కంగనారనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'మణికర్ణిక'. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. బ్రిటీష్ జెండాను చీలుస్తూ లక్ష్మీభాయ్ ఎంట్రీ అదిరిపోయింది. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ ఘట్టాలు అద్భుతహ అనిపిస్తున్నాయి. రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా అచ్చు గుద్దినట్లుగా సరిపోయింది. ఇంతవరకూ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా మాత్రమే చదువుకున్న లక్ష్మీభాయ్ జీవిత చరిత్రను తొలిసారిగా ఈ సినిమాతో తెరపై చూసే అవకాశం కలుగుతోంది.
దేశం కోసం బ్రిటీష్ వారితో కదనరంగంలో వీరోచితంగా కత్తి దూసిన మహిళ రాణీ లక్ష్మీభాయ్. తన రాజ్యంలోని మహిళలకు యుద్దవిద్యలో శిక్షణ ఇస్తున్న సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. క్రిష్ మరో సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా చివరి భాగాన్ని కంగనానే షూట్ చేసినట్లు సమాచారమ్. 'క్వీన్'గా బాలీవుడ్‌ని ఏలుతున్న కంగనా రనౌత్‌కి 'మణికర్ణిక' మరో మంచి బ్రేక్ అవుతుందని చెప్పడం నిస్సందేహం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|