Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny act in  gunashekar direction

ఈ సంచికలో >> సినిమా >>

స్పీడ్‌ మీదున్న 'సుప్రీమ్‌' హీరో

supreem hero speed

తొలి సినిమా రిలీజ్‌కి ఎన్నో కష్టాలు పడ్డా, రెండో సినిమాతో స్టార్‌డమ్‌ వచ్చేసింది సాయిధరమ్‌తేజ్‌కి. మూడో సినిమా కూడా హిట్టయ్యేసరికి, టాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు తేజు. డాన్సులు, ఫైట్లు, ఎనర్జీ అన్ని కలిస్తే తేజు అనే టాక్‌ ఇండస్ట్రీలో పిక్సయ్యింది. దాంతో యంగ్‌ డైరెక్టర్స్‌ తేజుని టార్గెట్‌గా చేసుకుని కథలు రాసుకుంటున్నారట. మినిమమ్‌ గ్యారంటీ హీరో అన్న ఇమేజ్‌ వచ్చేసింది గనుక, నిర్మాతలూ తేజు వెంట పడ్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మూడు సినిమాలు తేజు ఖాతాలో ఉన్నాయిప్పుడు.

వీటిల్లో 'సుప్రీం' ఒకటి కాగా, ఇంకొకటి 'తిక్క'. మూడోది 'శతమానం భవతి'. మావయ్య చిరంజీవికి ఒకప్పుడు సినీ రంగంలో ఉన్న బిరుదు 'సుప్రీమ్‌'ని తన సినిమా టైటిల్‌గా, తన బిరుదుగా మార్చేసుకున్న తేజు మార్కెట్‌ రేంజ్‌ సినిమా సినిమాకీ అనూహ్యంగా పెరిగిపోతోంది. ఈ మెగా హీరో స్పీడ్‌ చూసి ఇండస్ట్రీ షాకైపోతోందిట. సక్సెస్‌ కొట్టడం హ్యాపీ కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్తాడు తేజు. ఎంట్రీ వరకూ మాత్రమే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ అనీ, కష్టపడితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని చెప్పే తేజు, చెప్పిన మాటల్ని తుచ తప్పకుండా పటిస్తూ, సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు. 

 

మరిన్ని సినిమా కబుర్లు
akhil movie comming  diwali..