కూర్చుంటే కరిగిపోతుంది.. జాగ్రత్త సుమీ.! - ..

carefull

కరిగిపోయేది ఏ ఆస్థి పాస్తులో కాదండోయ్‌. అవునులెండి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఆస్థి పాస్తుల విషయంలోనే ఉదాహరణగా చెప్పుకుంటారు కదా.! కానీ, ఇక్కడ మనం చెప్పుకునేది 'ఆరోగ్యం' గురించి. అవునండీ మీరు విన్నది నిజమే. కూర్చొని ఉంటే కరిగిపోతుంది ఆరోగ్యం. అదేంటంటారా.? అయితే మీకు అసలు మ్యాటర్‌ చెప్పాల్సిందే. నిలుచొని ఉన్నప్పుడు మన వెన్నెముక 'ఎస్‌' ఆకారంలో ఉంటుంది. అదే కూర్చున్నప్పుడు 'సి' ఆకారంలో వంగిపోతుంది. ఇలా వంగడం వల్ల వెన్నుపూసల మధ్య రబ్బరులా ఉండే ధృఢమైన కండరాలపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. తద్వారా వెన్నుముక దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఏ చీకూ చింతా లేకుండా మనిషి మనుగడ సాగించాలంటే వెన్నుముక ఎంత అవసరమో తెలిసిన సంగతే.

ఇక వెన్నుముకే కాదు, కూర్చొని ఉండడం వల్ల పొట్ట కండరాలు, ఊపిరితిత్తుల మధ్య కూడా తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశముంది. అంతేకాదు, తుంటి, మోకాలి వెనక భాగంలోని కీళ్లు బిగుసుకుపోయి, కీళ్ల కదలికలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదముంది. ఎక్కువగా కదలకుండా కూర్చొని ఉండడం వల్ల రక్త ప్రసరణ జరగక కాళ్ల భాగంలోని సిరలు ఉబ్బి, రక్తం గడ్డలు కట్టే అవకాశముంది. అలా గడ్డ కట్టిన రక్త కణాలు ఊపిరితిత్తులను చేరితే, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తప్పదు. అంతేకాదు, లోపలి అవయవాలు కూడా దెబ్బ తినే అవకాశముంది. అలాగే జీర్ణక్రియ స్థితిగతుల్లోనూ ఇబ్బందులు ఏర్పడతాయి.

అందుకే కూర్చొని పని చేసే వాళ్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవల్సిన అంశాలివి. ఎక్కువగా కూర్చొని పని చేసే వాళ్లు కనీసం గంటకోసారి అయినా కూర్చున్న కుర్చీలోంచి లేచి నాలుగు అడుగులు అటూ ఇటూ తిరగాలి. ప్రతీరోజూ యోగా, వ్యాయామం వంటి చిన్న చిన్న వర్కవుట్లు చేయాల్సిన అవసరం ఉంది. వాటర్‌ ఎక్కువగా తాగడం వల్ల యూరినల్‌ బ్లాడర్‌ నిండి, మూత్ర విసర్జన కోసం కాళ్లు కదిపే అవకాశముంటుంది. మూత్ర విసర్జన జరిగితే, కాళ్ల భాగంలోని కీళ్లతో పాటు, శరీర అవయవాలన్నింట్లోనూ కదలికలు ఏర్పడతాయి. దాంతో, కీళ్లు బిగుసుకుపోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. అలాగే డైట్‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతత్రా ఐటీ రంగాల్లో పని చేసేవారు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాఠించాల్సి ఉంటుంది. సో తస్మాత్‌ జాగ్రత్త. కూర్చొని తిని ఆరోగ్యం కరిగించుకోవద్దు.

మరిన్ని వ్యాసాలు

prayer(children story)
మొక్కు (చిన్నపిల్లల కథ)
- డి వి డి ప్రసాద్
forbes indians list 2019
2019 సంపన్నులు
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
wide meditation center shantivanam
సువిశాల ధ్యాన కేంద్రం శాంతివనం
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
Dangerous Tic-Tac Challenge
ప్రమాదకర ఛాలెంజ్
- లాస్య రామకృష్ణ
suitable bride children story
తగిన వరుడు (చిన్నపిల్లల కథ)
- పద్మావతి దివాకర్ల