కొంతమంది ప్రముఖులు పెంచుకొనే పెంపుడు జంతువులు - ambadipudi syamasundar rao

కొంతమంది ప్రముఖులు పెంచుకొనే  పెంపుడు జంతువులు

సాధారణముగా సామాన్యుల దగ్గరనుంచి ప్రముఖుల వరకు వారి సరదాకొద్దీ కుక్కలు లేదా పిల్లులు పక్షులు వంటి పెంపుడు జంతువులను పెంచటం సహజము ఎందుకంటే మనిషి తన ఆనందం కోసము పెంపుడు జంతువులను పెంచటం అనేది చాలా కాలము నుండి వస్తున్న అలవాటు ఇందులో ఏమి ప్రతేకత లేదు కానీ సాధారణ వ్యక్తి చేసే పని ఏమంత ప్రత్యేకత ఉండదు కానీ సినిమా యాక్టర్లు రచయితలూ చిత్రకారులు పాటగాళ్లు వంటి ప్రముఖులు సామాన్యులు పెంచే కుక్కలు లాంటి పెంపుడు జంతువులూ కాకుండా సింహాలో చింపాంజీలో కంగారులను పెంచుతూ ఉంటె ప్రపంచము మీడియా అటువంటి వ్యక్తులను ఆకర్షించి అది పెద్ద వార్తగా ప్రచారము చేస్తారు.ప్రపంచములో అటువంటి కొంతమంది ప్రముఖులను వాళ్ళు పెంచే ఆశ్చర్యకరమైన పెంపుడు జంతువులను గురించి తెలుసుకుందాము. మన తెలుగు లో ఒక సామెత ఉంది ఏమిటి అంటే ఎవరి పిచ్చ వారికి ఆనందము అనేది డబ్బు పేరు ప్రఖ్యాతలు గడించాక కొంతమందిలో ఈ రకమైన వెర్రి ఆలోచనలు మొదలై వారి ప్రత్యేకతను చాటుకోవటానికి అందరి కన్నా భిన్నముగా ఈ పెంపుడు జంతువుల విషయములో ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు వారు పెంచే పెంపుడు జంతువులను గురించి తెలుసుకుందాము.
1. ప్రముఖ పాప్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ పెంచుకొనే చింపాంజీ:-ఈయన పెంచుకున్న చింపాంజీ పేరు బబుల్స్ దీనిని అయన టెక్సాస్ లోని రీసెర్చ్ సెంటర్ లో1980లో కొన్నాడు. లక్షం టూర్లలో అయన వెంబడి ఈ చింపాంజీ ఉండేది.ఈ చింపాంజీ ఒసాకా మేయర్ తో పాటు జాక్సన్ తో పాటు టీ కూడా త్రాగింది. 2003లో దీనిని ట్రైనర్ దగ్గరకు పంపాడు.మరుసటి సంవత్సరము ఈ చింపాంజీని ఫ్లోరిడాలోని గ్రేట్ ఏప్స్ సెంటర్ కు పంపాడు అక్కడ ఈ చింపాంజీ ఇతర చింపాంజీలతో పాటు సుఖముగా జీవించింది. ..
2.అమెరికా అధ్యక్షుని సతీమణి అమెరికా ప్రధమ పౌరురాలు లేడి గ్రేస్ కూలిడ్జ్ పెంచుకున్న రకూన్:-.రకూన్ అనేది ఉత్తర అమెరికాకు చెందిన మధ్య తరహా క్షీరదం. ఇది ప్రోసియోనిడ్ కుటుంబంలో అతిపెద్దది, శరీర పొడవు 40 నుండి 70 సెం.మీ మరియు శరీర బరువు 5 నుండి 26 కిలోలు.కూలిడ్జ్ కుటుంబము వైట్ హౌస్ లో ఉండగా అనేక పెంపుడు జంతువులను ఉంచుకున్నా రెబక అనే రకూన్ మూడేళ్ళ పాటు ఆవిడ ఫెవరెట్ గాఉండేది దీనికోసము చెట్ల మధ్య ప్రత్యేకమైన ఇల్లు కూడా కట్టించింది. దీనికి రొయ్యలు ఆహారముగా వేసేది. 1929లో దీనిని ఆవిడ వాషింగ్ టన్ లోని నేషనల్ జూ కు ఇచ్చింది.
3. సాల్వడార్ డాలీ పెంపుడు'జంతువు యాంటీ ఈటర్ :- సాల్వడార్ .డాలీ తన జీవితమూ అంతా ఎక్సేంత్రి గాఉంటూ వైల్డ్ సేడ్ లోనే బ్రతికాడు.ఇతని విధానాలు ఆలోచనలు అన్నిభిన్నముగాను ఆలోచనలను రేకెత్తించేవిగాను ఉండేవి.ఈయన యాంట్ ఈటర్స్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు ఈ యాంట్ ఈటర్స్ అయన చిత్రాలలో కూడ కనిపించేవి ప్యారిస్ నగరములో అయన నడిచేటప్పుడు వెంట యాంట్ ఈటర్ ఉండేది.యాంట్ ఇతర తో పాటు ఓసీలట్ (పిల్లి జాతికి చెందిన జంతువూ) ను కూడా పెంచుకొనేవాడు. .
4. అమెరికా నటి తిప్పి హెడ్రెన్ పెంపుడు జంతువూ నెయిల్ అనే సింహము:- ఈ హాలీవుడ్ నటి మొదటి నుంచి జంతు ప్రేమికురాలు ఆవిడ తన భర్త తో పాటు సింహాలపై అభిమానాన్ని పెంచుకుంది 1969 లోసినిమా షూటింగ్ సమయములో(ఆ సినిమా విజయవంతము కాక పోయినప్ప టికీ) ఆవిడకు వీటి మీద ఆసక్తి ప్రేమ కలిగినాయి అప్పటి నుండి 400 పౌండ్ల బరువు ఉండే నెయిల్ అనే సింహాన్ని చిన్న పిల్లగాఉన్నప్పటినుండి పెద్దది అయేదాకా పెంచింది ఆ సింహము కూడా క్యాలిఫోర్నియాలోని నటి ఇంట్లో నటి పిల్లలతో పాటు పెరిగింది ఆ ఇల్లు ప్రస్తుతము శంబాలా అనిమల్ ప్రేజర్వ్ కేంద్రముగాను ఆ నటి ఇల్లుగాను ప్రసిద్ధి చెందింది. . .
5.జార్జ్ క్లూనీ పెంచుకొనే పంది :- 1960లో జార్జ్ క్లూనీ తన గర్ల్ ఫ్రెండ్ ద్వారా బహుమతిగా మంచి అందమైన పండి పిల్లను బహుమతిగా పొందాడు.వారిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ బ్రేక్ అయినా కాలుని కి పందిపిల్ల మాక్స్ మధ్య సంబంధము బలపడింది.ఈ పందిపిల్ల 400 పౌండ్ల పందిగా ఎదిగింది క్లూనీకి మంచి స్నేహితుడిగా ఉంటూ 2006లోఅంటే పందికి 19 ఏళ్ళు వచ్చినాక చనిపోయింది. . .
6.ఫ్రిదా కహ్లో పెంపుడు జంతు దుప్పి:- ఫిదా కహ్లో అనే చిత్రకారిణికి జంతువులపట్ల ప్రేమ అమితముగా వుండేది .ఆవిడ కోతులు పావురాలు కుక్కలను పెంచుకొనేది కానీ ఆవిడ ఫెవరెట్ గ్రానీజో అనే దుప్పి ఆవిడ 1946 లో గీసిన లిటిల్ డీర్ లేదా ద వుండెడ్ డీప్ అనే చిత్రానికి ఈ దుప్పి, యే మోడల్
7.ప్రముఖ గాయకుడు ఎల్విస్ పెంచుకున్న కంగారు :-ఎల్విస్ మరియు ప్రిసిల్లా లు అనేక రకాల పెంపుడు జంతువులను జాయింట్ గా పెంచుకొనే వారు అని పుకార్లు ఉండేవి,1950 ప్రాంతములో కొద్దికాలం ఎల్విస్ ఓక కంగారును పెంచుకొనేవాడు ఈ కంగారును ఎల్విస్ కు ఒక బుకింగ్ ఏజెంట్ బహుమతిగా ఇచ్చాడట. తరువాత కొంతకాలానికి ఎల్వి ఆ కంగారును మెంఫిస్ జంతు ప్రదర్శన శాలకు బహుమతిగా ఇచ్చాడు. .
8.అండ్రేయ్ హేపీబర్న్అనే హాలీవుడ్ హీరోయిన్ పెంచుకొనే పిప్పిన్ అనే ఫాన్(జింక పిల్ల):- 1958 లో అండ్రేయ్ సినిమా షూటింగ్ లో ఈ జింక పిల్లను చూసింది గ్రీన్ మాన్సన్ అనే సినిమా షూటింగ్ లో ఈ జింక పిల్ల పాత్ర హీరోయిన్ వెంట ఉండటమే ఆ విధముగా హీరోయి ఆ జింక పిల్ల తో అనుబంధము పెంచుకొని దాని సంరక్షణ భాద్యత తీసుకుంది. ఆవిధముగా ఏర్పడిన బంధము వలన సినిమా షూటింగ్ పూర్తి అయినా ఆ హీరోయిన్ తనవెంబడి వెళ్ళినచోటు కల్లా తీసుకువెళుతుండేది నిజానికి సినిమా షూటింగ్ అయినాక ఆ జింక పిల్లను తిరిగి ఇచ్చేయాలి కానీ ఒక సంవత్సరము తరువాత దాని గుర్తించి ఆ జింక పిల్లను తెచ్చుకొని, ఏర్పడ్డ అనుబంధము వల్ల హేపీబర్న్ కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంది.

మరిన్ని వ్యాసాలు

మోక్షప్రదాయని చిదంబరం.
మోక్షప్రదాయని చిదంబరం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
చదువులతల్లి...
చదువులతల్లి...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దక్షణాది నటి జయంతి.
దక్షణాది నటి జయంతి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Prakrithi-purushudu-aatma
ప్రకృతి - పురుషుడు - ఆత్మ
- కందుల నాగేశ్వరరావు