earth smile - రంగనాధ్ సుదర్శనం

నేల... నవ్వింది

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే...ఇన్నీ నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగసి పడుతుంటే..
ఇంకా తెలవారదేమి ఈ.. చీకటి విడిపోదేమి.. అని హుషారుగా ఈల పాట పాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు కృష్ణ మోహన్..

ఏవండోయి శ్రీవారు.. కాస్తా హుషారు తగ్గించండి ఎంత మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళుతున్నా.. మీరింకా విద్యార్థి దశలో లేరు...రిటైర్డ్ అని మరచి పోకండి బాసు..మనసుకున్న హుషారు..శరీరానికి ఉండదు ... కాస్త తగ్గoడి అంది శ్రీవాణి...
భర్త స్పీడుకు బ్రేకులు వేస్తూ...

నిజమే వాణి.. మేమంతా విడిపోయి ముప్పై ఐదు సవత్సరాలైంది, మళ్ళీ ఇన్నాళ్లకు మా బ్యాచ్ మేట్స్ అందరం ఒక చోట కలువబోతున్నాం.. అందుకే ... చాలా ఎగ్జైట్మెంటుగా...ఎంతో క్యూరియాసిటీగా ఉంది.. అన్నాడు కృష్ణ మోహన్ ఆనందం నిండిన గొంతతో.

అవునండి ... ఆ రోజులే కదా.. మన జీవితంలో మరపురాని మధురానుభూతులు, అంది శ్రీవాణి ..కనురెప్పలు ఆడిస్తూ..మరింత ఉత్సాహాంగా అవును వాణి... ఆరోజులే వేరు, ఏ బరువు బాధ్యతలు లేని జీవితం,గాలిపటంలా స్వేచ్ఛగా ఆకాశమే హద్దుగా ఉప్పొంగే ఆనందం, ఆట పాటలతో హాయిగా గడిచి పోయాయి రోజులు ..
తెలియకుండానే కాలం కరిగి పోయింది..అన్నాడు కృష్ణ మోహన్ రవ్వంత ఆనందం మరికొంత విషాదం నిండిన గొంతుతో..

జీవితమంటే అంతే కదండి...మనo మన తల్లిదండ్రుల చాటున ఉన్నంత కాలం, మనకే బాధర బందీ లేదు...
కానీ ... మనం తల్లిదండ్రుల మాయ్యాక మన పిల్లల బాధ్యత, పెద్దవాళ్లుగా మనకు తప్పదు కదండి ...అంది శ్రీవాణి జీవిత సత్యాన్ని వివరిస్తూ..

కారు కాలేజ్ గేటు ముందు ఆగింది.

అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు..
అందరూ ఆనందంతో ఆప్యాయంగా ..ఒకింత ఆశ్చర్యంగా ఒకరినొకరు పలకరించుకుంటూ..ఆలింగనాలూ చేసుకుంటూ సందడి.. సందడిగా..ఉన్నారు.

ఎదురుగా ఉన్న వేదికను చాలా చక్కగా అలంకరించారు.

మేమంతా కాలేజి నుండి విడిపోయేటప్పుడు దిగిన గ్రూప్ ఫోటోను పెద్ద బ్యానర్ గా చేసి స్టేజి పైన...కట్టారు.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో ...మైక్ లో చంద్రబోస్ గారి పాట వినిపిస్తుంది.

కారు దిగి ముందుకు నడిచాను.. ఒకరొకరుగా అందరూ నావైపు వస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ..ఆలింగనం చేసుకుంటున్నారు.అందరిని పేరు పేరునా పలకరిస్తూ నా శ్రీమతిని కూడా వారికి పరిచయం చేసాను.

కాలం ఎంత మార్పు తీసుకొచ్చింది.. మనుషులు ఎంతగా మారిపోయారు... అప్పుడు హిప్పీ కటింగ్, బెల్ బాటమ్ ప్యాంట్స్ తో ఉన్నవారంతా..ఇప్పుడు లావై పోయి ముందుకు నెట్టుకొచ్చిన పొట్టతో..పొలంలో నాటేసినట్లున్న అక్కడక్కడ మిగిలిన వెంట్రుకలతో కనిపిస్తున్న బట్టతలతో పోల్చుకోవటం కష్టాoగా కనిపిస్తున్నారు.

ఇక అప్పుడు చక్కగా లంగా వోణిలు వేసుకొని, .. పక్క పాపిట తీసి..నున్నగా దువ్వి వేసుకున్న వాలు జడ, ఆ జడలో ఒక పక్కకు స్టైల్ గా రెండు ఆకులతో కలిపి పెట్టుకున్న గులాబీ పువ్వుతోనో లేదా తలనిండా జాతర చేస్తున్నట్లు పెట్టుకున్న మల్లెపూల మాలలతోనో, పాత కాలపు హీరోయిన్ లా కనిపించే అమ్మయిలంతా ..ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని, అమ్మవారిలా నగలు వేసుకొని, వయసును దాచి పెట్టే రంగు పూసిన పోనీ టైల్స్ తో... , సంకలో వ్రేలాడే హ్యoడ్ బ్యాగ్స్ తో మోడరన్ గా కనిపిస్తున్నారు..

ఆనాడు చెంగు చెంగున గంతులు వేసిన వారిలో ఎక్కువమంది కాస్త కాళ్ళు ఒత్తి పట్టి అడుగులు వేస్తూ నడుస్తున్నారు, బహుశా పైబడ్డ వయసు,పెరిగిన బరువు కారణంగా మోకాళ్ళ నొప్పులవలన కావొచ్చు అనుకున్నాను.

జ్యోతి ప్రజ్వలన అనంతరం వందే మాతర గీతంతో సభ ప్రారంభం మైంది.

అందుబాటులోవున్న కొంతమంది మా గురువులు వేదికపై ఆసీనులయ్యారు..

ముందుగా పరిచయ కార్యక్రమం మొదలైంది...

ఒక్కొక్కరుగా వెళ్లి ఆత్మవిశ్వాసంతో తమ హోదాను, జీవన సాఫల్యతను..ఒకిoత గర్వాంగా
తమ పిల్లలగురించి గొప్పగా చెపుతున్నారు.

నాకు కాలేజి లో దాదాపుగా అందరూ కనిపించారు కానీ నాకు మంచి స్నేహితుడు..నాకే కాదు కాలేజీలో అందరివాడనే పేరున్న మా మాధవరావు ఎక్కడ కనిపించలేదు.

నా పక్కనే ఉన్న స్నేహితునితో మాధవరావు గురించి వాకబు చేసాను అతను అదే ఊరి వాడు కావటంతో..

మాధవరావు ఈ ఊరిలోనే వున్నాడని..మంచి ఉద్యోగం వచ్చినా ఉన్న ఊరిని, కన్నవారిని వదలలేక.. వ్యవసాయం మీద వున్న మక్కువతో వదులుకున్నాడని..

కానీ కాలం కలిసిరాక ... ఎన్నో అధునాతన పద్ధతులతో వ్యవసాయం చేసినా .. వాడి దురదృష్టం ఎప్పుడు వానికన్నా పది అడుగుల ముందే ఉండటం వలన ... పంట కలిసి వస్తే గిట్టుబాటు ధర లేక...ధర వున్నప్పుడు పంట దిగుబడి లేక..ఆర్ధికంగా చితికి పోయాడని.పిల్లల చదువుల కోసం కొంత పొలాన్ని కూడా అమ్మేసాడని, అప్పులు పెరిగి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని..పాపం అంటూ వివరించాడు.

నా మనసు భారoగా అనిపించింది.
మరొక్క నిముషం స్థిమితంగా అక్కడే వుండబట్టలేక పోయాను.

మా కాలేజీలో అన్నింటా ఫస్ట్ మాధవరావే...వాడి ని భవిష్యత్ లో నువ్వు ఏం.. కావాలునుకుంటాన్నావు
అని ఎవరడిగినా.. రైతును కావాలనుకుంటున్నాను..
ఈ దేశానికి అన్నం పెట్టాలనుకుంటున్నాను
అని గర్వాంగా చెప్పేవాడు.

వెంటనే లేచి వాడిదగ్గరికి బయలు దేరాను.

సగటు భారత రైతు దీనావస్థ వాడి ముఖంలో దీనంగా కనిపించింది,ఆకలితో భరతమాత వాడి గుమ్మంలో నిలుచున్నట్లనిపించింది.

నెరిసిన గడ్డం,సంస్కారం లేని జుట్టు, పీక్కుపోయిన బుగ్గలు,లోతుకు వెళ్లిన కళ్ళు..బీడు భూమిలా నెర్రలు పాచిన అరికాళ్ళు...

వాడినలా చూడగానే నా గుండె తరుక్కుపోయింది.

నన్ను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి వచ్చాడు.

బాగున్నావా అని దూరంగా ఆగిపోయాడు సంకోచిస్తూ...

ఎన్నోసార్లు ఎంతో మందికి అన్నం పెట్టిన ఇల్లది, ఎందరినో ఆదుకున్న చెయ్యి వాడిది...నేడు సయాంకోసం..దీనంగా నిలబడ్డ ట్లు అనిపించింది.

ఏరా ఆగిపోయావు..అంటూ ఆప్యాయంగా వాడిని హత్తుకున్నాను..
వాడి కళ్ళు వర్శిస్తున్నాయి..నేలతల్లిని నమ్ముకున్నందుకు వాడికి దక్కిన ప్రతిఫలం ఇదా ఇలా రైతు కుదేలైతే... భావితరాలకు అన్నం ఎవరు పెడతారు.
ఆకలైతే డబ్బుల కట్టలు తినలేము కదా...అనిపించింది.

ఏరా...రాలేదు, పద మన ఫ్రెండ్స్ అందరిని కలుద్దాం అన్నాను.

వద్దురా ...ఈ పరిస్థితిలో నేను రాలేను అన్నాడు దీనంగా కారుతున్న కంటి దారను తుడుచుకుంటూ..

మరొక్క మాట మాట్లాడవద్దు..నువ్వు రాకుంటే నా మీద ఒట్టే...మన స్నేహం మీద ఒట్టే అన్నాను వాడిని కన్విన్స్ చేయలేక.

ఏమనుకున్నాడో..ఏమో ఉన్న పలానా బైలు దేరాడు.

వేదిక పై పరిచయాలు ఇంకా కొన సాగుతున్నాయి.

వేదిక పైన శివప్రాసాద్.. మాట్లాడుతున్నాడు తను ఎలా ఇండస్ట్రియలిస్ట్..గా ఎదిగింది ఎలా కోట్లకు పడగ లెత్తింది చెపుతున్నాడు..అందరూ ఆసక్తిగా వింటున్నారు.

వాడు మాట్లాడుతుంటే వాడి అసిస్టెంట్లు అందరికి వాడి కంపెనీ డైరీలు ,క్యాలండర్లు...స్వీట్ ప్యాకేట్స్ పంచుతున్నారు.

అప్పటికే చాలామంది మాట్లాడారు ఎక్కువమంది బ్యాంక్ ఉద్యోగులు,లెక్చరర్లు,టీచర్లు ..ఇద్దరు ముగ్గురు డాక్టర్లు..ఇంజనీర్లు ఉన్నారు.

నా వంతు వచ్చింది...

మా గురువులకు పాదాభి వందనం చేసి మాట్లాడటం మొదలు పెట్టాను.

అప్పటివరకు..అందరూ..వారి స్వగతం గురించి బాగా సెటిల్ అయిన మా స్నేహితల గురించి...గొప్పగా మాట్లాడారు.

ముందుగా ..నన్ను నేను పరిచయం చేసుకుని...

నిజంగా ఇన్నాళ్లకు ఇవ్వాళ మనం అంతా కలుసుకోవడం చాలా ఆనందించ దగ్గ విషయం..వాట్సాప్ పుణ్యమా అని ముందుగా గ్రూప్ ద్వారా అందరం దగ్గరయ్యాము. ..మళ్ళీ మనం కలుస్తామో లేదో...కలసినా.. ఇప్పుడున్న అందరం ఉంటామో.. లేదో.. చెప్పలేము కదా..

కానీ ఇవ్వాళ మనం మాట్లాడాల్సింది మన గురించి కాదు..మనం అంతా బాగున్నాము కాబట్టే..ఇంత ఆనందంగా..ఇక్కడ కలుసుకున్నాము.

కానీ...కానీ..మనకెంతో ఇచ్చిన మనదేశం..మన కోసం ఆరుగాలలు కష్టపడుతున్న రైతు... ఇవాళ దిక్కుతోచని స్థితిలో దీనంగా నిలబడ్డాడు.

రైతు..దిగులు పడితే భూమాత ను ఓదార్చేది ఎవరు...

ఆ తల్లి ఎదపై పచ్చిని సింగారాన్ని పండించేదెవరు..

భూమి తల్లిని బాలింతరాలును చేసి పురుడు పోసేది ఎవరు..

మనo డబ్బులతో ఏదైనా కొనగలమేమో
కానీ...
కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఆర్టిఫీషియల్ గా ఒక్క బియ్యపు గింజను తయారు చేయలేమన్నది వాస్తవం కాదా...

వంద కోట్ల నోట్ల కట్టలు తిన్నా మన ఆకలి తీరదు కదా..

రైతు కన్నీరు పెడితే...భూతల్లిని ఓదార్చేది ఎవరు

మనకు పట్టెడన్నం పెట్టేది ఎవరు ....ఒక్క సారి ఆలోచించండి.

మనతో చదువుకున్న మన క్లాస్ ఫస్ట్ మన మాదవన్న... ఆనాడే నేను రైతు నవుతానాని, ఈ దేశానికి తిండి పెడతానని గర్వాంగా చెప్పే వాడు.

కానీ పరిస్థితులు...దళారులు దగా చేయటంతో నేడు మౌనంగా రోదిస్తున్నాడు ..గుండెలనిండా భూమి తల్లిపై ..ఆశ ఉన్న ఆర్ధిక పరిస్థితి వెనుకకు లాగుతుంది..ఇది ఒక్క మాదవన్న స్థితి మాత్రమే కాదు, ఇది రైతులందరి దీన గాధ.

ఇది సందర్భం కాకపోయినా..మన స్నేహితుని కోసమైనా ..

ఇవ్వాళ మనం మాట్లాడాల్సింది రైతు గురించి..వారి పరిస్థితిని గురించి..మన దేశం గురించి.

మనం రైతన్నను కాపాడుకోవాలి...ఇంత ఆధునీకరణ జరిగినా... ప్రయోగశాలలో కృత్రిమంగా ఒక్క అన్నo మెతుకు తయారుచేయలేము ఇది వాస్తవం కాదా . .

అందుకే మనమంతా ఈ దేశం కోసం..మన ఆకలి కోసం మాదవన్న లాంటి రైతులను బ్రతికించు కోవాలి..ఆ అన్నదాత ఉంటేనే మనం వుంటామన్న విషయం అందరికి తెలిసేలా చెయ్యాలి.

మనకు అన్నం పెట్టే రైతన్న ..అన్నమో.. రామచంద్రా అని అలమటిస్తూన్నాడు కానీ మనకు పట్టడం లేదు,

పంటను పండించిన రైతన్న పస్తులుంటున్నాడు...అయినా మనకు పట్టింపు లేదు,

పెరుగన్నానికి బదులు పురుగుల మందు తాగుతున్నాడు అయినా మనకేం బాధ లేదు,

అన్నం దొరకక,
అప్పు పుట్టక,
ఆరుగాలం కష్టపడ్డా ..అప్పులు తీరక రైతన్న ఉరితాడుకు వేలాడుతున్నాడు...సాటి మనిషిగా మనకు జాలి కలగటం లేదు,..

ఇన్ని కష్టాలున్నా రైతు వ్యవసాయం ఆపటం లేదు..

కానీ...

ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు రైతు కాడి కింద పడేస్తే మనం ఏమవుతామో ఆలోచించండి...

ఈ దేశం ఏమవుతుందో ఆలోచించండి..మనం నిర్ణయం తీలుకోవాల్సిన సమయం వచ్చింది..
ఇంకా తాత్సారం చేస్తే మన ఉనికికే ప్రమాదం వస్తుంది..

అంటూ......

ఆవేశంగా మాట్లాడాను..
నా ఉపన్యాసం అందరిలో ఆలోచన రేకెత్తించింది.. ఒక్కసారిగా చప్పట్లు మారుమ్రోగాయి, అందరి దృష్టి మాధవ్ వైపు మళ్లింది.

అంతా కలిసి మాధవన్నను వేదిక పైకి తీసుకొచ్చారు...

శివ ప్రదాద్...మాదవకు కావాల్సిన పూర్తి సహాయం అందిస్తానన్నాడు.మాధవన్నాను తన బిజినెస్ పార్ట్ నర్ గా చేసుకొని..మాధవ్ పేరు తో ఆర్గానిక్ ఆహార ధాన్యాల స్టోర్స్ ఏర్పాటుచేసి ,వాటి ఎగుమతుల వ్యాపారం కూడా ప్రారంభిస్తానని ప్రకటించాడు.

దీని షేర్లు కేవలం మన మిత్రలకు మాత్రమే అందించి, మీ అందరిని ఇoదులోకి ఆహ్వానిస్తున్నానని ప్రకటించాడు.అందరూ సంతోషంగా కరతాళ ధ్వనులతో ఆమోదించారు.

మేమంతా ఇక నుండి మాకు కావాల్సిన ఆహార ధాన్యాలు మన సంస్థ నుండే కొంటామని..మాకు రసాయన ఎరువులు వాడని సేంద్రియ ఎరువుల ద్వారా ఉత్పత్తియైన ఆహార ధాన్యాలు అందించే మంచి నిర్ణయం తీసుకున్నందుకు శివ ప్రసాద్ ను అంతా అభినందించారు...
అలాగే..
మాధవ్ కు అంతా గుడ్ లక్ అంటూ విషెస్ చెప్పారు...

మాదవకు గొప్పగా సన్మానం జరిగింది.

అందరూ ఇచ్చిన మాట నిల బెట్టుకున్నారు .

మాధవ్ తన పొలంతో పాటు ఊరి వాళ్ళ పొలాలన్నింటిలో సెంద్రియ ఎరువుల ద్వారా ఆహార ధాన్యాలు పండిoచటం మొదలు పెట్టాడు ,మాధవ్ ఆర్గనిక్ స్టోర్స్ ప్రారంభించి ఆహార ధాన్యాలతో పాటు కూరగాయలు,పండ్లు పాల ఉత్పత్తులు గుడ్లు మొదలైనవి అమ్మటం ప్రారంభించారు.

అనతి కాలంలోనే ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించింది.

మాధవ్ గొప్ప వ్యవసాయ క్షేత్రం ప్రారంభించి, . తనతో పాటు ఎందరో రైతులకు బాసటగా నిలిచాడు.

మా అందరికి రుచి శుచి కలిగిన రసాయన రహిత ఆహారధాన్యాలు ఇప్పుడు మాధవ్ ఆర్గానిక్ స్టోర్స్ డోర్ డెలివరీ ద్వారా అందిస్తుo ది.

ఇప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాతికి స్నేహితులమంతా..మాధవ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ షేర్ హోల్డర్స్ హోదాలో కలుసుకుంటున్నాము..

మాదవన్న అందరికి కొత్త బట్టలుపెట్టి ...రెండు రోజులు నోటికి ఇంపైన రుచిగల పదార్ధాల రుచులు చూపించి , మా కలయికను ఒక పండుగలా జరుపుతున్నాడు.

రైతులంతా...మాకు చక్కటి అథిది మర్యాదలు చేస్తున్నారు.

రైతుల ఆదాయం పెరిగి వారి ముఖంలో చిరునవ్వు వచ్చింది.

రైతుల ఆనందాన్ని చూసి నేలతల్లి...పులకించింది.

ఇలా అందరూ...మంచి ఆహార ధాన్యాలు రైతు దగ్గరే కొంటే... మన ఆరోగ్యం..రైతు ఆదాయం బాగుంటుంది కదా..

కానీ పండించే రైతు..కొనుగోలు చేసే వినియోగ దారులు...ఈ దోపిడినుండి ఎప్పుడు విముక్తులవుతారో...అనుకున్నాను.

రైతు నిజమైన మహారాజు ఎప్పుడు అవుతాడో..నేల తల్లి ఎప్పుడు నవ్వుతుందో కదా...అనుకున్నాను.

ఆత్మీయుల కలయిక ఒకరి బాధలు ఒకరు పంచుకోవటానికి జరగాలి,చేయగలిగినంతలో మనం కాస్త చేయుతనందిస్తే..... మన వారి జీవితాలు కొంచం మైనా మారుతాయి...నా వరకు అదే నిజమైన ఆత్మీయ సమ్మేళనం అని అనుకుంటాను..

నా ఆలోచన ఒక మంచి మార్పుకు నాంది పలకడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.

....జై కిసాన్...

......సమాప్తం......

మరిన్ని కథలు

Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ