Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
TV Anchor Suma and Shilpa

ఈ సంచికలో >> సినిమా >>

‘ఆగడు’తో సంపూర్ణం

Tamanna in Aagadu Movie

కెరీర్ బిగినింగ్ లో వరుస ఫ్లాపులిచ్చినా, తమన్నా అంటే గోల్డెన్ లెగ్ అయిపోయింది అనూహ్యంగా. హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం , 100%లవ్ , రచ్చ ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తమన్నా ఓ వెలుగు వెలిగింది. కొన్ని ఫ్లాపులు రావడంతో ఇప్పుడామె కెరీర్ కాస్త స్లో అయ్యింది.

నాగచైతన్య, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ .. ఇలా యంగ్ జనరేషన్ లో హీరోలందరితోనూ తమన్నా నటించేసింది. ఒక్క మహేష్ బాబుతోనే బ్యాలెన్స్ ఇప్పటిదాకా ఆమెకి. ఆ లోటు కూడా తీరిపోయింది. మహేష్ సరసన తమన్నా ఆగడు సినిమాలో నటిస్తోందనగానే, ఆమె కెరీర్ తెలుగులో మళ్ళీ వెలిగిపోవడం ఖాయమంటున్నారు.

నటనతోనూ, గ్లామర్ తోనూ ప్రత్యేకంగా చెప్పాలంటే డాన్సులతో తమన్నా తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైంది. హిందీలో హిమ్మత్ వాలా సినిమా చేసిన తమన్నా, అక్కడ మరో రెండు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తమిళంలోనూ తమన్నా బిజీగానే వుంది. మహేష్ తో తమన్నా చేస్తున్న సినిమా కారణంగా ఆమె టాలీవుడ్ లో ప్రముఖ హీరోలందరితోనూ నటించినట్లేనని అంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
ladies and gentlemen shooting started