సహాజీవనం - సత్య సాయి శ్రీనివాస్ వడ్డాది

సహాజీవనం

ఉదయం 8 గంటలు

కాలింగ్ బెల్ శబ్ధం విని లేచి తలుపు తెరిచాడు జీవన్ , ఎదురుగా సహజ

“ గూడమోర్నింగ్ జీవన్ “

“వెరీ గూడమోర్నింగ్ , బస్ లేట్ అనుకుంటాను “

“ అవును ఇంకో గంటలో కంపెనీబస్ వచ్చేస్తుంది , నేను రెఢీ అవ్వాలి “ కంగారుగా లోపలికి వస్తూ , బాగ్ సోఫాలో పడేస్తూ అంది

“నువ్వు రెఢీ అవ్వు , ఈ లోపున నేను బ్రేక్ ఫాస్ట్ రెఢీ చేస్తాను, ఒట్స్ ఉప్మా ఒకే కదా “

“ యా థాంక్స్ “ అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సహజ.

సహజ , జీవన్ వీళ్ళిద్దరూ గత సంవత్సరంగా “ సహాజీవనం “ చేస్తున్నారు , ఆమెది పూణే, అతనిది బెంగళూరు , ఇద్దరూ పని చేసేది హిటెక్ సిటీ లో , ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలసి , స్నేహం పెరిగి సహాజీవనం వరకు వచ్చింది. ఇద్దరి ఇళ్ళలో తెలుసు నియో రిచ్ ఫామిలీస్ పిల్లల సైకాలజీ బాగా అర్థం చేసుకున్నారు. స్వచ్చమైన స్నేహం వెనుక మగ , ఆడ అనే భావన మరుగున పడి , అరమరికలు లేని ఆనందమైన జీవనం గడుపుతున్నారు.

ఈరోజే రెండు గంటల తేడా లో వారి వారి వూరలనుంది వచ్చారు. నిన్ననే ఒకే రోజు యాదృచ్చికంగా “ పెళ్ళిచూపులు”

జరిగాయి .

“ సహజ రెఢీ యా “ గట్టిగా అరిచాడు జీవన్

‘ నేను రెఢీ “ అంటూ కిచెన్ లోకి వచ్చింది.

గబ గబా అతను చేసిన ఉప్మా తింటూ ,” నైట్ డిన్నర్ కి బయటకి వెళదాము” అంది.

“షూర్ ఎనీ థింగ్ స్పెషల్ “

“ ఏమీ లేదు రాత్రి చెబుతాను , బై ,బై “ అంటూ వెళ్ళిపోయింది.

ఏదైనా సంతోషం కానీ భాధను కానీ షేర్ చేసుకోవాలంటే అతన్ని అలా అడుగుతూ వుంటుంది . ఈ సంవత్సర కాలంలో , మూడు , నాలుగు సార్లు అలా స్పెషల్ డిన్నర్ కి వెళ్ళిన సందర్బాలు వున్నాయి.

రాత్రి 9 గంటలు , రెస్టారెంట్ లో ఒక మూలగా ఇద్దరూ సెటిల్ అయ్యారు.

వేడి వేడిసూప్ సిప్ చేస్తూ అతను అడిగాడు “ ఎలా వున్నాడు అబ్బాయి”

“ నచ్చలే , అతన్ని చూడగానే మనకు సెట్ అవడు అనిపించింది , అతను ఉన్నంతసేపు ఒక యుగంల గడిచింది .

అతను గడప దాటిన వెంటనే డాడీ కి చెప్పీసాను లైట్ తీసుకోమని , ఆ తరువాత పూర్తిగా అతన్ని నా మది లోంచి తీసేశాను.

“ మరి నీ పెళ్ళిచూపులు ఏమయ్యాయ్ “ అడిగినది సహజ

“ అమ్మాయిని చూడగానే ఫ్లాట్ , చాలాఅందంగా ఉంది “.

“ సొ మ్యాచ్ ఫిక్స “అలా అంటుంటే ఆమె కళ్ళలోని “ అసూయ” అతని ధృష్టి దాటిపోలేదు.

నో నో , ఆ అమ్మాయి తో వ అరగంట సేపు మాటళ్లడక , భిన్నాభిప్రాయాలు నా మసుని చిన్నా భిన్నం చేసేసాయే. ఇంట్లో వాళ్ళకి “నో “ చెప్పేసాను.

“ మరి ఆంటీ ఏమి అనలేదా “

“ వంటి కాలి మీద లేచింది , అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇదేమిట్రా ఇలా , ఎంతకాలం ఇలా “ అంది.

“ మీ డాడీ ఏమమన్నారు “ సహాజని అడిగాడు జీవన్.

“ ఏమంటారు , ఈ సంవత్సరం నీ పెళ్లి చేయాలి , నీ తరువాత చెల్లి ఉంది , నా రిటైర్మెంట్ లోపల మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేస్తే మంచిది , “ అన్నట్టు జీవన్ ఎలా ఉన్నాడు “అని అడిగాడు.

“ నాన్న నీ ప్రస్తావన అసంకల్పితంగా తెచ్చాడో , మరి ఎందుకో తెలియదు కానీ రాత్రి అంతా నీ గురించే ఆలోచించా “

“అంతలా ఏమి ఆలోచించావు “ నవ్వుతూ అడుగాడు , ఎందుకో అతని సిక్స్త్ సెన్స్ చెబుతోంది ప్రపోసల్ ఆమె నుండే వస్తుందని .

అనూహ్యంగా ఆమె మాట మారుస్తూ “ మరి మీ దాడిఏమమన్నారు “ అని అడిగినది

నాతో ఏమి అనలేదు కానీ అమ్మ తో అంటుంటే విన్నాను “ సహజ ఇన్ఫ్లూయెన్స్ వీడిపై వుండేమో “ అని

నేను దగ్గరిక రాగాం టాపిక్ మార్చేశారు , రాత్రి నేను బయలుదేరి వచ్చేశాను.

ఈలుపున వైటర్” మెయిన్ కోర్సు” తెచ్చి వాళ్ళకి వడ్డించడంలోయిద్దరూ సైలెంట్ ఇయిపోయారు. వైటర్ వెళ్లిపోయాక

ఆమె అడిగినది “ ఇన్ఫ్లూయెన్స్ “ అంటే ఆయన ఉద్దేశ్యం , అలా అడుగుతూ ఉంటే ఆమె కళ్ళలో వర్ణించలేని ఆనందాని చూశాడు.

“ ఏమో నాకేం తెలుసు , ఎప్పుడైనా కనిపిస్తే , ఆయన్నే అడుగు “ నవ్వుతూ అన్నాడు.

అతను, ఆటపట్టిస్తున్నాడాని గ్రహించింది , ఇక ఆలోచించలే , ఆమె మనసులోని మాటలని ప్రవాహంలా చెప్పేసింది

“చూడు జీవన్ , మనిద్దరం పెళ్లి చూపుల పేరిట ఎవరెవరితోనో గంటల తరబడి మాట్లాడుతున్నాము అదే ఓ గంటసేపు మనం మాట్లాడు కుంటే మన జీవితాలు సెటిల్ అయిపోతాయి, ఆడ పిల్ల అయినా మొదట నేనే అడుగుతున్నాను , మనిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు , దీని గురించి detailed గా ప్లస్ ఆర్ మైనస్ లు ఎందుకు మాట్లాడుకో కూడదు,ఇద్దరం కొంచం టైమ్ తీసు కుందాం , వచ్చే ఫ్రైడే ఇదే రెస్టారెంట్ లో ఓ నిర్ణయానికి వద్దాం “

తొందరగా చెప్పేసి భాధ తీరినట్టు గ్లాసుడు మంచి నీళ్ళు తాగేసింది .

“ థాంక్స్ సహజ , నేనెలా చెప్పాలా అని తెగ మధన పడిపోతున్నాను .నువ్వే బెటర్ తొందరగా ఓపెన్ అయ్యావు.

అలాగే అన్నీ ఆలోచించ నిర్ణయం తీసుకుందాం.

శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తెరిచి ఎదురుగా ఉన్న “ సహజ “ ని చూసి ఆశ్చర్య పోయాడు జీవన్ తండ్రి ఆనందరావ్ .

“ గూడమోర్నింగ్ అంకుల్ , హో ఆర్ యు “పలకరింపుగా అంది సహజ

“ వెరీ ఫైన్ , వెరీ గ్లాడ్ టు సీ యు , కం ఇన్” నవ్వుతూ గుమ్మనికి అడ్డు తప్పు కున్నాడు ఆనందరావ్ .

ఈలోపున బెడ్రూం లోంచి హాల్ లోకి వచ్చిన జీవన్ తల్లి నీరజ “ సహజ ఎప్పుడు వచ్చావు , ఇంత హటాత్తుగా , జీవన్ కూడా వచ్చాడా “ అంది

లేదు ఆంటీ జీవన్ రెండు రోజులుగా ముంబై లో వున్నాడు.

టిఫిన్ చేస్తుంటే సహజ అంది “ అంకుల్ ఏమనుకోకుండా ఒక గంట లేటుగా ఆఫీసు కి వెళ్లగలరా ,మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినత్తయితే , ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా అడుగుతున్నందుకు.

ఆయన ఒక నిమిషం తట పటాయించి దాని దేముందమ్మా , నేను ఆఫీసు కి హాఫ్ డే పర్మిషన్ పెడతానులే అంటూ ఆఫీసు కి ఫోన్ చేసి చెప్పేశాడు.

చెప్పమ్మా ఏమిటి సంగతి , నీరజ కూడా టిఫిన్ వడ్డించి డైనింగ్ టేబల్ దగ్గర సెటిల్ అయ్యింది.

“ చూడండి అంకుల్, మీకు తెలియనిది ఏముంది గత సంవతరంగా నేను , జీవన్ సహాజీవనం చేస్తున్నాము , గడచిన ఆరు నెలలలో నేను ఒక పది పెళ్లి చూపులు చూసి వుంటాను. ఏ అబ్బాయీ నచ్చటం లేదు. నచ్చక పోవడానికి పెద్ద

రీసన్ లు వుండటం లేదు , చాలా ఆలోచించాక నాకు తెలిసింది ఏమిటి అంటే “కంపేర్ చేస్తే జీవన్ టాప్ లో వున్నాడు . సోమవారం మేము ఇదే మాట్లాడుకున్నాం , ఈ రోజు ఒక నిర్ణయానికి వద్దామను కున్నాం , నా కెందుకో అంతకన్నా ముందుమీ నిర్ణయం తెలుసుకుండామని వచ్చేశాను. ఏది ఏమైనా మీ ఇద్దరు వప్పుకుంటేనే మా పెళ్లి.

“ ఆహారపు అలవాట్లు , సాంప్రదాయ సిద్దాంతాలదీ ఏముంది , అలవాటుకి , ఆలోచనకి మధ్య గీత చెరిపేస్తే , బంధానికి అనుబంధానికి మధ్య “ ముడి” వేసినట్టే కదా , ఇంతకన్నా ఆడపిల్లకి కావలసిన “మూడుముళ్ళు” ఏముంటాయి . మీ అభిప్రాయాలు మీదే మాజీవితాలు ఆదారపడి వుంటాయి , మీ సైడ్ ఒకే అయితే , మా వాళ్ళను నేను ఒప్పించగళనని నమ్మకం నాకుంది. మీ నిర్ణయం మా మంచి కోరేలా వుండాలని నా తపన.

అదే సమయంలో పూణే లో జీవన్ సహజ వాళ్ళ పేరెంట్స్ తో మాటల్లాడుతున్నాడు.

“ అంకుల్ , నాకు సహజ కు “ సహాజీవనం” అనేది స్నేహం తో ఏర్పడ్డ తాత్కాలిక అవసరం,అలా అని ఈ రోజు దాకా మా పరిధులు దాటి ప్రవర్తించలేదు , దాదాపు ఒక సంవత్సరం దాటింది , నాకీ మధ్య ఏ పెళ్ళిచూపులకి వెళ్ళినా ఏ అమ్మాయి తోనూ వెవు లెంగ్త్ కుదరటం లేదు , భౌతికంగా నేనీ ప్రపంచంలో ఉన్నా , మానసికంగా “సహజ” నా ప్రపంచం అయిపోయింది అందుకే ఎంత అందగత్తె అయినా “పోలిక “ అని వచ్చేసరికి సహజ ముందు దిగదుడుపే. ఈ విషయం గురించి మేమిద్దరం సోమవారం మాటల్లాదుకున్నాం , ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుండామంకున్నాం , కానీ దానికన్నా ముందు మీ నిర్ణయం నాకు అవసరం . ఆడపిల్ల తండ్రి గా సమాజం నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాలో నాకు తెలుసు, రెండు జీవితాలు . రెండు కుటుంబాలు,సుధీరగా ప్రయాణం , సమాజానికి ఏముంది అంకుల్ సందర్భానుకూలంగా మారిపోతుంది. మీ నిర్ణయం తెలిస్తే మా వాళ్ళను నేను ఒప్పిస్తాను. ఆచార ,వ్యవహారాలంతారా మనసుపడి “మన” అనుకున్నాక అవన్నీ అనుకూలంగా మారిపోతాయి. గత అయిదు సంవతసరాలుగా మా పేరెంట్స్ వెజిటేరియన్స్ గా మరి పోయారు , ఇక నేను సహజ కోసం ఆమాత్రం చేయలేనా , ఆలోచించి నిర్ణయం చెప్పండి, ఆనందం అనే బాటలో ఏడు అడుగులు వేద్దాం కుంటున్నాం

శుక్రవారం రాత్రి 7 గంటలకు,

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ డోమెస్టిక్ లాంజీ లో

సహజ ఫోన్ చేసింది జీవంకీ “ ఎక్కడున్నావు”

కింద లాంజీ లో

ఒకే నేను ఇక్కడే , రీచ్ ఇన్, టూ మినిట్స్.

ఒక్కసారి దగ్గరికి రాగానే ప్రపంచాని మరిచిపోయి కౌగిలించుకున్నారు.

అతడు ఆమె చెవిలో నెమ్మదిగా అన్నాడు “ అమ్మ చెప్పింది ఇంటికి వెళ్ళావుటకద “

నాన్న చెప్పారు “ నువు మా ఇంటికి వెళ్ళావుట కదా “

“ ఇక వాళ్ళు , వాళ్ళు మాట్లాడుకుంటారులే”ఆన్నాడు జీవన్

“ ఏమిటి మాట్లాడుకునేది , ఈ ఆదివారం కాక పై ఆదివారం మా ఇంట్లో నిశ్చితార్థం , వచ్చే నెల పెళ్లి,” అతన్ని మరింత దగ్గరికి తీసుకుంటూ ఆందో సహజ . “

“ఇక అవన్నీ అవసరమా”

“ చంపుతా స్టూపిడ్ “ అన్నీ పెళ్లి తరవాతే అతన్ని నుండి సున్నితంగా వీడి పించుకుంటూ అంది

“ జస్ట్ జోకింగ్ , లవ్యు డార్లింగ్ “ ఆమె చేయి నుక్కుతూ అన్నాడు

ఆమె కూడా నవ్వుతూ” పద మన ఫెవేరేటె డిన్నర్ స్పాట్ కి చాలా పెద్ద ,పెద్ద, నిర్ణయాలు తీసుకోవాలి.

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం