Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

హుషారు చిత్రసమీక్ష

husharu movie review

చిత్రం: హుషారు 
తారాగణం: రాహుల్‌ రామకృష్ణ, తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, దినేష& తేజ్‌, అభినవ్‌ మేడిశెట్టి, దక్ష నగర్‌కర్‌, ప్రియా వడ్లమాని, హేమల్‌ తదితరులు. 
సంగీతం: రథన్‌ 
సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట 
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్‌, రియాజ్‌ 
దర్శకత్వం: శ్రీహర్ష కోనుగంటి 
నిర్మాణం: లక్కీ మీడియా 
విడుదల తేదీ: 14 డిసెంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే.. 
చిన్ననాటి స్నేహితులైన ఆర్య (తేజస్‌ కంచర్ల), చై (అభినవ్‌), బంటి (తేజ్‌ కూరపాటి), ధృవ్‌ (దినేష్‌ తేజ్‌), పెద్దయ్యాక కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే సరదా కురాళ్ళు వీళ్ళు. ఆర్యకి గీత (దక్ష నగార్కర్‌), చై - ప్రియా (ప్రియా వడ్లమాని)తో ప్రేమలో వుంటారు. మిగిలిన ఇద్దరూ తమ తోడు వెతుక్కునే పనిలో వుంటారు. అయితే చై ప్రేమ విఫలమవుతుంది. ఓ ప్రమాదంలో అతనికి గాయలవుతాయి. ఆ సమయంలోనే అతనికి క్యాన్సర్‌ వుందని తెలుస్తుంది. క్యాన్సర్‌ చికిత్స కోసం 30 లక్షలు ఖర్చవుతుందని తెలిసి, మిగిలిన స్నేహితులు ఏం చేశారు.? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే.. 
నలుగురికీ నటన పరంగా మంచి మార్కులే పడతాయి. తేజస్‌, తేజ్‌, దినేష్‌, అభినవ్‌ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి. నటిస్తున్నట్లు కాకుండా, తెరపై జీవిస్తున్నట్లే అన్పిస్తుంది. రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సెకెండాఫ్‌లో రాహుల్‌ రామకృష్ణకి ప్రాధాన్యత ఎక్కువ లభించింది. ఆయన పాత్రే కీలకం.

హీరోయిన్లు అందంగా కన్పించారు. నటన పరంగా ఓకే అన్పిస్తారు. చిన్న సినిమానే అయినా, టెక్నికల్‌గా అన్ని హంగులూ వున్నట్లే. సినిమాటోగ్రఫీ, రథన్‌ మ్యూజిక్‌ బావున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. సన్నివేశాల్ని ఆసక్తికరంగానే తీర్చిదిద్దినప్పటికీ కథ విషయంలో తడబడ్డారు. కథనం ఓకే. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. హద్దులు మీరిన కొన్ని సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా లేవు.

తెరపై నలుగురు కుర్రాళ్ళు, వారు చేసే అల్లరి.. ఇవన్నీ నేటి తరం యువత తమను తాము తెరపై చూసుకున్నట్లుంటాయి. టార్గెట్‌ ఆడియన్స్‌ యువత గనుక, వారికి నచ్చేలానే సన్నివేశాలు, కథ, కథనం వుంటాయి. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కుర్రాళ్ళు చేసే సందడి కన్పిస్తాయి. సెకెండాఫ్‌లో కుర్రాళ్ళకు ఓ బాధ్యత ఏర్పడి, కష్టపడటం మామూలుగా చాలా సినిమాల్లో చూసేసిందే. స్నేహితుడి కోసం కుర్రాళ్ళు పడే కష్టం ఓకే అన్పిస్తుందిగానీ, ఆ ప్రయత్నం కొంత సాగతీతగా, అసహజంగా అన్పిస్తుంది. అయితే ఆద్యంతం ఫన్‌ జనరేట్‌ చేయడంలో సఫలమయిన దర్శకుడు సినిమాని సాఫీగానే నడిపించేందుకు ప్రయత్నించాడు.

ఓవరాల్‌గా సినిమా టార్గెట్‌ ఆడియన్స్‌ని కొంతమేర మెప్పించొచ్చు. అయితే, ఫస్టాఫ్‌లో కొనసాగిన వేగం, సెకెండాఫ్‌లో కన్పించదు. అక్కడక్కడా కథ గందరగోళానికి గురవుతుంది. యూత్‌ని మెప్పించే క్రమంలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఎక్కువైపోవడం మైనస్‌ పాయింట్‌. ఫ్యామిలీ ఆడియన్స్‌ గురించి అస్సలేమాత్రం ఆలోచించని దర్శకుడు, యూత్‌ని సైతం పూర్తిగా మెప్పించలేకపోయాడు. ఓ మోస్తరు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమైతే ఓకే అన్పిస్తుంది.

అంకెల్లో చెప్పాలంటే..
2.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే
ఓ మోస్తరు హుషారు మాత్రమే.

మరిన్ని సినిమా కబుర్లు
sankranti son in law's