ఏదో ఒకటి సాధించడం కాదు - ..

Can not achieve something
విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీకు విలువైనదిగా అనిపించే దానికోసం సంతోషంగా మీరు చేసే నిరంతర కృషి.

ఒక అవకాశం వస్తుందా లేదా అన్న విషయం ప్రపంచంలోని ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక అవకాశం తలుపుతట్టినప్పుడు, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? విజయానికి, అపజయానికి మధ్య ఉన్న తేడా ఇదే. మీరు విజయం సాధించాలంటే, మీకు కావలసింది - దానిపట్ల ఉత్సాహం, అందుకై కృషి చేసేందుకు సుముఖత. జీవితం పట్ల ఉత్సాహం ఉన్నవారికి, అసలు ఖాళీ సమయం ఎక్కడ ఉంటుంది. చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది, అది పనే అవ్వాలని ఏం లేదు. మీకు నచ్చినవి చేస్తుంటే, అసలది పనిలానే అనిపించదు. అసలు ఎప్పుడూ భారంగా అనిపించదు. మీరు చేసే పనిని ఆస్వాదిస్తున్నట్లైయితే, మీరు అది చేయడానికి 24 గంటలు సిద్ధంగా ఉంటారు. మరేదో చేయాలనుకుంటే - పాడండి, ఆడండి, ఏదైనా కొత్తది తయారు చేయండి, లేడా కొత్త విషయాన్ని శోధించండి - అది పర్వాలేదు. కానీ అలా ఊరికే ఉండకండి. మీ శరీరం, మనస్సు వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేసే లాగా వాటిని ఉంచండి.

మీకు చేయడానికి ఏదీ లేదంటే, మీ జీవితంలో ఎదుగు బొదుగు లేదని అర్థం. మీకు అలాంటి స్థితి ఎప్పుడూ రాకూడదని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు పారే నదిలా ఉంటే, చేయడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. మీకు తెలిసేలోపే జీవితం అయిపోతుంది. మీరు నూరేళ్లు జీవించి, మీ పూర్తి సమయాన్ని వెచ్చించినప్పటికీ, మానవ మేధస్సు ఇంకా మానవ చైతన్యం యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సమయం సరిపోదు. ఈ సమయం జీవించవలసిన సమయం, విశ్రాంతి తీసుకోనే సమయం కాదు. మిమ్మల్ని పాతి పెట్టినప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీకు విలువైనదిగా అనిపించే దానికోసం సంతోషంగా మీరు చేసే నిరంతర కృషి.