రష్యన్ నియంత స్టాలిన్ - ambadipudi syamasundar rao

రష్యన్ నియంత స్టాలిన్

రష్యా దేశము పేరు విన్నవాళ్లకు స్టాలిన్ పేరు కూడా పరిచితమే నియంతగా పేరు సంపాదించిన స్టాలిన్ రష్యా అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించాడు ప్రపంచములోని నియంతలో ప్రముఖుడిగా పేరు సంపాదించాడు అయన నియంతృత్వము గురించి ఇప్పటికి కధలు కధలుగా చెప్పుకుంటారు ఆయనతో మాట్లాడాలి అన్నభయపడే వారట పోలీస్ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన సాగించేవాడు అందుచేత ఎవరైనా ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడాలి అంటే భయపడేవారు ఒకసారి స్టాలిన్ తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాటానికి మారువేషములో తిరుగుతూ ఒక వ్యక్తిని స్టాలిన్ గురించి నీ అభిప్రాయము ఏమిటి అని అడిగితె ఆ వ్యక్తి స్టాలిన్ ను దూరముగాతీసుకు వెళ్లి రహస్యముగా స్టాలిన్ మంచివాడు అని చెప్పాడట. లెనిన్ తరువాత రష్యాలో బాగా పాపులర్ నాయకుడు స్టాలిన్ ఈయన జీవితము గురించి కొన్ని వ్యక్తిగత విషయాలను గురించి తెలుసుకుందాము
స్టాలిన్ జాతిపరంగా పూర్వపు USSR లోని జార్జియా ప్రాంతము వాడు.ఇతని అసలు పేరు లోసేబ్ జఘాశ్విలి రష్యన్ భాషలో లోసేబ్ ను లోసిఫ్ అంటారు, జర్మన్ భాషలో జోసెఫ్ అంటారు ఎందుకంటే l అనే అక్షరము జర్మన్ భాషలో J ఇంగ్లీష్ లో జోసెఫ్ గా పలుకుతారు అయినా పేరులో ఏముంది లెండి స్టాలిన్ అంటే ఉక్కు మనిషి అని రష్యన్ భాషలో అర్ధము ఇది ఒకరకంగా అయన ముద్దు పేరు ఈ పేరుతోనే అయన ఒక ముఖ్యమైన వ్యాసము వ్రాసాడు అందువల్ల ఆ పేరు ఇష్టపడి ఉంచుకున్నాడు అదీగాక ఈ పేరు లెనిన్ పేరుకు దగ్గరగాఉంటుదని కూడా స్టాలిన్ ఉద్దేశ్యము.స్టాలిన్ కి పుట్టుక తోటే ఒక లోపము ఉంది అది ఏమిటి అంటే ఎడమకాలి రెండవ మూడవ వేళ్ళు కలిసిపోయి ఉంటాయి. తన లోపము ఇతరులకు తెలియటానికి ఇష్టపడేవాడు కాదు అందుచేతనే క్రెమ్లిన్ లో డాక్టర్లు తనను పరీక్షించేటప్పుడు దుప్పట్లో తలదాచుకొనేవాడుట.
చిన్నప్పుడు స్టాలిన్ కు మసూచి సోకటం వలన ముఖము మీద గుంతలు ఏర్పడ్డాయి అందుచేతనే అప్పట్లో జార్ రహస్య పోలీసులు ఓఖ్రాన విప్లవవాది స్టాలిన్ ను వెతకటానికి "చోపురా"అనే నిక్ నేమ్ పెట్టుకున్నారు.స్టాలిన్ నియంత గా అయినప్పుడు ఆ మచ్చలను పౌడర్ తో తన అంగరక్షకులతో కనిపించకుండా కప్పుకొనేవాడు ఫోటోలలో కూడా ఈ మచ్చలు లేదా గుంతలు కనబడకుండా జాగ్రత్తపడేవాడు.
చిన్నప్పుడు ఈ మసూచి ఏ కాకుండా ఇతర వ్యాధులతో బాధపడేవాడు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యముగా కొట్టేవారు తాగుబోతు తండ్రి ఎక్కువగా కొట్టేవాడు. చిన్నప్పుడు జరిగిన ప్రమాదమువల్ల ఎడమచేయి కి దెబ్బతగలటం వలన మొదటి ప్రపంచ యుద్దములో చేరటానికి అనర్హుడిగా ప్రకటించారు.తల్లి స్టాలిన్ ను ఒక ప్రీస్ట్ (మతాధికారి) గా చేయాలనుకుని అతి కష్టము మీద టిబిలిసి లోని సెమినరీలో చేర్పించింది. కానీ డార్విన్ "అరిజన్ ఆఫ్ స్పీషీస్ " , "వర్క్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్ "లాంటి పుస్తకాలు చదివి మార్క్సిస్టు మరియు హేతువాదిగా మారాడు. ఈయన జార్జియన్ భాషలో కవి కావటము చేత అప్పటి ప్రముఖ న్యూస్ పేపర్లలో కవితలు ప్రచురించబడేవి.పెయింటింగ్ బాగా వేసేవాడు నాటకాలలో నటించే వాడు చర్చిలలో బృందగానములలో పాల్గొనేవాడు.ఒక విప్లవవాదిగా బోల్షవిక్ పార్టీకి ముఖ్యమైన ఫండ్ రైజర్ ఈ పనికి బ్యాంక్ దొంగతనాలు కిడ్నాప్ లు మొదలైనవి ఆర్గనైజ్ చేసేవాడు.1907 లో టిఫ్ల్య్స్ లో ఒక సాయుధ దోపిడీని ఆర్గనైజ్ చేసాడు.ఈ దోపిడీలో విప్లవాదులు 40 మందిని చంపి 200 వేల రూబుళ్లను (అంటే నేడు మిల్లియన్ డాలర్లకు సమానము) దోచుకున్నారు
1913లో స్టాలిన్ .ట్రాట్ స్కీ ,టిటో ,ఫ్రాయెడ్, హిట్లర్ వంటి ప్రముఖులంతా వియన్నాలో నివసించేవారు తోటి కామ్రేడ్లతో స్టాలిన్ లండన్ ప్యారిస్ ఇతర ఐరోపా నగరాలను సభలకోసము సందర్శించాడు. స్టాలిన్ పూర్తిగా స్త్రీలోలుడు. 13మరియు 16 ఏళ్ల ఆడపిల్లలతో డేటింగ్ చేసేవాడు. పెళ్లికాకుండానే పిల్లల తండ్రి అయినాడు. 1904లో జార్జియన్ అమ్మాయి నినా గుర్ గెండిజ్ ను పెళ్లి చేసుకోమని అడిగాడు కానీ ఆ అమ్మాయి ఒక లాయర్ ను పెళ్లిచేసుకుంది 1937 లో ఆ లాయర్ కాల్చి చంపబడ్డాడు. స్టాలిన్ కు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏ విషయాలను త్వరగా మర్చిపోడు. 1900 ప్రారంభములో చెచెన్యాలు బాకు ఆయిల్ వ్యాపారి ఆజ్ఞల ను బట్టి స్టాలిన్ లో బాగా కొట్టారు. ఆ విషయము గుర్తు పెట్టుకొని 1940లో మొత్తము చెచెన్యా అనే దేశము సెంట్రల్ ఆశియాలో లేకుండా చేసాడు స్టాలిన్ మరణానంతరము రష్యా ప్రధాని కృష్చెవ్ మళ్లా చెచెన్యా ను ఏర్పాటు చేసాడు. నిజానికి చెచెన్యానులు జర్మన్ అక్రమణను నిరోధించారు అలాగే పోల్స్, కొరియన్లను కూడా విప్లవానికి ముందు ఎటువంటి సంబంధము లేక పోయినా వారిని కూడా విక్టిమైజ్ చేసాడు. ఆ విధముగా సుమారు 28 మిలియన్ల మందిని దేశ బహిష్కరణ చేసాడు వారిలో చాలా మంది తిరిగి రాలేదు
స్టాలిన్ మంచి వక్త కాదు అలాగే భావయుక్తముగా వ్రాయలేడు కానీ తెరవెనుక రాజకీయాలు నడపటములో మంచి నేర్పరి.ఈ నేర్పు టోన్ స్నేహితులను ఏర్పరచుకొనేవాడు. ఈ నేర్పును అతని వ్యతిరేకి ట్రాట్ స్కీ కూడా మెచ్చుకొనేవాడు జార్ పాలనలో సాధారణమైన శిక్ష ఐదు సంవత్సరాలు దేశ బహిష్కరణ చాలా కొద్దిమందికి ఉరి శిక్ష పడేది స్టాలిన్ చాలా సార్లు సైబీరియాకు బహిష్కారింపబడ్డాడు కానీ చాలా సార్లు తప్పించుకున్నాడు. ఈ బహిష్కరణ కాలములో జార్ ప్రభుత్వము లెనిన్ లాంటి మేధావులకు 12 రూబుళ్లు , చదువుకున్నవారికి 11 రూబుళ్ళు స్టాలిన్ లాంటి రైతులకు 8 రూబుళ్ళు బహిష్కరణ భృతిగాఇచ్చేవారు. ఈ భృతి కూడా బట్టలు, ఆహారము, అద్దె కోసమే. లెనిన్ బహిష్కరణలో ఉన్నప్పుడు వెంట భార్య, అత్తగారు పని మనిషిని తెచ్చుకున్నాడు కానీ స్టాలిన్ పరిస్థితి వేరు. 1920 ప్రాంతములో తోటి బోల్షవిక్ కార్యకర్త కామెనేవ్ ను పదవి నుండి తప్పించాడు 1936లో స్టాలిన్ పార్టీలో గొప్ప టెర్రర్ ను సృష్టించాడు ఎలాగంటే కామెనేవ్ ను, అతని అనుచరుడు జినోవైవ్ ను విచారణ శిక్ష అమలు చేయటము ద్వారా ఇలా తనకు నచ్చని వాళ్లకు వ్యతిరేకులకు భయంకరమైన బహుమతులు శిక్ష రూపములో ఇచ్చేవాడు.
స్టాలిన్ తో మాట్లాడాలి అంటేనే ఇతరులు భయపడేవారు ఇతర దేశాల నాయకులు కూడా స్టాలిన్ కూడా ,ఎవరితో మనసువిప్పి మాట్లాడేవాడు కాదు బహుశా మొదటిసారి భారతీయ దౌత్యవేత్త హోదాలో రష్యా వెళ్లిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఎక్కువ సేపు మనసు విప్పి మాటలాడి ఆ తరువాత కూడా ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు రాధాకృష్ణన్ తో మాట్లాడుతూ మానాసికా ఆనందాన్ని పొందేవాడుటస్టాలిన్ నియంతృత్వాన్ని గురించి కధలు కధలు చెప్పుకొనేవారు కొన్ని నిజాలు కొన్ని కల్పనలు ఏది ఏమైనప్పటికి ప్రపంచములోని నియంతలలో స్టాలిన్ ఒకడు అలాగే రష్యా పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు కారల్ మార్క్స్. లెనిన్ తరువాత రష్యాలో బాగా పాపులారిటీ పొందినా నాయకుడు స్టాలిన్
అంబడిపూడి శ్యామసుందర రావు

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు