Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mega Intresting Fight on February 9

ఈ సంచికలో >> సినిమా >>

రంగస్థలం - చరణ్‌ సౌండ్‌ అదిరింది

Charan Sound

'రంగస్థలం' సినిమాలో హీరో రామ్‌చరణ్‌ ఓ వైకల్యంతో ఉన్నట్లుగా కనిపిస్తాడట అన్న గాసిప్స్‌ ఎట్టకేలకు నిజమయ్యాయి. ఆ వైకల్యం ఇంకేమీ కాదు, చెవిటితనం అని గతంలోనే గాసిప్స్‌ వచ్చాయి. ఔను అది నిజమే. 'రంగస్థలం' సినిమాలో రామ్‌చరణ్‌ సరిగ్గా చెవులు విన్పించని యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. పేరు చిట్టిబాబు. ఈ చిట్టిబాబు ఏం చేస్తాడో తెలుసా? ఇంజనీర్‌. అదేనండీ సౌండ్‌ ఇంజనీర్‌. మామూలుగా మనం ఏదన్నా మాట చెప్పేటప్పుడు అవతలి వ్యక్తికి సరిగ్గా విన్పించకపోతే, 'ఏరా సౌండ్‌ ఇంజనీర్‌వా?' అని ప్రశ్నిస్తాం కదా! పల్లెటూళ్లలో ఈ సౌండ్‌ మరీ ఎక్కువగా వింటుంటాం. అదే డైలాగ్‌ని 'రంగస్థలం' సినిమాలో రామ్‌ చరణ్‌ నోట పలికించి, టీజర్‌కి హైలైట్‌ చేశారు. తాజాగా విడుదలైన 'రంగస్థలం' టీజర్‌ ఇప్పుడు అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. వైకల్యం ఉన్న వ్యక్తే, తనను అంతా సౌండ్‌ ఇంజనీర్‌ అంటారని స్వయంగా చెప్పడం ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌. ఆ డైలాగ్‌ చరణ్‌ చెప్పడంలో ఇచ్చిన 'కటింగ్‌' అదిరిపోయింది. రంగస్థలం అనే ఊళ్లో మోటారు పంపుల్ని బాగు చేయడం చిట్టిబాబు వృత్తి. అందుకే, మా ఊళ్ళో నేనే ఇంజనీర్‌ని అంటున్నాడు మన చిట్టిబాబు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ 'రంగస్థలం' టీజర్‌ ఓ డిఫరెంట్‌ మోడల్‌లో సాగింది.

ఆ కలర్‌, ఆ బ్యాక్‌డ్రాప్‌ అంతా సూపర్బ్‌గా డిజైన్‌ చేశారు. పల్లెటూరి వాతావరణం స్పష్టంగా కన్పిస్తోంది. సినిమాలో మాస్‌ మెచ్చే ఎలిమెంట్స్‌ చాలానే ఉన్నాయని టీజర్‌తో చెప్పకనే చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్‌చరణ్‌ సరసన సమంత నటిస్తోంది. తొలిసారి ఈ జంటని స్క్రీన్‌పై చూడబోతున్నాం 'రంగస్థలం' సినిమాలో. రొటీన్‌కి భిన్నంగా రామ్‌చరణ్‌, 1985 నాటి కాలంలోకి వెళ్ళిపోయి, ప్రేక్షకుల్ని కూడా అమాంతం ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడట ఈ సినిమాతో. సినిమాలో ఎక్కువ భాగం గళ్ల లుంగీతోనే కనిపిస్తాడట చరణ్‌. అయితేనేం, మాస్‌ ఆడియన్స్‌కి కావాల్సింది అదే కదా. మొత్తానికి కెవ్వు కేక పుట్టించేలానే ఉన్నాడు 'రంగస్థలం' సినిమాతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam