అట్టమీది బొమ్మ కథ - డాక్టర్ కె.ఎల్ వి ప్రసాద్

అట్టమీది బొమ్మ కథ

అట్ట మీది బొమ్మ కథ * బొమ్మ చూడగానే ,అది బాపు గారు గీసిందని చాలా మందికి తెలిసిపోతుంది . అయితే అంత గొప్ప చిత్రకారుడి నుండి నా పుస్తకానికి ముఖ చిత్రం అమరడం అంత సులభ సాధ్యమా ?మరి అది ఎలా సాధ్యమైంది? ఇదిగో ....ఇలా ....!! అవి నేను మహబుబాబాద్ ప్రభుత్వ ఆసు పత్రిలో ,పనిచేస్తున్న రోజులు .దంత వైద్య విజ్ఞానం గురించి ,వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న కాలం అది ! ప్రాంతీయంగా ,వార్తాలహరి ...అనే వార .. పత్రిక ,ఉబేద్ అనే మితృడు నడిపించే వాడు.ఆ పత్రికలొ వారం ..వారం ... సంపాదకుడి కోరికమీద ,పిల్లల దంత ... సమస్యల గురించి వ్యాసాలు రాస్తుండే వాడిని .వాటన్నింటిని పుస్తకం గా వేయాలనే ఆలొచన వచ్చింది.ముఖ చిత్రం బాపు గారి బొమ్మవుంటే బావుంటుందనే ఆలొచన కూడా వచ్చింది .కాని ,అదెలా సాద్యం? నేను బాపు గారికి వీర అభిమానిని !కానీ ఆయన స్థాయి చాలా పెద్దది !మరి ఎలా ? నాలాంటి సామాన్యుడి కి అది సాద్యమా ! చిన్న ప్రయోగం చేద్దామనుకున్నాను.వారి చిరునామా ,సేకరించి ఒక పోస్టు కార్డు మీద నా చిరకాల కొర్కెను తెలియజేశాను .ఆ .. సమయం లొ అయన ,చిత్రకారుడి గానే కాక ,సినిమా దర్శకుడిగా చాల బిజీ గా ఉండేవారు .నేను అయనకు ఉత్తరం రాసి న సంగతి మరిచిపోయాను .ఒకా నొక శుభోదయాన ,బాపు గారి దగ్గర నుండి ఇన్ లాండ్ లెటర్ వచ్చింది.స్వయంగా అయన దస్తూరి తో వచ్చిన ఉత్తరం.నా ఆనందానికి కొలబద్ద లేకుండా పొయింది. ఉత్తరం విప్పి చదివాను .తను సినీమా షూటింగులతో చాలా బిజీ గా వున్నానని ఆరు నెలలు ఆగితే బొమ్మావేసి పంపు ... తానని ,ఆ ఉత్తరం సారాంశం. నేను వెంటనే బాపు గారికి ,రిప్లై రాశాను. మీ బొమ్మ కోసం ఆరు సంవత్సరాలైనా ఆగ గలను అని రాశాను .కానీ ..అయన నేను రిప్లై ఇచ్చిన పదిహేను రోజుల్లోనే ఈ బొమ్మ వేసి రిజిస్టర్డ్ పొస్ట్ లొ పంపించారు . అదీ వారి సహృదయత. పల్లవి పబ్లికేషన్స్ ..విజయవాడ వారు అప్పట్లొ ఈ పుస్తకాన్ని ముద్రించారు . డా.కె.ఎల్వీ. హనంకొంఢ.