Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie industry not going to seemandhra

ఈ సంచికలో >> సినిమా >>

నీలకంఠ సీమ భోజనం

seema food launched by neelakanta

తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ విన్నా ‘ఉలవచారు’ గురించిన చర్చే జరుగుతోంది. హైద్రాబాద్లో జూబ్లీహిల్స్తో ఎటాచ్మెంట్ వున్న మామూలు వ్యక్తులు కూడా ‘ఒరేయ్.. ఉలవచారుకి వెళ్దామా..’ అని అనుకుని, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదీ కూచిపూడి వెంకట్ ‘ఉలవచారు’ రెస్టారెంట్ ఎంత ఫేమస్ అయ్యిందనడానికి నిదర్శనం.

కొత్తగా ఈ రెస్టారెంట్లో ‘సీమ భోజనం’ అనే కొత్త ఐటమ్ పెట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్లున్నాయి. ఆ పేరు కాకుండా, చాలా రెస్టారెంట్లు రాయలసీమ ఐటమ్స్ని వండి వడ్డిస్తున్నాయి భోజన ప్రియుల కోసం. అయితే ఉలవచారు స్టయిలే వేరు. ‘సీమ భోజనం’ అనేది పూర్తిగా ఓ ఐటమ్. ఆ సంగతేంటో తెలియాలంటే మాత్రం ఉలవచారుకి వెళ్ళాల్సిందే.

అయితే ఉలవచారులోని ‘సీమ భోజనం’ ఐటమ్ని సినీ దర్శకుడు నీలకంఠ లాంఛ్ చేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, నీలకంఠ రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ సీమ భోజనం కూడా చాలా పాపులర్ అయిపోయింది. భోజన ప్రియులు, వెరైటీ టేస్ట్ని ఆస్వాదించాలనుకున్నవారూ ఉలవచారుకి క్యూ కడ్తున్నారు, ప్రత్యేకంగా సీమ భోజనం ఆరగిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam