Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ప్రేక్షకుడ్ని ఉస్సూరుమనిపించిన ‘వేసవి’

audience disappionted this summer

ఈ వేసవికి వస్తాయనుకున్న ప్రతిష్టాత్మక సినిమాలు రాకపోవడంతో సినీ అభిమాని నిరాశకు లోనయ్యాడు. బాలకృష్ణ ‘లయన్‌’ సినిమాతో వేసవికి వచ్చినప్పటికీ, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’గా అల్లు అర్జున్‌ అలరించినప్పటికీ, ప్రేక్షకులు ఎదురు చూసిన సినిమాలు ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ వేసవిలో సందడి చేయలేకపోయాయి. భారీ బడ్జెట్‌ సినిమాలు, గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు తప్పనిసరైపోవడంతో అనుకున్న సమయానికి ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ విడుదల కాలేదు. గ్రాఫిక్స్‌ కంటెంట్‌, యుద్ధ విన్యాసాలు లాంటివి పిల్లల్ని అలరిస్తాయి. వేసవి సెలవుల్లో వాళ్ళే సినిమాలకు రాజపోషకులు. ఫ్యామిలీతో సహా థియేటర్లకు రావాల్సిన ఆడియన్స్‌ నిరాశ చెందడంతో తెలుగు సినిమా రంగంపై కురియాల్సిన వసూళ్ల వాన ఈ సమ్మర్‌లో సరిగ్గా కురవలేదు. ‘పండగచేస్కో’, ‘కిక్‌`2’ సినిమాలు వచ్చినా కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌కి దక్కేది. వస్తాయనుకున్న సినిమాలు రాక, వచ్చిన సినిమాలతోనే తెలుగు సినీ ఆడియన్స్‌ ఈ సమ్మర్‌ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోటల్‌గా ఈ సమ్మర్‌ చాలామంది ఆడియన్స్‌ని ఉస్సూరుమనిపించింది.

మరిన్ని సినిమా కబుర్లు
Her career crossed  ten years...