ఇవీ పెడుతున్నారా - గోతెలుగు ఫీచర్స్ డెస్క్

ఇవీ పెడుతున్నారా

ఫ్రిజ్.....ఈపేరు తెలియని వాళ్ళే కాదు, ఈ వస్తువు ఇంట్లో లేనివాళ్ళు కూడా దాదాపు తక్కువేనని చెప్పవచ్చు....అంతగా అన్నివర్గాల ప్రజలకు అవసరమైపోయిన ఫ్రిజ్ మీ ఇంట్లోనూ ఉందిగా...సరే మీ ఫ్రిజ్ ని ఎలా వాడుతున్నారు? ఏమేం పెడుతున్నారు ఫ్రిజ్ లో?? ఇదేం ప్రశ్న?

వాడడం ఏముంది? తినే వస్తువులు పాడైపోకుండా దాచుకోవడమేగా అనుకుంటున్నారా? అదే పొరపాటని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. చాలామంది ఫ్రిజ్ ని పాతసామాన్ల పెట్టెలాగా ఉపయోగిస్తారు...అంటే  అన్నీ అందులో పడేయడం...తీయడం తప్ప ఎప్పుడో ఒకసారి గానీ అన్నీ తీసి శుభ్రం చేయకుండా అలాగే వదిలేయడం చేస్తూంటారు...కచ్చితంగా వారానికొకసారి ఫ్రిజ్ ని శుభ్రం చేయకపోతే తాజాగా ఉండడం సంగతేమో గానీ అన్నీ కుప్పలుగా పారేయడం వల్ల పాడైపోయే ప్రమాదమే ఎక్కువ. అలాగే ఇంకో ముఖ్యమైన సంగతేమిటంటే, ఫ్రిజ్ లో ఏమేం పెడుతున్నామనేది ఒకసారి అవలోకిద్దాం...ముఖ్యంగా ఈ క్రింది ఏడు మాత్రం పెట్టవద్దు

1) ఉల్లిపాయలు
2) బంగాళా దుంపలు
3) వెల్లుల్లిపాయలు
4) తేనె
5) బ్రెడ్
6) కాఫీ గింజలు
7) అరటి పళ్ళు

ఇవన్నీ తాజాగా ఉండడానికి గాలీ-వెలుతురూ అవసరమయ్యే వస్తువులు..వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తాజాదనమే కాక వాటి సహజమైన రుచి వాటిలోని పోషక విలువలు కోల్పోయే ప్రమాదముంది. వీటికి ఫ్రిజ్ లో దాచాల్సినంత శీతల వాతావరణం అస్సలు అవసరం లేదు కూడా...గుర్తుంచుకుందాం.. శాస్త్రవేత్తల సూచనలను పాటిద్దాం ఈ ఏడు వస్తువులను ఫ్రిజ్ లో దాచకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు