జయించడం ఎలా? - ..

How to conquer

మీరు మీ వ్యక్తిగతమైన హద్దులను చెరిపితే, అది చాలా సులువు అవుతుంది. ఎందుకంటే, మీరు అలా ఉంటే, మరో వ్యక్తిని కూడా మీలో భాగం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. అక్కడ ఉన్నవారు పురుషుడైనా, స్త్రీ అయినా, పిల్లవాడైనా, ఇక సమస్య ఉండదు. మీరు అందరితో, అన్నింటితో, ఏ విధమైన హద్దులు లేకుండా సంభాషించగలరు, ఎందుకంటే మీరు హద్దులను చెరిపేశారు. మీరు మీ హద్దులను దృఢం చేసుకుంటేనే మీకు సమస్య. అక్కడ ఉన్నది పురుషుడైతే ఒక రకమైన సమస్య, స్త్రీ అయితే మరో రకమైన సమస్య ఉంటాయి. 

ఇతరులను కలిసినప్పుడు వచ్చే ఆదుర్దాను జయించడం ఎలా?

మీరు మీ పైన కృషిచేసి, అటువంటి స్థిమితతను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. అది కేవలం మనుషితోనే కాదు, జీవంతోనే. మీరుగా ఉన్న ఈ జీవాన్ని కేవలం ఇతరులతోనే కాదు, మొత్తం జీవంతో స్థిమితతకు తేవాల్సిన అవసరం ఆసన్నమైంది. మీలో స్థిమితత్వం లోపిస్తే, మీ పూర్తి శక్తిని, సామర్ధ్యాన్ని, మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.

ప్రతి జీవిలో ఒకరకమైన ప్రతిభ ఉంటుంది. కానీ దానిని తెరవకుండానే, అనుభూతి చెందకుండానే 99% శాతం వ్యక్తులు జీవిస్తారు, మరణిస్తారు కూడా. అది పూర్తిగా తెరచుకోవాలి, మీలో సామర్ధ్యం, ప్రతిభ ఉంటే, అవి తెరచుకుంటే మీ జీవితం స్థిమితంగా ఉంటుంది. 

దానికై యోగా అనే పూర్తి సాంకేతికత  ఉన్నది. అది మీరు మీ శారీరక, మానసిక, శక్తిపరమైన ఒడిదుడుకులకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంది. మీరు దీనిని ఓ స్థాయికి తీసుకువెళితే ఎవరితోనైనా మీరు స్థిమితంగానే ఉంటారు. ఆందోళనలో అన్నీ వక్రంగా కనబడతాయి. అందుకే స్థిమితంగా ఉండటమన్నది చాలా ముఖ్యం, లేకపోతే మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు. 

ఇషా ఫౌండేషన్ సౌజన్యం తో 

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు