Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

‘దిల్‌’ రాజు ‘దిల్‌’లో మాట

dil raju heart feelings

ప్రముఖ సినీ నిర్మాత ‘దిల్’ రాజు పట్టిందల్లా బంగారమేనంటారు సినీ పరిశ్రమలో. పక్కా ప్లానింగ్తో సినిమాలు నిర్మించడం ‘దిల్’ రాజు స్పెషాలిటీ. కొత్త దర్శకులతో హిట్ సినిమాలు రూపొందించే ‘దిల్’ రాజుని డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అని కూడా అంటారు. రేర్ కాంబినేషన్స్ సెట్ చేయాలన్నా అది ‘దిల్’ రాజుకు మాత్రమే సాధ్యమనే అభిప్రాయం వుంది సినీ పరిశ్రమలో.

సక్సెస్ రేట్ పరంగా చూసుకున్నా ‘దిల్’ రాజు మిగతా నిర్మాతలకన్నా చాలా ఎత్తులో వుంటారు. దటీజ్ ‘దిల్’ రాజు. అసలు ఈ సక్సెస్ ఫుల్ కెరీర్ ఎలా సాధ్యమని ‘దిల్’ రాజుని ప్రశ్నిస్తే, స్క్రిప్ట్ని నమ్ముతాను, ఆ స్క్రిప్ట్ని ఫైనలైజ్ చేసే విషయంలో జాగ్రత్త పడ్తానంటారాయన.

స్క్రిప్ట్ మీద గ్రిప్ వుండడం వల్ల ఆ స్క్రిప్ట్ సినిమాగా మారితే అదెంత సక్సెస్ అవుతుందో ముందే అంచనా వేస్తానని, తద్వారా సక్సెస్లు సొంతం చేసుకుంటున్నానని దిల్ రాజు చెప్పారు. స్క్రిప్ట్ మీద దర్శకుడికి గ్రిప్ వుండాలనీ, అది మంచి స్క్రిప్ట్ అయినప్పుడు నిర్మాతకి కాన్ఫిడెన్స్ వుండాలనీ ఆ రెండూ లేనప్పుడు సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారాయన.

మరిన్ని సినిమా కబుర్లు
bahubali beards