Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
at that time she is sweet sixteen

ఈ సంచికలో >> సినిమా >>

స్వామి గుడికి ‘స్వామి రారా’ హీరో

Nikhil visits chilkuri balaji temple

హైద్రాబాద్ శివార్లలో వుండే చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తెలియనివారుండరు. రాష్ట్రమంతటా ఇప్పుడు చిలుకూరు బాలాజీ పేరు మార్మోగిపోతోంది. అది చిలుకూరు బాలాజీ మహిమ. ఈయన్ని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఏదన్నా కోరిక కోరుకుని, కొన్ని ప్రదక్షిణలు ఆ గుడి చుట్టూ చేస్తే ఆ కోరికలు నెరవేరతాయనీ, కోరికలు నెరవేరాక, ముందు మొక్కుకున్నట్లుగా 108 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు.

భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగానే వారి కోరికలు నెరవేరుతాయి. అలా సినీ హీరో నిఖిల్ కూడా ఓ కోరిక కోరుకున్నాడు చిలుకూరు బాలాజీకి. ఆ కోరిక నెరవేరి, 108 ప్రదక్షిణలు పూర్తి చేశాడు ఇటీవలే. ‘స్వామిరారా’ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడు కదా. ఆ హిట్ కోసమే బహుశా అతను చిలుకూరు బాలాజీకి మొక్కుకుని వుంటాడు, సినిమా హిట్టయ్యాక మొక్కు తీర్చుకున్నాడని అంటున్నారు.

ఇదే నిజమా? లేదంటే, నిఖిల్ మదిలో ఇంకేమైనా కోరిక వుందా? ఆ కోరిక నెరవేరిపోవడం వల్ల మొక్కు చెల్లించుకున్నాడా? సస్పెన్స్ పోవాలంటే నిఖిల్ అసలు విషయం బయట పెట్టాలి. ఏదేమైనా ‘స్వామిరారా’ సినిమా హీరో వెంకటేశ్వర ‘స్వామి’ గుడికి వచ్చాడన్న వార్త సినీ వర్గాల్లో మార్మోగుతోంది.

మరిన్ని సినిమా కబుర్లు
movie industry not going to seemandhra