అనాథ అతిథ్యం - - బోగా పురుషోత్తం

Anaadha atidhyam

పీర్లపాళెంను నందయ్య పాలించేవాడు. పీరయ్య ఓ అనాథ, అతను ఓ అడవిలో పుట్టాడు. పుట్టినప్పుడే తల్లిదండ్రులను చనిపోయారు. అప్పటి నుంచి ఆలకులు, అలములు తింటూ బతుకుతున్న పీరయ్యకు ఓ రోజు అడవిలో పీర్లపాళెం రాజు నందయ్య ఎలుగుబంటు బారిన పడి ప్రమాదంలో వున్న సంగతిని పసిగట్టాడు. వెంటనే పొదల మాటున దాక్కుని పెద్ద కర్రలతో శబ్దం చేస్తూ పోరాడి ఎగులుబంటిని తరిమివేసి నందయ్యను రక్షించాడు. గాయాలతో బయటపడిన నందయ్య ఊపిరి పీల్చుకుని పీరయ్య ధైర్య సాహసాలకు మెచ్చి తన ఇంటికి తీసుకెళ్లాడు.
ఇంటి వద్ద రాజు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రాణి రాజేశ్వరికి పీరయ్య తనను రక్షించిన సంగతిని వివరించాడు నందయ్య.
ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి తన భర్త ప్రాణాలు కాపాడిన పీరయ్యను అక్కున చేర్చుకుంది రాజేశ్వరి.
అసలే బిడ్డలు లేని రాజ దంపతులకు సంతాన లేమి బాధ తీరిఆసరా దొరికింది. అప్పటి నుంచి వీరయ్యను కన్న బిడ్డ వలే చూసుకున్నారు రాజ దంపతులు.
అనాథ కావడంతో పేదరికంలో బతికిన పీరయ్య రాజ దంపతులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారసుడయ్యాడు. వృద్ధాప్యం సమీపించిన రాజ దంపతులు పీర్లపాళెం యువరాజుగా పీరయ్యను ప్రకటించి పట్టాభిషిక్తుడ్ని చేయడానికి సిద్ధమయ్యారు.
ఇది చూసిన మంత్రి మల్లేశం గొంతులు పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. తన ఒక్కగా నొక్క కొడుకు ప్రకాష్‌ని పీర్లపాళెం రాజ్యాధిపతిని చేయాలని కలలు కన్నాడు. తన కోరిక నెరవేకపోవడంతో కొరకరాని కొయ్యగా మారిన పీరయ్యను అంతం చేయాలని పన్నాగం పన్నాడు. ప్రతి రోజూ పీరయ్యకు బయటి నుంచి తీసుకొస్తున్న ఆహారంలో విషం కలపాలని నిశ్చయించుకున్నాడు. తన వ్యూహం అమలుకు సహకరించాలని కొడుకు ప్రకాష్‌ని కోరాడు.
పట్టాభిషేక మహోత్సవం రానే వచ్చింది. అందరికీ విందు ఏర్పాటు చేశాడు. అందరూ భోజనం తినడానికి కూర్చున్నారు. ప్రత్యేకంగా బయటి నుంచి తెచ్చిన మాంసాహార భోజనాన్ని వడ్డించడానికి తెచ్చారు. రాజు అప్యాయంతో అతిథికి వడ్డించాడు. పీరయ్య నోట్లో పెట్టుకుంటున్న సమయంలో ప్రకాష్‌ విసురుగా తోసివేశాడు.
పీరయ్య కళ్లు చింత నిప్పుల్లా మండాయి. వెంటనే రాజ భటులను పిలిపించి ప్రకాష్‌ని బందించాడు. పక్కనే వున్న మంత్రి మల్లేశ్‌ రాజుపై విరుచుకుపడ్డాడు. అది చూస్తున్న ప్రకాష్‌ అక్కడికి వచ్చి చేతిలో వున్న సంకెళ్లతోనే తండ్రిపై విరుచుకు పడ్డాడు. ఈ హఠాత్మరిణామానికి మల్లేశ్‌ విస్తుపోయి కింద పడ్డాడు. అదే సమయానికి ఓ శునకం అక్కడికి వచ్చింది.
పీరయ్య తింటున్న ఆహారాన్ని రుచి చూసింది. కాసేపటికే కళ్లు తిరిగి ప్రాణాలు కోల్పోయింది.
అది చూస్తున్న రాజు నందయ్య క్రాష్‌ వైపు చూశాడు. జరిగిందేమిటో వివరించాలని కోరాడు. తన తండ్రి తనకు రాజ్యాధిపత్యం దక్కడానికి చేసిన పన్నాగాన్ని వివరించాడు ప్రకాష్‌, అదే సమయానికి కాస్త తేరుకున్న మంత్రి మల్లేశ్‌ రాజుపై మెరుపు వేగంతో దాడి చేశాడు. ఇది గమనిస్తున్న ప్రకాష్‌, పీరయ్య ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మంత్రిపై విరుచుకుపడ్డారు. అతని వెనుకే వచ్చిన తిరుగుబాటు సైనికులను చాకచక్యంగా నిలువరించారు.
ప్రకాస్‌ పరాక్రమంతో మంత్రి మల్లేశ్‌, తిరుగుబాటు సైనికులు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న వారిని సైనికులు బందించి చెరసాలలో వేశారు.
ప్రాణాలు దక్కిన రాజు ఊపిరి పీల్చుకుని రక్షించిన ప్రకాష్‌కి, పీరయ్యకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనకు ఎంతో ఉపకారం చేసిన పీరయ్యను పట్టాభిషిక్తుడిని చేశాడు.
రాజును రక్షించి దేశభక్తిని చాటిన ప్రకాష్‌ని విడిపించి మంత్రిగా నియమించాడు ఆతిథ్యంలో వున్న అనాథ అతిథి పీరయ్య.
అనాథ అతిథి ఆతిథ్య పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో గడిపారు. రాజ దంపతులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని కథలు

Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు