5 వ జ్యోతిర్లింగ ప్రదేశం వైద్యనాధ్ ధాం - ​లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

vaidyanath dham

దేవుని ఇల్లుగా ( దేవ్ ఘర్ ) పిలువబడే 5 వ జ్యోతిర్లింగ ప్రదేశం  వైద్యనాధ్ ధాం – జార్ఖండ్ ::

జార్ఖండ్ రాష్ట్రం లోని భాగల్పూర్ జిల్లాలో ఈ దేవ్ ఘర్ కలదు . జ్యోతిర్లింగాలలో ఇది 5 వది. ఈ వైద్యనాధ్ జ్యోతిర్లింగం గురించి పలురకాలైన కథనాలు ప్రచారం లో వున్నాయి. రావణాసురుడు తన రాజ్యాన్ని సుభిక్షంగా సురక్షితంగా వుండాలంటే లయకారుడైన పరమ శివుడు తన రాజ్యం లో ఉండాలనే తలంపుతో శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు . ఆ తపస్సు కి శివుడు మెచ్చి ఒక శివలింగాన్ని రావణాసురుడుకి ఇస్తాడు ,, కానీ ఈ లింగాన్ని ఎక్కడా పెట్టకుండా లంకా రాజ్యానికి తీసుకుని వెళ్లాలని ఒక షరతు విధిస్తాడు  రావణాసురుడికి .  కానీ ఈ లింగాన్ని రావణాసురుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడం దేవతలకు ఇష్టం వుండదు. అలా రావణాసురుడు శివ లింగాన్ని తన రాజ్యానికి తీసుకుని వెళితే అహంకారం ఎక్కువై ఇంకా ఎన్నో దురాగతాలకు పాల్పడతాడని యోచించి వెంటనే వారు శ్రీ మహా విష్ణువుని ప్రార్ధిస్తారు . విష్ణుమూర్తి వరుణదేవుడి సహకారంతో రావణాసురుడికి సంధ్య వేళ కాలకృత్యాలు వచ్చేలా  చేస్తారు ..

అప్పుడు శివలింగాన్ని క్రింద పెట్టకుండా ఎలా తన కార్య క్రమం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక బ్రాహ్మణ బాలుని వేషం లో వినాయకుడు కనిపిస్తాడు. అప్పుడు రావణాసురుడు తన చేతిలోని లింగాన్నిఆ బాలుని రూపం లో వున్న వినాయకునికి ఇచ్చి  కొద్ది సమయం కింద పెట్టకుండా చూడమని చెప్తాడు .. కానీ ఆ బాలుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు .అప్పుడు ఆ శివలింగం అక్కడ శాస్వతంగా పాతుకు పోతుంది . రావణాసురుడు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి చూసి  దుఖిస్తూ ఆ లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు,, కానీ అది వెలికి రాదు .. శివుడిని లింగ రూపం లో తన రాజ్యం లో స్తాపించుకోవాలనే తన స్వార్ధపూరితమైన ఆలోచనకు తానె సిగ్గుపడి తిరిగి లంకా రాజ్యానికి వెల్లి పోతాడు .కానీ ప్రతీ రోజూ వచ్చి ఈ దేవఘర్ లోని లింగాన్ని పూజించి వెళ్తూ వుండే వాడని పురాణ కథితం. దేవతల ప్రోద్భలంతో శివుడు ఈ ప్రాంతం లో నిలచిపోయాడని ఈ ప్రదేశానికి దేవ్ ఘర్ అని పేరు వచ్చింది.

భవిష్య పురాణం లో ఈ జ్యోతిర్లింగం గురించి విపులంగా చెప్పడం జరిగింది. కాలక్రమంలో ఈ లింగం కనపడకపోవడం జరిగింది .. ఇలా పోయిన లింగాన్ని వైద్యు అనే బ్రాహ్మణుడు కనుగొనగా దీనికి వైద్యనాధ్ అనే పేరు వచ్చింది అని కుడా ఒక కధనం కలదు . దేవ్ ఘర్ లో అష్టా దశ శక్తి పీఠం కూడా కలదు. సతీ దేవు యొక్క హృదయ భాగం పడిన చోటు ఇది. అందుకే ఈ ప్రాంతాన్ని హార్ద్ర పీఠం అని కుడా అంటారు . ఇక్కడ అమ్మవారిని హృదయేశ్వరి , జయ దుర్గ అని 2 పేర్లతో పిలుస్తారు. దీనికి సమీపంలో నవ లఖ్ దేవాలయం వుంటుంది. ఈ దేవ్ ఘర్ వైద్యనాధ్ జ్యోతిర్లిన్గానికి శ్రావణ మాసం లో 30 రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయి . భక్తులు పవిత్ర జలాలతో శివ లింగానికి అభిషేకం చేస్తారు . ఈ దేవాలయానికి పడమర దిక్కున ద్వారికాస్వరి నది కలదు. దేవ్ ఘర్ కి చుట్టూ పక్కల దట్టమైన అరణ్యాలు కలవు. ఈ అరణ్యాలలో సఖోటా , అర్జున , సాల్ అనే వృక్షాలు అధికంగా వుంటాయి. ఈ అర్జున వృక్షాల నార నుండీ భాగల్ పూర్ సిల్క్ వస్త్రాలు నేస్తారు .

ఈ ఆలయ ప్రాంగణం లో మొత్తం 22 దేవాలయాలు కలవు. 72 అడుగుల ఎత్తులో కమలాకరం లో ప్రధాన ఆలయం వుంటుంది. ఈ దేవాలయాని విశ్వ కర్మ నిర్మించాడని పురాణ కథనం. వైద్యనాధ్ జ్యోతిర్లింగా ఉపరితలం పగిలి గరుకుగా వుంటుంది. గిద్ధౌర్  రాజు మహా రాజా పురాన్ సింగ్ ఈ ప్రధాన ఆలయానికి ౩ గోపురాలకు బంగారు తాపడం పెట్టించాడు. ఈ ఆలయ ప్రాంగణం లో పార్వతి , కాళీ , జగత్ జనని  ,కాల భైరవ మరియు లక్ష్మి నారాయణ ఆలయాలు ముఖ్యమైనవి . 

ఇచట మరో ముఖ్య విశేషం ,, పార్వతి దేవి ఆలయం ప్రధాన వైద్యనాథ్ జ్యోతిర్లిన్గాలయం తో ఎర్రటి దారాలతో బంధించబడి ఉంటుది. దీని అర్ధం ఏమనగా శివ మరియు శక్తి మాట సమైక్యతను ,, అర్ధనారీస్వరత్వాన్ని సూచిస్తుంది. సమీపం లో మత్స్య పురం లో శక్తి నివాసముంటుందని, ఈ శక్తి మాట భక్తుల యొక్క సుదీర్ఘమైన వ్యాధులను నివారించడం లో శివునికి సహాయం చేస్తుందని భక్తుల నమ్మకం .  దేవ్ ఘర్  గిద్ధౌర్ రాజుల ఆధీనం లో  వుండేది .

ఈ ఆలయం ఉదయం 4 గంటలకు తెరుస్తారు . 4 గంటల నుండీ 5.30  వరకు ఆలయ ప్రధాన అర్చకులు పవిత్ర జలాలతో స్వామికి అభిషేకం చేసి షోడశోపచార పూజలు చేస్తారు , తదనంతరం భక్తులు స్వామి దర్సనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం మూసి వేసి తిరిగి సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు .. రాత్రి 9 గంటలకు మూసివేస్తారు . శ్రావణ మాసం లో 6,7 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించు కుంటారు . శ్రావణ మాసం లో భక్తులు భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్ గంజ్ ప్రాంతం లో గల గంగా నది నుండీ పవిత్ర గంగా జలాన్ని కావడిల్లో నడుచుకుంటూ (  సుమారు 108 కిలోమీటర్లు ) తెచ్చి శివునికి అభిషేకం చేస్తారు. సుల్తాన్ గంజ్ నుండీ దేవ్ ఘర్ చేరే వరకూ భక్తులు కావడి మోస్తూ ఆగకుండా వస్తారు. అది వారి అపార నమ్మకం .. 

లోకాసమస్తా సుఖినోభవంతు

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు