చిద్విలాసమే చిరాయువు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

చిద్విలాసమే చిరాయువు.

చిద్విలాసమే చిరాయువు.(మే మొదటి ఆదివారం నవ్వులదినోత్సవం)
నవ్వడంభోగం నవ్వకపోవడంరోగం అన్నారు.సిరుల తల్లికి చిరునామా చిరునవ్వులుచిందించే యిల్లే.మనసుకు దేహానికి హాయిని, ఆరోగ్యాన్ని యిచ్చే శక్తి నవ్వుకు ఉంది. గమనించారా, మనకుఎవరైనా తెలిసినవారు కనిపిస్తే పలకరింపుకుముందు నవ్వు ముఖం పెడతాం.మానసికవత్తిడిని, ఆందోళన, చికాకు,రక్తపోటు వంటి వాటిని దూరంచేసే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది.డిస్కవరీ హెల్తు రిపోర్టు ప్రకారం, రోగనిరోధక శక్తికి అవసరంఅయిన ప్రోటిన్ ,రోగాలతొపోరాడే "టిసెల్స్ " "బిస్ ల్స్ "అనేకణాలు నవ్వడంవలన మనశరీరంలో ఉత్పన్న మౌతాయి. మనం నవ్వినపుడు ముఖం ఎర్రబడుతుంది,రక్తప్రసరణపెరగటమే దీనికి కారణం.నవ్వడంవలన "టియర్ గ్లాండ్స్ "ఒత్తిడికి లోనై ,కళ్ళుచెమ్మగిల్లతాయి, దీనివలన దృష్ఠి మెరుగుపడుతుంది."సైక్లింగ్ " "రోయింగ్ "మిషన్లపైన వ్యాయామం చేయడంవలన ఎన్ని క్యాలరీల శక్తి కర్చు చేస్తామో పెద్దగా నవ్వడంవలన దాదాపు అదేక్యాలరీలు కర్చు అవుతాయి.గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే మూడుసూత్రాలు పాటించాలి.1) రోజు తగినంత వ్యాయామం 2) చక్కటిభోజనం 3)హాయిగానవ్వుకోవడం.నేడు ప్రపంచమంతటా "లాఫింగ్ క్లబ్ "లువెలిసాయి.మనదేశంలో మొదటి నవ్వులదినోత్సవాన్ని 1998జనవరి 11 న ముంబయి లో నిర్వహించారు.భారతదేశం వెలుపల తొలిసారిగా "డెన్మార్క్ "లో పదివేలమంది పాల్గోన్న"నవ్వులదినోత్సవం" గిన్నిస్ బుక్" లో నమోదు చేయబడింది.అనంతరం మే రెండో తేదిన స్విట్జర్లాండ్ రాజధానిలో నవ్వులదినోత్సవంజరిగింది. లాప్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ "వారు ఏటా మే మాసం మొదటి ఆది వారం జరపాలని నిశ్చయించారు. విల్సన్ అనే అమెరికా మనస్తత్వ శాస్త్రవేత్త తనవృత్తిలో భాగంగా హాస్యానికి,మనిషి మానసిక ప్రవృత్తికి గల సంబంధాలను పరిశోధిస్తూ వర్క్ షాపులు నిర్వహిస్తూ,రోగుల మానసిక ఆరోగ్యం చేకూరడంలో నవ్వులకుగల ప్రాధాన్యతను గుర్తించాడు. 1997లో" ఇండాస్ పౌండేషన్ "అనే సంస్ధవారు"హౌ టు క్రియేఏపాజిటివ్ వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ " అనే అంశంపై ప్రసంగించడానికి విల్సన్ ను ఆహ్వానించింది. 1998లో విల్సన్ ఆటూరు నిర్వహించాడు.అప్పటినుండి నవ్వుల దినోత్సవానికి అంతర్జాతియంగా గుర్తింపు లభించింది.కిలకిలా,గలగలా,ముసిముసిగా, ఎలానవ్వినా అది యిద్దరిమధ్య స్నేహాన్ని పెంపొందిస్తుంది.చిన్నారుల బోసినవ్వుకు మురిసి నవ్వని వారు ఉంటారా!నవ్వులో సమ్మొహం, దైవత్వంఉన్నాయి.అందుకే దేవతా ధ్యానంలో "మందస్మితవదనారవింద" మొదలగునామాలుదేవిస్తోత్రాలలో కోకొల్లలుగా ఉన్నాయి. సంస్కృతంలో" మూక కవి"అనేసిధ్ఢపురుషుడు జగదంబ చిరునవ్వును వర్ణస్తూ వంద శ్లోకాలు రచించాడు.తిక్కనమహకవి ,మహభారతంలో (32) రకాల నవ్వులగురించి ప్రస్తావించాడు.పిన్ననవ్వు-చిరునవ్వు-అల్లనవ్వు-అలతినవ్వు-మందస్మితం-అంతస్మితం-జనిత మందస్మితం-ఉద్గత మందస్మితం-సాదర దరహసం-తిన్నని నవ్వు-లేత నవ్వు-కోండోకనవ్వు-పెలుచ నవ్వు-డబ్బు మిగిలిన నవ్వు-గేలిగోను నవ్వు-ఓత్తిలినవ్వు-అపహాసం-రోష కఠినహాసం-ఉద్బటహాసం-కలకల నవ్వు-ఎలనవ్వు-ఫ్రౌడ స్మితం-బెట్టునవ్వు.కన్నులనవ్వు-కన్నులనిప్పురాల్పునవ్వు-కినుకుమానిననవ్వు-కినుకుమానుంగు నవ్వు-కటిక నవ్వు-నవ్వుగాని నవ్వు-ఎర్రనవ్వు. నేటి మనయాంత్రిక జీవనంలో ఆరోగ్యంగాజీవించాలి అంటే నవ్వే శరణ్యం.అందుకే నవ్వుతూ నవ్విస్తూనిండు నూరేళ్ళు సంతోషంగా జీవిద్దాం!