హరివిల్లు - నండూరి సుందరీ నాగమణి

harivillu kavitha

నీ ఊహ ఊదా రంగును సంతరించుకొని...
నాలో తీయని ఊపిరైన వేళ...

నీలిరంగు ఆకాశంలా నా మనసు
నీ తలపుల రంగును అడ్డుకున్న వేళ...

నీలిమ నింపుకున్న నా కురులు...
నీ పైని చిలిపి ఆలోచనల్లా ఊగుతున్న వేళ...

మన వలపుల పచ్చదనం...
హృదయక్షేత్రంలో మమతల పైరులైన వేళ...

పసుపు పోసిన గడపంత పవిత్రంగా...
మన పరిణయం జరిగిన శుభవేళ...

నారింజ రంగు ఉదయ సంధ్యలు
మన ప్రభాతాన్ని వెచ్చగా తడిమిన వేళ...

ఎరుపు రంగు సిగ్గు నిగ్గై బుగ్గల్లో చేరి...
మన రేపటి జీవితశోభలు పండించేవేళ...

ఎప్పటికీ వెలియని ఏడురంగుల ఇంద్ర ధనువై...
మన దాంపత్యం... జీవిత గగనంలో...
ఇలా నిలిచిపోయింది శాశ్వత ప్రేమ చిహ్నమై...

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు