ఆపిల్ ఫోన్ సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ - ambadipudi syamasundar rao

ఆపిల్ ఫోన్ సృష్టి కర్త  స్టీవ్ జాబ్స్

కంప్యూటర్  రంగములో విప్లవాత్మక పరిణామాలనుఁ సృష్టించి పేరు ప్రఖ్యాతులు డబ్బు గడించిన వారిలో బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ ప్రముఖులు. ఆపిల్ ఐ ఫోన్ వాడే వాళ్లకు కంప్యూటర్ పరిజ్ఞానము ఉన్నవాళ్లకు స్టీవ్ జాబ్స్ గురించి ప్రత్యేకముగా చెప్ప నవసరం లేని, పరిచయము అక్కరలేని పేరు. ఈయన ఒక పెద్ద అమెరికన్ బిజినెస్ మాగ్నెట్,ఇండస్ట్రియల్ డిజైనర్, పెట్టుబడిదారుడు వీటన్నిటికీ మించి మీడియా యజమాని ఈయన ప్రధానముగా ఆపిల్  కంపెనీకి  చీఫ్ ఎక్సుక్యూటివ్ ఆఫీసర్ మరియు ఆపిల్ కంపెనీకి కో ఫౌండర్, మరియు ఫిక్సర్ (వాల్ డిస్ని బోర్డు అఫ్ డైరెక్టర్స్) యొక్క  చైర్మన్ మెజారిటీ షేర్ హోల్డర్ .అలాగే NeXT కంపెనీ యొక్క చైర్మన్ ,సీఈఓ.  స్టీవ్ జాబ్స్ కు ప్రపంచ వ్యాప్తముగా పర్సనల్ కంప్యూటర్ ల వాడకము లో1970-80 మధ్య కాలములో ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ వజనియాక్ తో కలసి విప్లవం  తెచ్చిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది.
ఈయన పూర్తి పేరు స్టీవెన్ పాల్ జాబ్స్ ఫిబ్రవరి 24, 1955లో సాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు సాన్ ఫ్రాన్సిస్కో లోని బె ఏరియాలో పెరిగాడు 1972లో రీడ్ కాలేజీలో చదివాడు మధ్యలో కాలేజీ నుంచి బయటకు వచ్చి 1974లో ఇండియాలో విస్తృతముగాపర్యటించాడు ఆ సందర్భముగా జెన్ బుద్ధిజమ్ ను అధ్యయనము చేసాడు స్టీవ్ జాబ్స్ కాలేజీలో చదివే రోజుల్లో 15 ఏళ్ల వయస్సులో మారిజువానా,LSD వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు ఈ విషయాన్ని ఒక రిపోర్ట్రర్ అడిగినప్పుడు ఏమి మొహమాట పడకుండా నేను చేసిన రెండు మూడు ముఖ్యమైన పనులలో అది ఒకటి అని చెప్పాడు.
1976లో జాబ్స్, వజనియాక్ ఇద్దరు కలసి ఆపిల్ కంపెనీని ఆపిల్ I పర్సనల్ కంప్యూటర్లు అమ్మటానికి ప్రారంభించారు తక్కువ కాలములోనే వీరిద్దరూ పేరు ప్రఖ్యాతులు బాగా గడించారు ఒక ఏడాది తరువాత ఆపిల్ II ను మార్కెట్ లో ప్ర్రవేశ  పెట్టారు ఇది మైక్రో కంప్యూటర్ల విభాగములో చాలా ఘనవిజయము సాధించింది.1979లో జాబ్స్ జిరాక్స్ ఆల్టో యొక్క వ్యాపారపరమైన పొటెన్షియల్ ను గుర్తించాడు ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ కలిగి మౌస్ డ్రివెన్ పరికరము కానీ ఇది1983లో  విజయవంతము కానటువంటి ఆపిల్ లిసా డెవలప్ మెంట్ కు దారితీసింది. దీని వెంటనే 1984లో మాసింతోష్ మొదటి మాస్ ప్రొడ్యూసుడ్ కంప్యూటర్ GUI తో ఆవిష్కరించబడింది.మాసింతోష్ 1985లో  డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఇండస్ట్రి ని పరిచయము చేసింది.దీనికి అదనముగా ఆపిల్ లేజర్ రైటర్ ను కూడా పరిచయము చేశారు.ఇది వెక్టర్ గ్రాఫిక్స్ ను చూపించే మొదటి లేజర్ ప్రింటర్
1985 లోకంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో అప్పటి సీఈఓ స్కూలి తో అధికారము కోసము జరిగిన పోరులో జాబ్స్ ఆపిల్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.అప్పుడు జాబ్స్ ఆపిల్ లోని కొంతమంది సభ్యులను తీసుకొని బయటకు వచ్చి NeXT (కంప్యూటర్  ప్లాట్ ఫార్మ్) ను ప్రారంభించాడు. ఈ డెవలప్ మెంట్ కంపెనీ కంప్యూటర్లలో ఉన్నత విద్యాభ్యాసానికి బిజినెస్ మర్కెట్స్ వృద్ధి చేసుకోవటానికి పనికి వచ్చేటట్లు డిజైన్ చేశాడు  వీటికి తోడు విజువల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందటానికి సహాయపడ్డాడు. దీనికోసము కంప్యూటర్ గ్రాఫిక్స్ డివిజన్ కు  జార్జి లూకాస్ యొక్క లూకాస్ ఫిలిం కు 1986లో ఫండింగ్ చేసాడు. ఈ కొత్త కంపెనీ పేరు పీక్సార్ ఈ కంపెనీ 1995లో 3D కంప్యూటర్ యానిమేటెడ్ ఫిలిం టాయ్ స్టోరీని ప్రొడ్యూస్ చేసింది.
ఆపిల్ 1997లో NeXT ను అక్వైర్ చేయటముతో కొద్దీ నెలలలోనే జాబ్స్ తన పాత కంపెనీకి సీఈఓ అయినాడు. ఆపిల్ కంపెనీని పునరుద్దరించటంలో అయన భాద్యత కృషి ఎక్కువ ఎందుకంటే అయన సీఈఓ ఆయేనాటికి ఆ కంపెనీ దివాల అంచున ఉంది. జాబ్స్ డిజైనర్ ఐవ్ తో కలసి 1997 మొదట్లో కల్చరల్ రామిఫికేషన్స్ ఉన్నకొన్ని ఉత్పత్తులను వరుసగా రిలీజ్ చేసాడు వీటి అంతరార్ధము "భిన్నముగా ఆలోచించు" అనే అడ్వేర్టైజింగ్ ప్రచారాన్ని మొదలుపెట్టాడు అది ఐమాక్,ఐట్యూన్స్,ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ స్టోర్,ఐపాడ్, ఐఫోన్ ,అప్ స్టోర్స్ మొదలైనవి. 2001లో ఐపాడ్ ఒరిజనల్  Mac OS ను పూర్తిగా కొత్తదైనా Mac
OS X తో రీప్లేస్ చేసాడు. దీనికి ఆధారము NeXtSTEP ప్లాట్ ఫామ్ మొదటిసారిగా ఇది కొత్త OS యునిక్స్ బేసెడ్ ఫౌండేషన్.
2003లో జాబ్స్ కు ప్యాంక్రియాటిక్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉన్నట్లుగా గుర్తించారు కానీ ఆ టైమర్ ను తొలగించుకోవటానికి శస్త్ర చికిత్సకు ఒప్పుకోలేదు ఇతర వైద్య విధానాలు అంటే హెర్బల్ మెడిసిన్స్, ఆక్యుపంచర్ వాటి వల్ల తగ్గవచ్చు అని వాటిని ప్రయత్నించేవాడు కానీ తరువాతి రోజుల్లో తన నిర్ణయానికి బాధపడ్డాడు అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది..56 ఏళ్ల వయస్సులో జాబ్స్ ట్యూమర్ వల్ల శ్వాస ఆగి అక్టోబర్ 5, 2011 లో మరణించాడు వ్యక్తిగత అలవాట్ల విషయానికి వస్తే జాబ్స్ శాఖాహారి ప్రాన్సిస్ మూర్ అనే రచయిత  వ్రాసిన పుస్తకాన్ని చదివి అయన తన ఆహారపు అలవాట్లను చాలా మటుకు మార్చుకున్నాడు ఒక్కోసారి  వారము మొత్తము యాపిల్ పళ్ళు కేరట్ సలాడ్ తింటూ గడిపేవాడు చాలా సందర్భాల్లో యదార్ధాన్ని గుర్తించేవాడు కాదు కానీ అతని ప్రత్యేకత ఎటువంటి వారినైనా ఒప్పించ గలగటము అతనిని అర్ధము చేసుకోవటం చాలా కష్టము అనిపించే వ్యక్తి జాబ్స్
ఓక్కో సారి మేధావిగాను ఒక్కొక్కసారి మామూలు మనిషిగా అనిపిస్తాడు ఇతరుల ఐడియా లను దొంగలించటంలో ఘనుడు. ఎవరైనా కొత్త ఆలోచన చెపితే అది స్టుపిడ్ ఆలోచన అని చెప్పి ఒక వారము తరువాత ఆలోచన తనదిగా ప్రెజంట్ చేస్తాడు జులై 1997లో ఆపిల్ కంపెనీకి ఇంచార్జి సీఈఓ గావచ్చి సీఈఓ టైటిల్ పొందటానికి రెండేళ్లు పట్టింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే ఆ కాలంలో జాబ్స్ ఏడాదికి ఒక డాలర్ జీతము తీసుకున్నాడు.ధీని గురించి అడిగినప్పుడు ,"నేను ధనవంతుడు అయిపోదామని ఇక్కడి రాలేదు" అని జవాబిచ్చాడు.జాబ్స్ లో ఇంకో ప్రత్యేకత అందరు విస్మరించే చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటాడు.జాబ్స్ తన కంపెనీ ఆపిల్ నుంచి వ్యక్తిగత జీవితము  వరకు చాలా సింప్లిసిటీ మెంటైన్ చేసేవాడు అయన చనిపోయే ముందు చెప్పిన మాటలు చాలా ఆధ్యాత్మికతను వేదాంత ధోరణిలో ఉంటాయి "చివరి దశలో గతాన్ని నెమరు వేసుకుంటే మరణము ముందు నా పేరు ప్రఖ్యాతులు నా సంపాదన ఎందుకు కొరగావని అర్ధమయింది అన్ని పనులు చేయించుకోవటానికి మనుషులను పెట్టుకోవచ్చు కానీ నా రోగాన్ని నేనే అనుభవించాలి. కాబట్టి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాక తిరిగి దానిని ఎప్పటికి పొందలేవు అదే జీవితము అందుకే మంచిగా జీవించు ఇతరులను సంతోషపెట్టు " అంటాడు  ఇవండీ స్టీవ్ జాబ్స్ కంప్యూటర్ రంగములో సాధించిన విజయాలు కొన్ని వ్యక్తిగత విశేషాలు ఈయన  అక్టోబర్ 5, 2011 న మరణించాడు.
అంబడిపూడి శ్యామసుందర రావు.
.

.
.