ముందడుగు - Prabhavathi pusapati

Mundadugu

"అబ్బబ్బబ్బా ఒక్క పిల్లాడు కేబీసీ ప్రోగ్రాం లో దురుసుగా మాట్లాడాడు అని మొత్తం సోషల్ మీడియా అంతా పేరెంటింగ్ మీద,ప్రెజెంట్ కిడ్స్ బిహేవియర్ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి అనుకో ,కాంటీన్ లో అంతా దీని మీద చర్చ చేస్తున్నారు"లంచ్ బాక్స్ టేబుల్ పై పెడుతూ అంది సుమేధ . మంచిదే కదా ,ఒక రకంగా ఆ ఇన్సిడెంట్ అందరిని ఆలోచింప చేసేలా చేసింది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను ,తప్పు ఆ కుర్రాడిదా?ఉద్యోగాల్లో ఉండి మంచి నడవడిక నేర్పని తల్లితండ్రులదా?కేవలం మార్కులు,ర్యాంకులు మాత్రమే విద్య అని నేర్పుతున్న టీచర్లదా లేక అతను అలా మాట్లాడటనికి ఇండైరెక్ట్ గా దోహదం చేసిన సమాజమా అని "అంది సమీర. అంటే నీ ఉద్దేశ్యం ఏమిటే ?తల్లితండ్రుల తప్పంటావా ?లక్షలు సంపాదించే ఉద్యోగాలు వదులు కోమంటావా? తనని ఉద్దేశించి అనటం లేదు కదా అని అంది సుమేధ గుమ్మిడికాయ దొంగ సామెతలా.. " వదులు కోమని కాదు, పిల్లల అవసరాన్ని బట్టి తగిన మార్పులు చేసుకోవాలి కదా ,లేకుంటే రేపు సమాజం తప్పు దోవ పడితే నష్ట పోయేది మనమే కదా ,మనకి కూడా కొంత భాద్యత ఉంది కదా" లేచి మేనేజర్ రూమ్ లోకి వెళ్ళబోతూ అంది సమీర. చెప్పడం తేలికమ్మా ! ఇన్ని లక్షలు వచ్చే ఉద్యోగాలు మళ్ళీ తేలికగా వస్తాయా?అంతెందుకు నువ్వు వుద్యోగం మానగలవా? నువ్వు మానేస్తాను అన్న రేపు నిన్ను చేసు కోబోయే విహారి,వాళ్ళ కుటుంబం ఒప్పుకుంటుందా ? ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా అంది సుమేధ. మేనేజర్ రూమ్ నిండి వచ్చింది కానీ సుమేధ అడిగిన ప్రశ్న మనసులో తిరుగుతూనే ఉంది,జాబ్ చెయ్యాలా ,వద్దా అన్నది నా వ్యక్తి గత అభిప్రాయం అయినా కూడా పెళ్ళికి ముందే విహారి తో నా నిర్ణయం ఇది అని తెలపాల్సిన ధర్మం ఉంది అని పించి,సాయంత్రం ఆఫీస్ కాంటీన్ లో కలుద్దామని మెసేజ్ పెట్టింది. "మన పెళ్లి జరగాలి అని అంటే నాది ఒక కండిషన్ .మీరు అంగీకరిస్తేనే మన పెళ్లి "ఎదురుగ కూర్చున్న విహారి కళ్ళల్లోకి చూస్తూ ఇది చాల ఖచ్చితం అన్నంత ధృడంగా చెప్పింది సమీర " ఏమిటో ఆ కండిషన్ ,అంత సీరియస్ గా చెపుతున్నావు,కొంపదీసి పెళ్లి అవ్వాలి అంటే రోజులో ఒకసారి నేను వంట చెయ్యాలా ?" వాతావరణం తేలిక చెయ్యాలని సమీర చేతులు దగ్గరికి తీసు కొంటూ నవ్వుతు అడిగాడు విహారి. " నవ్వులాట కాదు ,మీతో నా పెళ్లి జరగాలి అంటే నేను పెళ్లి అయ్యాక జాబ్ చెయ్యను,ఫ్యూచర్ లో మీకు US వెళ్లే అవకాశం వచ్చిన మనం అక్కడికి వెళ్లము.మీరు ఈ రెండింటి కి ఒప్పుకుంటే మన పెళ్లి . బలవంతం లేదు ,ఇక్కడికి మిమ్మలిని రమ్మన్నది ఇప్పుడే మీ నిర్ణయం చెప్పాలని కాదు .ఆలోచించి జవాబు చెప్పండి "చేతులు వదిలించు కొని లేచినిలబడుతూ చెప్పింది. మీతో పర్సనల్ గా మాట్లాడాలి అంటే ,మన పెళ్లి ఎలా జరగాలి,ఎక్కడ జరగాలి,నీ పర్సనల్ టేస్ట్ ఏమిటి ?మన ఫ్యూచర్ గురించి మాట్లాడతావు అని ఎన్నో మధుర భావాలు ఊహించుకొని వస్తే ,ఇదేంటి సమీర?సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు?కొంచెం బిత్తర పోయిన మొహం తో వెళ్ళడానికి సిద్ధ మవుతున్న సమీర ని పట్టు కొని కుర్చీ లో కూర్చో పెట్టి అడిగాడు. జాబ్ చెయ్యక పోవడం .US వెళ్తామా లేదా అన్నది అంత పెద్ద విషయం ఏమి కాదే ,అంత చిన్న కారణాలకి పెళ్లి వద్దనడం ఏమిటి ?విహారి గొంతు లోకొంచెం నిరాశ ,బాధ ధ్వనించాయి. నిజమే విహారిగారు ,నేను పెళ్లి వద్దని అనడం లేదు ,మీతో పెళ్లి జరుగుతుంది అని అనుకొన్నాను కాబట్టి పెళ్లి తర్వాత మన ఫ్యూచర్ బాగుండాలి అని పెళ్ళికి ముందే నా వుద్యోగం ,US ప్రయాణం పట్ల నా నిర్ణయం మీకు తెలియచేయాలని రమ్మన్నాను ,ఇప్పుడు వెంటనే జరగటం లేదు కాబట్టి పెద్ద విషయం లా అనిపించదు ,రేపు సమయం వచ్చినప్పుడు ఇదే పెద్ద విషయం లా,ఘోర అపరాధం లా అనిపిస్తుంది,అందుకే అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ...అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన నీకు ఎందుకు కలిగింది ?సమీర మాటలకు అడ్డు వస్తూ అడిగాడు. మీకు నా ఆలోచన ధోరణి వింత లా అనిపించ వచ్చు,ప్రస్తుత సమాజం లో జరుగుతున్న కొన్ని భయంకర సంఘటనలు వింటున్న ,చూస్తున్న నేనే కాదు సమాజం పట్ల భాద్యత వున్న నా లాంటి ఆడ పిల్లలు అందరు ఇలాగె ఆలోచించాలి. భలే దానివే అందరు ఇలాగె ఆలోచిం చాలా?? ఆడ పిల్లలు మేము అన్నింటి లోను మగపిల్లల కన్నా ఎక్కువ ,దేనిలోనూ వాళ్లకన్నా తక్కువ కాదు అని మగవాళ్ళతో పోటీపడి చదివి ,పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడుతున్న ఈ రోజుల్లో నీ మాట వింటే అంత నిన్నే తప్పు పడతారు కొంచెం ఆవేశంగా అన్నాడు. "నేను చెప్పింది మీకు సరిగా అర్థం అవ్వలేదు విహారి గారు ,నేను ఆడవాళ్ళని చదువు కోవద్దని అనటం లేదు ,అది ఆడ మగా అని కాదు ఎవరైనా సరే తమకి ఆర్ధిక అవసరం లేకుంటే ఉద్యోగాలు చెయ్యవద్దని అంటున్నాను,అంతే కాదు ఆడ పిల్లకి పెళ్లి తో వచ్చే బరువులు భాద్యతలు ,పిల్లల ఆలనా పాలనా కూడా సరిగా నిర్వహించాలి అంటే పూర్తి సమయం వాటికీ కేటాయించాలి . "సమీర కుర్చీ ముందుకు జరిపి కూర్చుని తన భావం క్లియర్ గా చెప్పింది. "సమీరా నువ్వు పెద్ద కంపెనీ లో మంచిజీతం తో పని చేస్తున్నావు,నువ్వు ఆధునిక తరానికి ప్రతీక అలాంటి నువ్వు ,అవసరం లేక పొతే జాబ్ చెయ్యాల్సిన పని లేదు అనడం నాకు వింతగా అనిపిస్తోంది,ఇప్పుడు ప్రతి వారు వుద్యోగం చెయ్యడమే తమ జీవిత లక్ష్యం అనేలా పనిచేస్తున్నారు,అంతెందుకు మా మదర్ ,మీ మదర్ కూడా జాబ్ చేసారు కదా , ఐన మనం మన గురించి వదిలేసి ... కరెక్ట్ విహారిగారు,యు అర్ రైట్ ,మా మదర్,మీ మదర్ అప్పటి సామజిక ఆర్ధిక అవసరాల వలన తప్పని పరిస్థితి లో ఉద్యోగాలు చేసారు,ఇంచుమించు ప్రతి కుటుంబ స్థితి ఆలా ఉండటం వలన ఇష్టము వున్నా లేక పోయిన ఎంత కష్ట మైన ఎదుర్కొని జాబ్స్ చేసారు.అందుకు మన తరం ప్రొఫెషినల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్,మెడికల్ ఇలాంటి చదువులు చదవడానికి తమ వంతు ఆర్ధిక సాయం కూడా చేసారు. " అప్పట్లో ఆడవాళ్ళూ మగవారికి మేము ఎందులోనూ తీసి పోము,మాకు కూడా మగ వారిలా సమాన హక్కులు కావాలి అని తెగ పోరాడారులే" కొంచెం హేళన ధ్వనించేలా ఇప్పడు ఇవన్నీ ఎందుకు అనేలా మొహం పెట్టి అన్నాడు. మీరు అన్న దానితో నేను ఏకిభవిస్తాను.అప్పటి తరం ఆలా ఆలోచించడానికి ఆ కాలం లో వున్న సామజిక ,ఆర్ధిక స్థితిగతులు కారణం .స్త్రీ కి సోషల్ సెక్యూరిటీ ఉండాలి అంటే తన కాళ్ళ మీద తాను నిలబడాలి అందుకు చదువు,ఆర్థిక సహాయం ఎంతో అవసరం అయ్యాయి.అందుకే మన అమ్మమ్మ తరం లోఅంతగా ప్రాముఖ్యం ఇవ్వని స్త్రీ విద్య ని అమ్మ వాళ్ళ తరం లో ప్రతి ఆడ పిల్ల చదువు కోవాలి,ముఖ్యంగా ఆర్ధికంగా ఎవ్వరి మీద ఆధార పడకూడదు అని మగ పిల్లలతో సమానంగా చదివించారు. " సమీర ప్లీజ్ ,మనం మాట్లాడు కోవలసింది మన గురించి కానీ,సమాజం గురించి కాదు,నాకు నువ్వు నీతో పెళ్లి ఇవి చాల ముఖ్యం".సంభాషణ గంభీరంగా మారుతుండటం తో"పద,బయట చల్లటి గాలి వీస్తోంది కొంచెం సేపు పార్క్ లో నడుద్దాము" అని సమీర ని లేపి బయటికి అడుగులు వేసాడు. మనం కూడా సమాజం లో భాగమే కదా,అని చిన్నగా నవ్వి నేను చెపుతున్నది రేపు మన భవిష్యత్తు గురించే,అదే మన కాపురం ,పిల్లలు అంటు బెంచి మీద కూర్చుంది. ఓహ్ ఓకే ! పిల్లలు గురించి కూడా ఆలోచిస్తున్నావు అంటే ,మంచి ప్లానింగ్ మీద ఉన్నట్టు వున్నావే,కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతూ సమీర పక్కనే కూర్చున్నాడు. మనం అనే కాదు మనలాంటి యువతి యువకులు అందరు ఆలోచిస్తేనే రాబోయే తరం బాగుంటుంది,మీరే చూడండి ఇప్పుడు ఎటువైపు చూసినా హింస ,రెస్ట్ లెస్ నెస్ ,ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి దానికి అసహనం ,తెంపరితనం,భాద్యత లేక పోవడం ఎన్ని దుర్గుణాలు చూస్తున్నాము. " ఇవి మన తరం లో లేవని నీ ఉద్దేశ్యమా?" ప్రతి భావం చక్కగా చెపుతున్న సమీర వైపు రెప్ప వాల్చా కుండా చూస్తూ అడిగాడు. లేవని కాదు ,కానీ సమాజం ఉలిక్కి పడేలా ఘటనలు జరిగేవి కావు,అప్పట్లో తల్లి తండ్రులు పిల్లల ని తీర్చి దిద్దటం లో తమ భాద్యత కొంతే నిర్వహించినా,స్కూల్ సినిమాలు,సమాజం కూడా కొంత భాద్థ్యతాయుతం గా ప్రవర్తించేవి.ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి వారి చేతిలో మొబైల్స్ వలన అసభ్య పదజాలం తో సామజిక మాధ్యమాలు ,హింస ప్రధానం గా చిత్రాలు ,ఫ్యాషన్ పేరు తో వెర్రి పోకడలు ఇలా ప్రతీది వారిని తప్పు దారికి మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి . ఇప్పుడు వీటికి మన పెళ్ళికి సంబంధం ఏమిటో ?వుద్యోగం మానేయటం లేదా విదేశాల్లో బ్రతికే అవకాశం వదులకొన్నంత మాత్రాన సమాజం లో మార్పు వస్తుందని నీ అభిప్రాయమా?మన యువతరం ఎలా మార్పు తీసుకొని రాగలదని నీ ఆలోచన ? "సమీర చెపుతున్నది తేలిక విషయం కాదు అనిపించి కొంచెం సాంత్వనగా అడిగాడు. " మన పెళ్లి ,అదే నేను వుద్యోగం మానేయటం ,లేదా US కి వెళ్లక పోవటం అన్నది దీనికి పరిష్కారం కాదు,కానీ ఇలాంటి ప్రస్తుత సమాజం లో పెళ్లి కావాల్సిన మనలాంటి వాళ్ళు తల్లితండ్రులు, పిల్ల ల పట్ల ,సమాజం పట్ల మనకి కూడా భాద్యత వుంది అని తెలుసుకొని అందుకు తగిన విధం గా జీవన విధానం మార్చుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.ఇప్పుడు చాల కుటుంబాల్లో తల్లితండ్రులు పెద్ద వయసులో ఐన వాళ్ళు దగ్గర లేక ఒంటరితనం తో బాధ పడుతున్నారు కదా ఇండియా లో ఉండి వాళ్ళకిమేము వున్నాము అన్న భరోసా కలిగేలామనం ఇక్కడే జీవించ వచ్చు కదా , అలాగే మంచి భవిష్యత్తు వున్న పిల్లలు సరైన పెంపకం లేక ఎలా పెడదారి పడుతున్నారో కూడా చూస్తున్నాము కదా " ఓపికగా తన భావాలని గౌరవించి వింటున్నందుకు కృతజ్ఞత గా విహారి చేతిని తన చేతిలోకి తీసుకొంటూ చెప్పింది. " మన స్వార్ధం మనది వీళ్ళకోసం మనమేమి త్యాగాలు చెయ్య నవసరం లేదు ,సమాజం ఎలా పొతే మన కి ఏమిటి అని అనుకోవడం కరెక్టా చెప్పండి." "నువ్వుచెప్పింది నన్ను కూడా ఆలోచించేలా చేసింది ,ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. నువ్వు కొంచెం టైం తీసుకో,మనం రేపు ఆఫీస్ అయ్యాక కలుద్దాము .పద వేడిగా ఒక కాఫీ తాగి రిలాక్స్ అవుదాము అంటు సమీర చేతిని తన చేతిలోకి తీసుకొని కార్ వైపు వెళ్ళాడు. సమీర విహారి ఒకే ఆఫీస్ లో వేరు వేరు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు.సమీర పేరుకు తగ్గట్టుగా అందంగా నాజూకుగా ఉంటుంది.ఆఫీస్ లో చేరిన అతి కొద్దీ రోజులకే అన్ని విషయాల లోను తన కంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకొంది. సమీర వ్యక్తిత్వం,మాటకారితనం ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.విహారి మొదటి సారి సమీర ని చూసినప్పుడే అమితంగా ఇష్టపడ్డాడు.మాటలతో మొదలైన స్నేహం ఒకరిని ఒకరు ఇష్టపడేలా చేసింది.ఇరువురి కుటుంబాలు కూడా తమ ఆమోదం తెలిపాయి.పెళ్లి విషయాలు మాట్లాడు కొందాము అని అనుకునే లోపల ఈ రోజు సమీర తన అభిప్రాయం చెప్పింది .విహారి మనసు అంతా సమీరమీద గౌరవం తో నిండి పోయింది . కారు నడుపుతున్నాడే గాని మనసు సమీర చెప్పిన సంఘటనల గురించి ఆలోచిస్తోంది .నిజానికి పెళ్లి అయ్యి ,పిల్లలతో వుద్యోగం చెయ్యడం ఎంత కష్టమో ప్రతి రోజు చెల్లెలు సంధ్య US నుండి ఫోన్ లో చెపుతూనే ఉంది ఐతే ఈ రోజు సమీర తల్లి తండ్రులు పిల్లల పెంపకం లో సరైన శ్రద్హ చూపక పొతే దాని ప్రభావం సమాజం మీద కూడా ఎంత విపరీత పరిణామాలు చూపిస్తుందో వివరించింది. నిజమే , ప్రస్తుత సమాజం ఎంత భాద్యత రహితంగా తయారు అవుతోంది. ప్రతి వారికీ డబ్బు సంపాదన మీదనే ఆలోచన,ప్రతి రంగం లోని వారు సమాజం పట్ల తమ బాధ్యతని దాదాపు మరిచి పోతున్నారు. వస్తున్న సినిమాలు ,సాహిత్యం,వేషధారణలు, ఒకటి ఏమిటి ప్రతి దానిలోనూ వెర్రి పోకడలు కనపడుతున్నాయి .పేపర్ లో పిల్లలు తల్లితండ్రుల్ని డబ్బు కోసం చంపటం,స్కూల్ పిల్లలు కత్తి తో పొడిచి చంపటం,చిన్న పిల్లలలో విపరీతమైన అసహనం ఇలా లెక్కలేనన్ని సంఘటనలు నిత్యం చూస్తూనే వున్నాము. ఆలోచనలతోనే ఇల్లు చేరి" అమ్మ అమ్మ!ఇలా రా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" బట్టలు మార్చుకొని సోఫా లో కూర్చుంటూ పిలిచాడు. ఏమిటి రా? ఏమైంది అలావున్నావు ?వచ్చి న్నప్పటినుంచి అలా మౌనంగా వున్నావు? కాఫీ చేతికి అందిస్తూ అడిగారు వర్ధనమ్మగారు. ఈ రోజు సమీర ని కలిసాను అమ్మ .నీకో విషయం చెప్పాలి అంటుండగానే ఫోన్ మోగింది . " US నుంచి సంధ్య అనుకొంటా "పిల్ల తెగ నలిగి పోతోంది అటు వుద్యోగం తోనూ ,పిల్లల తోనూ ,వుద్యోగం మానేసి ఇంటిని ,పిల్లలిని చూసుకో మంటే వినదు కదా అంటు లేచి మొబైల్ తీసుకొన్నారు . స్పీకర్ లో వుంది అటు నుంచి సంధ్య ఏకబిగిన కష్టాలు ఏకరువు పెడుతోంది."అమ్మ ! ఈ రోజుపనికి నేనీ రాలేదు,చిన్నవాడికి వళ్ళు వెచ్చపడింది,సింక్ నిండా గిన్నెలు పడి వున్నాయి,శేషు క్యాంపు కి వెళ్ళాడు,సరుకులకు ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళాలి,నా ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఎల్లుండి,ఇలా నాన్ స్టాప్ గా చెపుతోంది . వర్ధనమ్మగారు ఏమి చెప్పాలో తెలియక ఆడ పిల్లలికి ఎంత ఓరిమి ఉండాలి ,ఇల్లు పిల్లలు ఎలా సమర్దించు కోవాలి అని సంధ్య ని ఊరడిస్తూ మాట్లాడుతున్నారు . సంధ్య నుండి ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్న ఎన్నడూ విహారి వాటి మీద అంతా దృష్టి పెట్టలేదు,మొదటిసారిగా సంధ్య పడుతున్న కష్టం విలువ ఏమిటో తెలిసినట్టు అయ్యింది. సంధ్య చెప్పిన విషయాలు అన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసినట్టు ఒక్క వుదుటన లేచి ఫోన్ తీసుకొని "సంధ్య !కొన్నాళ్ళు అమ్మని ,నాన్నని నీ దగ్గరికి పంపిస్తాను కానీ ,నువ్వు బావ మీ ఇద్దరికీ ,పిల్లలికి ఏమి సరిచేసి కొంటే జీవితం అందం గా ,అనందంగా గడపగలుగు తారొ అలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది" అని పనిలో పని సమీర పెళ్లి తర్వాత ఎందుకు వుద్యోగం మాని వేయాలి అనుకుంటోందో చెప్పి తను కూడా ఆ నిర్ణయం తో ఏకీభవిస్తున్నాను అని సంధ్య కి,తల్లికి ఒకేసారి చెప్పాడు. హాట్స్ ఆఫ్ రా అన్నయ్య! మంచి ఆలోచన వున్న సమీర లాంటి అమ్మాయి దొరికినందుకు ,ya నేను కూడా చాల రోజుల నుంచి వుద్యోగం మానివేయాలి అని వున్నా చూస్తూ చూస్తూ లక్షలలో వచ్చే జీతం వదులుకోలేక ,నిత్యం నరకం చూస్తున్నాము.ఇల్లాలిగా ,తల్లిగావుంటూ సమర్ధవంతం గా వుద్యోగం కూడా నిర్వహించ గలను అన్న ధీమా కలిగిన రోజున మళ్ళీ వుద్యోగం చేస్తానురా,తన ఆలోచన నాకు కూడా మంచి ప్రేరణ ఇచ్చిందని నా మాటగా సమీర కి చెప్పు,మళ్ళీ కాల్ చేస్తాను "అంటూ ఫోన్ పెట్టేసింది సమీర ముందు చూపుతో తన భావి జీవితంఎంత మధురంగా సాగుతుందో అని తెగ సంబర పడి అలాంటి వున్నత ఆలోచనలు వున్న వ్యక్తి తన భాగస్వామి అవ్వటం తన అదృష్టం అని భావించి ఎప్పుడు ఎప్పుడు తెల్లవారు తుందా ?ఎంత త్వరగా సమీర ని కలిసి తన అంగీకారం చెప్పాలి అని విహారి మనసు తొందర పడుతోంది. తమ లాగే పెళ్లి కావాల్సిన యువతి యువకులు అందరు వ్యక్తిగత జీవితం తో పాటు సమాజానికి కూడా ఉపయోగ పడేలా తమ జీవితాలని అవసరమైనంత వరకు తీర్చి దిద్దుకునేలా ముందడుగు వెయ్యాలని ఆశిస్తూ రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తున్నాడు విహారి.

మరిన్ని కథలు

Tanku malina dhatrmam
తనకు మాలిన ధర్మం
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Pedda bottaame katha
పెద్ద బొట్టామె కథ
- హేమావతి బొబ్బు
Guruvu viluva
గురువు విలువ
- తాత మోహనకృష్ణ
సంకల్పం
సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manchini bratakanivvaru
మంచిని బ్రతకనివ్వరు
- మద్దూరి నరసింహమూర్తి
Padavi - Badhyatha
పదవి -బాధ్యత
- చలసాని పునీత్ సాయి