Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

జక్కన్న 'బాహుబలి' రెండు కాదు, మూడు?

bahubali 2+1


జక్కన్న రాజమౌళి 'బాహుబలి' రెండో పార్ట్‌ కోసం లొకేషన్ల అన్వేషణలో ఉన్నాడు. లొకేషన్లు దాదాపు ఖాయమయ్యాయట. షూటింగ్‌ త్వరలోనే మొదలు పెట్టనున్నాడు. 'బాహుబలి' బిగినింగ్‌ జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో రెండో పార్ట్‌ విషయంలో అస్సలేమాత్రం రాజీపడకూడదనుకుంటున్న రాజమౌళి మదిలో, మూడో పార్ట్‌ కూడా మెదిలినట్లు సమాచారమ్‌. దానికి తగ్గట్టుగానే రెండో పార్ట్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నాడట. మొదటి పార్ట్‌ కోసమే చాలా టైమ్‌ తీసుకున్న రాజమౌళి, రెండో పార్ట్‌ కోసం ఇంకెంత టైమ్‌ తీసుకుంటాడో, మూడో పార్ట్‌ కూడా ఉంటే దానికెంత టైమ్‌ తీసుకుంటాడోనని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

ప్రధానంగా ప్రభాస్‌ 'బాహుబలి' కోసం కెరీర్‌ని పణంగా పెట్టేశాడు. ఇంకో సినిమా ఏదీ చేయడానికి వీల్లేకుండా అయిపోయింది ప్రభాస్‌కి. అయినప్పటికీ పది సినిమాలతో వచ్చే పేరు ఒక్క సినిమాతో వస్తే ఏ హీరో అయినా కాదంటాడా? అంత పెద్ద సక్సెస్‌ ప్రభాస్‌కి 'బాహుబలి' బిగినింగ్‌తో వచ్చినందున, రాజమౌళి 'బాహుబలి'ని ఎన్ని పార్టుల్లో తీసినా ప్రభాస్‌ అభ్యంతరం చెప్పడు. గో ఎహెడ్‌ రాజమౌళీ. 

మరిన్ని సినిమా కబుర్లు
one and only ajit