కోరికలే గుర్రాలు ఐతే - చంద్ర శేఖర్ కోవూరు

కోరికలే గుర్రాలు ఐతే

కోరికలే గుర్రాలు ఐతే.... మనిషి కంటే మనసు వేగంగా పరుగెడుతుంది. దాన్ని పట్టుకోవాలంటే మనిషి ఇంకా వేగంగా పరిగెత్తాలి. తప్పులు చెయ్యటానికి కూడా వెనుకాడరు. తిప్పలు తప్పవని గ్రహించలేరు . మొండితనం పెరుగుతుంది. ఎవ్వరినీ లెక్క చెయ్యరు. ఇంత చేసినా కోరికలు నెరవేరతాయా అంటే ...చెప్పలేం... ఒక వేళ నెరవేరినా చాలా కోల్పోవాల్సి వస్తుంది. నెరవేరినా నెరవేరకపోయినా రాక్షస ప్రయత్నం మాత్రం ఆగదు. ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు . ఈ ప్రయత్నంలో పడి, ఉన్న వాటిని అనుభవించటం కూడ మరచి పోతారు . ఆనందం కనుమరుగై పోతుంది . అందుకే అంటారు కోరికలు అదుపులో ఉండాలి. మనిషి ఒద్దికగా ఉండాలి అని . ఆశకు అంతులేకపోయినా కోరికలకు లెక్క ఉంటేనే మేలు . కోరికలు మరీ ఎక్కువై నెరవేరినా కూడా వాటి ఫలితాలను అనుభవించే సమయం మిగలకపోవచ్చు.. మనిషి జీవితానికే పరిమిత కాలం ఉన్నపుడు మనిషిలో పుట్టే కోరికలకు అదుపు లేకుంటే ఎలా !!!!!! కోరిక ఏదైనా అది నెరవేర్చుకునే శక్తి యుక్తి రెండూ ఉండాలి . అందులో నిజాయితీ ఉండాలి....