Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: 365 డేస్‌
తారాగణం: నందు, అనైకా సోటి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, సత్యకృష్ణ, సురేఖా వాణి తదితరులు
చాయాగ్రహణం: అనిత్‌ మదాది
సంగీతం: శ్రీవాస్తవ్‌
నిర్మాణం: జెడ్‌3 పిక్చర్స్‌
దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ
నిర్మాత: సుధీర్‌ చంద్ర
విడుదల తేదీ: 22 మే 2015

క్లుప్తంగా చెప్పాలంటే
అపూర్వ్‌ (నందు), శ్రేయ (అనైకా సోటి) ఇద్దరూ స్ట్రాంగ్‌ ఇండివిడ్యువల్స్‌ ప్రేమలో పడ్తారు. ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించడంతో ఆ ప్రేమ పెళ్ళికి దారి తీస్తుంది. అయితే వరుస సంఘటనలు ఆ ఇద్దరూ 365 రోజుల్లోనే విడాకులు తీసుకునేలా చేస్తుంది. ఆ సంఘటనలు ఏమిటి? అపూర్వ్‌, శ్రేయల ప్రేమ, పెళ్ళి చివరకు ఏమవుతాయి? అన్నవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
హీరో నందూ డీసెంట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. సింపుల్‌గా స్ట్రాంగ్‌గా, ఫ్రస్టేటెడ్‌ మైండ్‌ సెట్‌తో విభిన్నరకాలైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు.  నటనకన్నా గ్లామర్‌తో ఆకట్టుకుంది హీరోయిన్‌ అనైకా సోటి. నటనలో జస్ట్‌ ఓకే. పోసాని కృష్ణమురళి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ప్రేమ, పెళ్ళి, శృంగారం వంటి విషయాలపై పోసాని చెప్పిన ‘వాస్తవాలు’ హిలేరియస్‌గా అనిపిస్తాయి. కృష్ణుడు, సత్యకృష్ణ, సురేఖావాణి తదితరులు తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు. ఇలా కన్పించి అలా వెళ్ళిపోయే పాత్రల్లో అయినా మిగతా పాత్రధారులు తమ తమ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ మైండ్‌లో రిజిస్టర్‌ అవుతారు.

కథ మరీ కొత్తది కాకపోయినా దర్శకుడు తనదైన వ్యూతో సినిమాని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకి బలాన్నిచ్చింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన డీసెంట్‌ లుక్‌ని ఇచ్చాయి. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువల పరంగానూ బాగుంది.

ఇంట్రెస్టింగ్‌ స్టోరీ లైన్‌తో సినిమాని దర్శకుడు డీల్‌ చేసిన విధానానికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఆఫ్‌ బీట్‌ ఫిలిం అనే ప్రచారం జరిగినా, వర్మ మార్క్‌ ట్రీట్‌మెంట్‌తో సినిమా సాగుతుంది. రొమాన్స్‌, ఎమోషన్‌, యూత్‌ఫుల్‌నెస్‌ అన్నీ కలగలిసి యూత్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. లవర్స్‌ని ఆకట్టుకునేలా ఉండటంతోపాటు, మ్యారీడ్‌ కపుల్‌ తమను తాము తెరపై పాత్రలతో పోల్చుకుంటారంటే దర్శకుడు సినిమాని అంత టచ్చింగ్‌గా రూపొందించాడనే కదా అర్థం. హింస, రక్తపాతం వంటివాటికి తావు లేకుండా వర్మ నుంచి చాలాకాలం తర్వాత వచ్చిన సినిమా ఇది. టార్గెట్‌ ఆడియన్స్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుందీ సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే
యూత్‌ కనెక్టవుతారు.. కపుల్‌ అనుభూతి చెందుతారు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview