తొలితరం తెలుగు మహిళ శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మగారు - B.R AJYALAKSHMI

తొలితరం   తెలుగు  మహిళ శ్రీమతి  దువ్వూరి  సుబ్బమ్మగారు

నేటి తరం లో మహిళలు అన్నిరంగాలలో విజయపథంలో దూసుకువెళ్తున్నారు . వారికి స్వేచ్ఛ వున్నది . కొన్ని సంవత్సరాల క్రిందట మహిళలు సంప్రదాయ ,సామజిక కట్టుబాట్లకు కట్టుబడి యెక్కువగా బయటకు వచ్చేవారు కాదు . అటువంటి క్లిష్ట సమాజంలో కొద్దిమంది మహిళలు స్వతంత్రం కోసం ధైర్యంగా ముందుకు రావడం అంత సులభం కాదు . తెలుగు మహిళ శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మగారు స్వతంత్రం కోసం సలిపిన పోరాటం తప్పకుండా తెలుసుకోవాలి . మెరుగుపడిన జాతిరత్నం గురించి మనపాఠకులకు తెలియచేయాలనే నా తపన . సుబ్బమ్మగారి జీవితచరిత్ర చదివి నేను ఒక తెలుగు మహిళగా యెంతో గర్వపడ్డాను . మిత్రులారా నా చిన్ని ప్రయత్నం అంతటి విదుషీమణిని గురించి చెప్పగలిగిన దానిని కాదు . కానీ అందరితో పంచుకోవాలనే నా చిన్ని తపన !

ఒక మధ్యతరగతి సనాతన సాంప్రదాయ కుటుంబం 1880 లో జన్మించారు . ద్రాక్షారామం జన్మస్థలం . పిన్న వయసులోనే రాజమండ్రి తాలూకా కడియం గ్రామస్థులు శ్రీ దువ్వూరి వెంకటప్పయ్య గారి తో వివాహం జరిగింది . అంట పిన్నవయసు లో నే సుబ్బమ్మగారు సంస్కృతం తెలుగు భాషలలో పట్టు సాధించారు . పురాణాలూ ,పద్యాలూ ,శ్లోకాలు సుబ్బమ్మగారికి వెన్నతో పెట్టిన విద్య . ఆధ్యాత్మిక చింతన కూడా వుండెది . ఇంత సాంప్రదాయ పరిసరాలలోనించి ఆవిడ బయటకు వచ్చి స్వతంత్ర సమర ఉద్యమం లో ప్రధాన భూమిక అవడం నిజం గా యెంతో గర్వించ తగిన విషయం .

1921 వరకు సుబ్బమ్మగారు అత్తవారింటి సాధారణ గృహిణి . రాకకీయాలు తెలియవు . అప్పుడప్పుడే గాంధీగారి స్వతంత్ర సమర శంఖారావం దేశం నలుమూలలా మారుమ్రోగుతున్నది . సుబ్బమ్మగారి భర్త కాల ధర్మం చెందారు . సంతానం లేదు . ఒంటరి పయనం మొదలయ్యింది . జన్మతః ధైర్యం ,ఆత్మ విశ్వాసం మెండు .

మానసిక వున్నతి వున్నవారు . దేశ స్వతంత్ర నినాదం ఆవిడలో తన కర్తవ్యాన్ని గుర్తు చేసి దేశ భక్తిని జాగృతం చేసింది . ఆ సంవత్సరం కాకినాడ లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు ప్రథమ గోదావరి జిల్లా మహాసభలో ప్రసంగించడానికి వచ్చారు . సుబ్బమ్మగారు ఆ మహా సభ కు వెళ్లారు . శ్రీ బులుసు సాంబమూర్తి గారు సంపూర్ణ స్వతంత్ర నినాదమే ప్రథమ లక్ష్యం గా తీర్మానం ప్రవేశ పెట్టారు . తీర్మానాన్ని బలపరుస్తూ సుబ్బమ్మగారు అనర్గళంగా వుత్తేజపూరితం గా వుపన్యసించారు . ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు . ఆ రోజుల్లో ఒక మహిళ బయటకు వచ్చి జనాన్ని తన వుపన్యాసం తో వుత్తేజపరచడం గొప్ప సంఘటన ! అప్పటినించీ ఆవిడ వుపన్యాసం వున్నదంటే యెన్నిమైళ్లయినా వెళ్లేవారు ,గంటల తరబడి కూర్చుని శ్రద్ధగా విని వుత్తేజితులయ్యేవారు . ఉద్యమాలలో సుబ్బమ్మగారి వుపన్యాసం తప్పనిసరిగా వుండేది .

సుబ్బమ్మగారి ఉపన్యాసాలు అధికారులకు ,పోలీసులకు సమస్య అయ్యేది . అప్పటివరకు ఆంధ్ర ప్రాంతం లో మహిళల అరెస్టులు లేవు . మహిళలకు ప్రత్యేక జైలు కూడా లేదు . పోలీసులకు , అధికారులకు సుబ్బమ్మగారిని అరెస్ట్ చెయ్యడం అంటే కోరి సమస్య తెచ్చుకున్నట్టు భావించేవారు . కానీ రోజురోజుకీ ఆవిడ ప్రసంగాల వల్ల జనం ఆకర్షిలవుతున్నారు . తప్పనిసరి పరిస్తికులలో సుబ్బమ్మగారిని అరెస్ట్ చేసి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష వేసి రాజమండ్రి జైలుకు పంపారు . సుబ్బమ్మగారు భయపడలేదు . తన శిక్షను పట్టించుకోలేదు . దేశం కోసం అన్నింటికీ సిద్ధం అయ్యారు . కలెక్టరుగారు ఆవిడను స్వయంగా కలిసి

"అమ్మా వ్రాతపూర్వకం కాకపోయినా కనీసం మాట ద్వారా క్షమాపణ చెప్పినా వెంటనే విడుదల చేస్తాం " అని ఒకవిధం చెప్పాలంటే ప్రాధేయపడ్డారు . "నేను క్షమాపణ చెప్పను ,శిక్ష అనుభవిస్తాను " అని సుబ్బమ్మగారు ఖచ్చితం గా చెప్పారు . అధికారులు అవమానం తో వెనుతిరిగారు . జైలులో ఆవిడను నానా యిబ్బందులకు గురిచేసారు . సుబ్బమ్మగారు చలించలేదు . అక్కడ వున్నసమయం లో తోటివాళ్లను యింకా వుత్తేజపరిచారు . అందరిలో జాతీయభావాన్ని కలిగించారు . కఠిన కారాగార శిక్ష పూర్తిగా అనుభవించి యింకా పట్టుదలతో విడుదల అయ్యారు . తొలి ఆంధ్ర తెలుగు మహిళ గా జైలుకు వెళ్లారు . భారత స్వాతంత్ర్య జాతీయోద్యమం లో ప్రథమ ఆంధ్ర ప్రాంత మహిళగా భారత చరిత్రలో నిలిచారు . ఆనాటి మహిళలకు మార్గదర్శిని అయ్యారు .

సుబ్బమ్మగారు గాంధీగారి ఆదేశానుసారం ఆంధ్రదేశం నలుమూలలా తిరుగుతూ ప్రజా వుద్యమాలలో అనర్గళం ప్రసంగిస్తూ ప్రజలను వుద్యమం భాగస్థులను చేసారు . రాజమండ్రిలో తనభావజాలానికి సరిపడ మహిళలతో కలిసి మహిళా సభలూ ,సమావేశాలూ యేర్పాటు చేసేవారు . మహిళావేదికలను ప్రచార వేదికలుగా మహిళను సమావేశపరిచి వుత్తేజితులను చేసేవారు .జాతీయ విద్యావిధానంలో స్త్రీవిద్య ప్రాధాన్యత వివరించేవారు రాజమండ్రిలో "సనాతన విద్యాలయం "అనే జాతీయ విద్యాలయం స్థాపించారు . సంస్కృతం ,తెలుగు ,కుట్టుపనులూ మహిళలకు బోధించి ఒకదారి చూపించారు . ఉచిత విద్య ,ఉచితం భోజనవసతి కల్పించారు . సుబ్బమ్మగారి కృషి ,తపన గమనించి ఆనాటి సమాజం ఆర్ధికంగా తమ సహకారం అందించారు .

సుమారు వంద సంవత్సరాల క్రిందట సామాన్య మధ్య తరగతి మహిళ ధైర్యం గా సాహసం గా జాతీయ వుద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచారంటే యీ తరం మహిళలు తప్పకుండా ఆవిడను గురించి తెలుసుకోవాలి .

" భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి "

శ్రీ చిలకమర్తి వారి యీ పద్యం రాగ భావం తో అభినయించి చూపుతూ తెల్లవారు గడసరితనం తో భరతజాతిని యెలా పీడిస్తున్నారో వ్యాఖ్యానిస్తూ బహిరంగ సభల్లో సుబ్బమ్మగారు ప్రసంగిచ్చేవారు . మైకులు లేని ఆ కాలం లో ఆవిడా కంఠం గట్టిగా స్పష్టంగా చాలాదూరం వినిపించేది . అటు హైందవ పురాణం శ్రవణం యిటు స్వంతంత్ర వుద్యమ ప్రసంగాలు సభికులు మంత్ర ముగ్ధులై వినేవారు . తన విద్వత్తును ,పాండిత్యాన్ని ,కల్పనాశక్తిని చతురతను వుద్యమ ప్రచారానికి వినియోగించారు . శ్రీ గరిమెల్లవారి "మా కొద్దీ తెల్లదొరతనం " పాటను భావయుక్తంగా చమక్కులతో ,చతురత తో బహిరంగం గా పోలీసులు డప్పులు వాయించి పాట వినపడకుండా చేసేవారు . ఆవిడ కోపం గా "ఏమోయ్ బ్రిటిష్ వారి బానిసల్లారా రండిరా నన్ను పట్టుకోండిరా "గట్టిగా అరిచేవారు . పోలీసులు ఇబ్బందిగా అటూ యిటూ చూస్తూ వెళ్లిపోయేవారు . ఇప్పుడు మనకు చదువుతుంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ ఆనాటి స్వతంత్ర ఉద్యమం లో యదార్ధ సంఘటనలు . ఆవిడ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడ్డిపోచగా భావించారు .

మహాత్ముని దండియాత్ర ,వుప్పు సత్యాగ్రహం మొదలయ్యాయి . సుబ్బమ్మగారు బళ్లు కట్టించుకుని లవణ ప్రభలు కట్టుకుని జాతీయగీతాలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ వుప్పుతయారు చేస్తూ చేయించేవారు . ఆవిడను ఆపడం యెవరి వల్లా అయ్యేదికాదు . 1930 మే 31 వ తేదీన సుబ్బమ్మగారిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు సెంట్రల్ జైలుకు ఆరునెలల శిక్షతో పంపారు . అప్పటికి జైలులో స్త్రీలకు ప్రత్యేక విభాగం యేర్పాటు అయ్యింది . చైతన్య జ్వాల యెక్కడికి పంపిన అక్కడ చైతన్యమేగా !జైల్లో ప్రసంగాలూ ,భజనలు ,పాటలు అందరినీ వుత్తేజితులను చేసేవారు . వంట చేసుకోవడానికి అధికారులను అడిగి మరీ తనకు కావలసిన వస్తువులు తీసుకునేవారు . అంతేకాదు రుచి రుచిగా వంట చేసి అందరికీ పెట్టేవారు . జైలు సిబ్బందికి కూడా తన వంట రుచి చూపించేవారు . అధికారులకు ఆవిడను యేమనాలో అర్ధం అయ్యేదికాదు .

కాంగ్రెస్ వారి ప్రతి వుద్యమంలో పాల్గొన్నారు . 1942 క్విట్ ఇండియా వుద్యమం లో ప్రధానం గా నిలిచారు . 14 సంవత్సరాలు అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో సభ్యులుగా వున్నారు .

కలలు ఫలించాయి . స్వతంత్రభారతాన్ని తన్మయం తో సుబ్బమ్మగారు అనుభవించారు . స్వరాష్ట్రాన్ని కూడా వీక్షించారు . పుట్టుక జీవనధర్మం ,మరణం జీవనధర్మం . పుట్టుకకు ,మరణానికి ఒక సార్ధకత కొందరికే సాధ్యం . దువ్వూరి సుబ్బమ్మగారు తనజీవనాన్ని మన అందరికీ ఉజ్వల జ్యోతి గా హృదయాలలో అమరజ్యోతిగా నిలిచారు . 1964 మే 31 వ తేదీన సోదరుని దగ్గర జీవనపయనం ముగించారు .