సూపర్ పవర్ కాబోతున్నాం - గోతెలుగు ఫీచర్స్ డెస్క్

becoming india super power

చైనా లో కరోనా లక్షణాలు బయటపడి, కట్టడి చేసేలోగానే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి...వేలు, లక్షల్లో కరోనా బారిన పడి వైద్యుల నిర్విరామ కృషి వల్ల అతికష్టం మీద బయట పడగలిగారు. వైరస్ బయట పడిన చైనా ప్రధాన పట్టణం వుహాన్ ఇప్పటికీ లాకవుట్ లోనే ఉంది...
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశం మాది...మమ్మల్నెవరూ-ఏ శక్తీ ఏమీ చేయలేదన్న అధ్యక్షుడి తల పొగరుతో ప్రారంభ దశలో కరోనాని పట్టించుకోక, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత కట్టడి చేయలేక అమెరికా జుట్టు పీక్కుంటోంది....ప్రజల ఆరోగ్యం కన్నా డాలరే మిన్న అనే పక్కా వ్యాపార సూత్రాన్ని నమ్మే ట్రంప్ తప్పుడు ఆలోచనా ధోరణే పరిస్థితి ఇంత వరకూ రావడానికి ప్రధాన కారణమని సాక్షాత్తూ అమెరికన్లే వాపోతున్నారు....
ఇక ఈ పరిస్థితికి మిగతా దేశాలూ ఏం తీసిపోలేదు.
ఇటలీ అయితే శవాల దిబ్బగానే మారిపోయింది...మంచం మీద ప్రాణాలొదిలిన వారెందరో- అవసాన దశలో ఉన్నవారెందరో కూడా గమంచించే దిక్కు లేదు....ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వార్తలు చూస్తున్న ప్రతి ఒక్క భారతీయుడి గుండె దడదడలాడుతోంది....
అందరినీ వేధిస్తోన్న ప్రశ్న ఒక్కటే..
అవన్నీ ఏనాడో అభివృద్ధి చెందిన దేశాలు...వైద్య, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బలమైన పునాదులపై గర్వంగా నిలిచిన దేశాలు...మరెందుకు కొన్ని నెలల వ్యవధిలోనే కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి? మందుల్లేవా? వైద్యుల్లేరా? వైద్య పరికరాల్లేవా?? 
ఒక్కటే సమాధానం....కరోనా వైరస్ కి మందు లేదు....వ్యాప్తి చెందకుండా చూసుకోవడమొక్కటే మార్గం....
అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఒక్క విషయంలోనే ఘోరంగా వైఫల్యం చెందాయి...అదే అలసత్వం...మొదటి దశలో వైరస్ వ్యాప్తిని పట్టించుకోకపోవడం.....
మన పాలకులు సరిగ్గానే మేలుకున్నారని చెప్పవచ్చు....బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగాలన్నీ అప్రమత్తమై ప్రజలను కరోనా బారి నుండి కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి...ఎందుకంటే, అభివృద్ధి చెందిన దేశాలే మూడోదశకు చేరిన కరోనాని కట్టది చేయలేక పోతుంటే, మనదేశంలో పరిస్థితులు గనక చేయి దాటి పోతే, ఊహించడానికే భయానకం. అందుకే అతి వేగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి...ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉండడం, లాక్ డౌన్ కి సహకరించడమొక్కటే పరిష్కారం. 
దీని వల్ల ప్రభుత్వాల పని సులువవుతుంది....పరిస్థితి అదుపులో ఉంటుంది..
ఇప్పటి దాకా ప్రతి అంశంలో అమెరికానో, మరో దేశాన్నో ఆదర్శంగా చెప్పుకునే ప్రపంచ దేశాలు రేపు మన పేరే చెప్పుకుంటాయి...
భారత దేశ పాలకుల సత్వర స్పందన...నివారణ చర్యలు...భారత పౌరుల చిత్తశుద్ధి వల్లనే భారత దేశాన్ని కరోనా వైరస్ ఏమీ చేయ లేక పోయిందని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో అంగీకరించి తీరతాయి.... ఆ రోజు ఎంతో దూరంలో లేదు....అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది....ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అన్ని రోజులూ కచ్చితంగా ఇంటి పట్టునే ఉండడం, సామాజిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం....ఇవి మన ఆరోగ్యాల పట్ల ముందు జాగ్రత్తలే కాదు, మన సామాజిక బాధ్యత కూడ..

ఈ గండం గట్టెక్కితే మన భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ సూపర్ పవర్ అవుతుంది...
ఆ స్థానానికి తీస్కెళ్ళాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. 

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్