Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

భరత్‌ 'మహర్షి'గా మారిపోయాడు.!

Bharat becomes 'Maharishi'!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రానికి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. గత కొంత కాలంగా అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. 'రిషి' అనే ప్రచారం నిజమైంది. ఈ నెల 9న మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 'మహర్షి' అనే టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్‌ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించబోతున్నాడన్న ప్రచారం కూడా నిజమే. టీజర్‌లో అదే చూపించారు. అయితే సాఫ్ట్‌గా కనిపించే స్టూడెంట్‌ కాదండోయ్‌. చాలా రగ్గ్‌డ్‌ అండ్‌ రఫ్‌ లుక్‌ స్టూడెంట్‌ అన్నమాట.

కొంటె పిల్టాడు కూడా. అమ్మాయిలు కనిపిస్తే, వన్స్‌మోర్‌ అని వెనక్కి తిరిగి చూస్తాడు. నార్మల్‌ చెక్స్‌ షర్టు, జీన్స్‌లో గెడ్డంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు మహేష్‌ ఈ సినిమాలో. కాలర్‌ పైకెత్తి, చేతిలో ల్యాప్‌ ట్యాప్‌ పట్టుకుని అలా నడిచొస్తున్న మహేష్‌ కటౌట్‌కి అభిమానులు, ముఖ్యంగా అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ టీజర్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. 'భరత్‌ అనే నేను' చిత్రంలో మంచి విజయం అందుకున్న మహేష్‌ బాబుకి 25వ చిత్రంగా రూపొందుతోన్న 'మహర్షి' సినిమాపై భారీ అంచనాలున్నాయి. అల్లరి నరేష్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
Big boss is nani