సువిశాల ధ్యాన కేంద్రం శాంతివనం - గోతెలుగు ఫీచర్స్ డెస్క్

wide meditation center shantivanam

పనిఒత్తిడి....ఆర్ధిక బాధలు...ఆరోగ్యసమస్యలు...వీటినుంచి తప్పించుకున్న మానవులుండరు....ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇందులో ఏదో ఒకటి, లేదా దాదాపు అన్నీ వెంటాడి వేధిస్తూనే ఉంటాయి...వీటితో పోరాడుతూనే విజయ శిఖరాలకు చేరుకోవడమే జీవితం...

అన్నిటికీ డబ్బే పరిష్కారం కాదు, అలాగే ప్రతి రోగానికీ మందు ఉండదు. ఒత్తిడికి మానసికోల్లాసం పొందడం తప్ప మరో మార్గం లేదు.. దాదాపు అన్నిటికీ పరిష్కారం చూపించే మార్గం...ప్రపంచానికి మన భారతదేశం సగర్వంగా పరిచయం చేసిన ఉత్తమ మార్గం ధ్యానం....వైద్యశాస్త్రంలో మందులు లేని అనేక వ్యాధులకు ధ్యానం ద్వారా చికిత్స లభిస్తుంది...అలాగే ధ్యానంతో లభించే ఉల్లాసంతో మానసిక శక్తి రెట్టిస్తుంది, తద్వారా సమస్యలతో పోరాడే శక్తి, జయించే ధైర్యం వస్తుంది..

ధ్యానం ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి?? మనసును ప్రశాంతత వైపు ఎలా కేంద్రీకరించాలనేది చక్కటి గురువుల వల్లనే బోధపడుతుంది..ధ్యానానికి మంచి గురువు, చక్కటి పరిసరాలు కూడా ఎంతో ముఖ్యం..ధ్యానమందిరంలోకి ప్రవేశిస్తూనే మనసులోని బాధలన్నీ మాయమై, ప్రశాంతత చేకూరే అద్భుతమైన ధ్యానకేంద్రం....కన్ హా శాంతివనం......ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం..హైదరాబాదుకు దగ్గరలోని కొత్తొర్ లో నిర్మితమైన శాంతివనంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి...లక్షమందికి పైగా ఒకేసారి ధ్యానం చేసుకునే విధంగా నిర్మితమైన ఈ ధ్యానకేంద్రం..350 ఎకరాల సుదీర్ఘమైన విస్తీర్ణంలో, 50వేల చెట్ల మధ్యలో నెలకొల్పారు ఈ శాంతివనం. ధ్యానం, మానసిక ఉల్లాసం, ప్రశాంతత కోసం శ్రీరామచంద్ర మిషన్ వారు ఏర్పాటు చేసారు.

1945 లో స్థాపించబడిన శ్రీరామచంద్ర మిషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని నిర్మించారు.

2017లో మొదలైన ఈ ధ్యాన కేంద్రం నిర్మాణం 2020లో పూర్తయింది. ఒకపెద్ద ధ్యాన కేంద్రం దాని చుట్టూ 8 ఉపకేంద్రాలను ఏర్పాటు చేసారు. ఫిబ్రవరి 2, 2020 న రాష్త్ట్రపతి రాం నాథ్ కోవింద్ గారిచేత ప్రారంభించబడింది. ఇక్కడ ధ్యానం శిక్షణ ఇక్కడ పూర్తిగా ఉచితం. లక్షమందికి సరిపడా వంటశాల కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ ఉచితనివాసం, భోజనవసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నారు. ఒకసారి ఉపయోగించిన నీరును శుద్ధి చేసి మొక్కలకు వినియోగిస్తున్నారు. శాంతి మరియు మానసికోల్లాసం ఈ ధ్యానకేంద్రం ముఖ్య ఉద్దేశం. రకరకాల ఒత్తిడులతో సతమతమయ్యేవారు ప్రతిరోజూ వెళ్ళడం సాధ్యం కాకపోయినా, వారినికొక్కరోజు, లేదా నెలకొకసారైనా ఈ ధ్యానకేంద్రాన్న్ని సందర్శించగలిగితే మంచిదే....

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు