Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali 2+1

ఈ సంచికలో >> సినిమా >>

వన్‌ అండ్‌ ఓన్లీ అజిత్‌

one and only ajit


వయసుకు తగ్గ పాత్రల్లో నటించడమే కాకుండా వయసు మీరిన పాత్రల్లోనూ హీరోయిజం ప్రదర్శించడం తమిళ హీరో అజిత్‌కే చెల్లింది. 'ప్రేమలేఖ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అజిత్‌, తమిళంలో ఇప్పుడు సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. 'బిల్లా' సిరీస్‌ అజిత్‌ను బాక్సాఫీస్‌ కింగ్‌గా మార్చేసిందనడం నిస్సందేహమే. అజిత్‌ తాజా చిత్రం 'వేదాళం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అజిత్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. నెరిసిన జుట్టుతో అజిత్‌ కనిపిస్తుంటే, అభిమాను ఆ స్టయిలిష్‌ లుక్‌ చూసి ఆశ్చర్యపోతూ, సంబరాలు చేసుకుంటున్నారట. మాసిన గడ్డం, నెరిసిన జుట్టు ఇప్పుడు ట్రెండీగా మారింది.

రజనీకాంత్‌ కూడా తన కొత్త సినిమా 'కబలి'లో మాసిన గడ్డంతోనే సూపర్‌ లుక్‌తో కనిపిస్తాడు. 'వేదాలం' సినిమా దగ్గరకొస్తే, బాలీవుడ్‌లో కూడా 'వేదాలం' రిలీజ్‌ గురించి ఉత్కంఠ నెలకొందట. 'వేదాళం' నిర్మాణ దశలో ఉండగానే బాలీవుడ్‌ నుంచి భారీ ఆఫర్స్‌ ఈ చిత్ర దర్శకుడికి వచ్చినట్లుగా సమాచారమ్‌. అజిత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందట 'వేదాళం'. తెలుగులోనూ అజిత్‌ క్రేజ్‌ని ఈ 'వేదాళం' అమాంతం పెంచేస్తుందేమో చూడాలిక. 

 

మరిన్ని సినిమా కబుర్లు
bunny act in  gunashekar direction