కాకూలు - సాయిరాం ఆకుండి

నిర్లక్ష్యసిద్ధి
కాలుష్యం వీధివీధినా...
నిర్లక్ష్యం అడుగడుగునా!

సామర్ధ్యం అడుగంటేనా...
కర్తవ్యం ఇక మరిచేనా!!


నష్టజాతకులు
బంగారం లాంటి బాల్యం...
ఛిద్రమైపోయిందీ నిర్భాగ్యులకి!

ఎవరు చెల్లిస్తారు మూల్యం...
చిన్నారి బాల కార్మికులకి!!

చట్టబండలు
చట్టాలున్నవి తమ పని...
తాము చేసుకుపోడానికే!

చుట్టాలను మాత్రం అవి...
చూడనట్లు వదిలేయడానికే!