేకాదు, వయసుకు తగ్గట్లుగా కొత్త కొత్త డిజైన్స్‌ని ఫాలో చేస్తున్నారు. వినియోగదారులకు వీటిని అత్యంత అందుబాటులో ఉంచుతుండడంతో ఇంట్లో కూర్చునే హాయిగా, సులువుగా షాపింగ్ చేసే అవకాశం దక్కుతోంది.
అలాగే ఆఫీసుల్లో బాస్‌తో చీవాట్లు, హెచ్‌ఆర్‌తో అగచాట్లు పడాల్సిన పని లేకుండా అమ్మాయిలు ఇంటివద్ద నుండే ఈ బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూనే పార్ట్ టైంగా కొందరు ఈ బిజినెస్‌ను అవలంభిస్తుంటే, మరికొందరు వేల సంఖ్యలో జీతాలు వదులుకుని మరీ ఈ ఆన్‌లైన్ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక సంఖ్యలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ తరహా బిజినెస్‌కి సంబంధించిన అనేక శాఖలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు. అత్యంత సులువుగా ఈ బిజినెస్‌ని అవలంభించవచ్చు. ఇంకెందుకాలస్యం. వీటితో టచ్‌లో లేని వాళ్లెవరైనా ఉంటే, వెంటనే కనెక్ట్ అవ్వండిక.