Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - బ్రూస్‌లీ

movie review - Bruce Lee

చిత్రం: బ్రూస్‌లీ
తారాగణం: చిరంజీవి (అతిథి పాత్రలో) రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కృతి కర్బందా, బ్రహ్మానందం, అరుణ్‌ విజయ్‌, సంపత్‌ రాజ్‌, నదియా, టిస్కా చోప్రా, బ్రహ్మాజీ, రావు రమేష్‌, తదితరులు.
చాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
సంగీతం: ఎస్‌ఎస్‌ థమన్‌
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాణం: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: డివివి దానయ్య
విడుదల తేదీ: 15 అక్టోబర్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
అక్క కావ్య (కృతి కర్బందా) కోసం, తన యాంబిషన్స్‌ని దూరంగా పెట్టి, కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడు కార్తీక్‌ (రామ్‌చరణ్‌). కుటుంబ అవసరాల్ని తీర్చడం కోసం, తన అక్కను ఐఏఎస్‌ని చేయడం కోసం స్టంట్‌ మాన్‌గా పనిచేసే కార్తీక్‌ని తొలిచూపులోనే ప్రేమిస్తుంది రియా (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌). రియా కారణంగా కార్తీక్‌కి దీపక్‌ రాజ్‌ (అరుణ్‌ విజయ్‌)తో వైరం ఏర్పడుతుంది. ఇంకో పక్క తన తండ్రి రామచంద్ర (రావురమేష్‌) పనిచేస్తున్న కంపెనీ అధినేత జయరాద్‌ (సంపత్‌) కుమారుడితో తన అక్క కావ్యకు పెళ్ళి సంబంధం వస్తుంది. ఈలోగా కార్తీక్‌ మీద కక్ష పెంచుకున్న దీపక్‌ రాజ్‌, కార్తీక్‌ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. దీపక్‌ రాజ్‌ నుంచి కార్తీక్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అక్క కావ్యకి వచ్చిన పెద్దింటి సంబంధం సక్సెస్‌ అయ్యిందా? వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే
సినిమాలో హీరో రామ్‌చరణ్‌ అయినా, చివర్లో మెగా ఫినిషింగ్‌ సినిమాకి హైలైట్‌ గనుక, మెగా ఫాన్స్‌ ఎనిమిదేళ్ళుగా చిరంజీవి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు గనుక, చిరంజీవితోనే స్టార్ట్‌ చేద్దాం. చిరంజీవి ఎంట్రీ అదిరిపోయింది. ఒక్కసారిగా సినిమాని చిరంజీవి ఎంట్రీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. స్క్రీన్‌ ప్రెజెన్స్‌లో అప్పటికీ ఇప్పటికీ అదే తేజస్సు. నటనలో ఈజ్‌, యాక్షన్‌లో ఈజ్‌, డైలాగ్‌ డిక్షన్‌లో స్పార్క్‌ ఇవన్నీ చిరంజీవి మునుపటికన్నా పవర్‌ఫుల్‌గా చూపించారు.

మెయిన్‌ హీరో రామ్‌చరణ్‌ దగ్గరకు వద్దాం. మొత్తం చరణ్‌ నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా ఒక్కటీ ఒక ఎత్తు. అదీ చరణ్‌ లుక్‌ విషయంలో. చాలా స్టైలిష్‌గా ఉన్నాడు చరణ్‌. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేశాడు. డాన్సుల్లో అయితే సింప్లీ సూపర్బ్‌. సెంటిమెంట్‌నీ బాగా పండించాడు. కామెడీ టైమింగ్‌ కూడా అదిరిపోయింది. ఓవరాల్‌గా ఇది రామ్‌చరణ్‌ ఫిల్మ్‌. రామ్‌చరణ్‌లోని అన్ని యాంగిల్స్‌నీ దర్శకుడు పెర్‌ఫెక్ట్‌గా చూపిస్తే, దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టు చరణ్‌, కార్తీక్‌ పాత్రలో ఒదిగిపోయాడు.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విషయానికొస్తే, సింప్లీ సూపర్బ్‌ గ్లామరస్‌ బ్యూటీ అనిపించుకుంది రకుల్‌. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూపించనంత గ్లామరస్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. నటించి ప్రేక్షకుల్ని మెప్పించేంత సీన్‌ ఆమెకు సినిమాలో దర్శకుడు ఇవ్వలేదు. కృతి కర్బందా క్యూట్‌గా ఉంది. నటన పరంగానూ బాగానే చేసింది. అరుణ్‌ విజయ్‌ విలన్‌ పాత్రలో జస్ట్‌ ఓకే. సంపత్‌ రాజ్‌ మామూలే. రావు రమేష్‌ ఆకట్టుకుంటాడు. నదియా, పవిత్ర లోకేష్‌ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారుల్లో తనికెళ్ళ భరణి, ఫృధ్విరాజ్‌ ఓకే. బ్రహ్మానందం కామెడీ బాగానే వుందిగానీ మరీ అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, సినిమాకి బ్రహ్మీ ఉపయోగపడ్డాడు. జయప్రకాష్‌రెడ్డి నవ్వించాడు.

కథ కొత్తది కాదు, పాత కథే. కథనం కూడా అంతే. బోర్‌ కొట్టనివ్వకుండా పాత్రల్ని నడిపించగలిగారు. సెకెండాఫ్‌లో మాత్రం సాగతీత అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌కి స్కోప్‌ ఎక్కువ ఉంది. మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికన్నా చూడ్డానికి ఇంకా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి రిచ్‌నెస్‌ ఇచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా చాలా రిచ్‌గా సినిమా తెరకెక్కిందంటే అది సినిమాటోగ్రఫీ పనితనమే. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడలేదు. యాక్షన్‌ కూడా రొటీన్‌కి భిన్నంగా అనిపిస్తుంది.

చాలాకాలం గ్యాప్‌ తర్వాత చిరంజీవితో చేస్తున్న సినిమా, రామ్‌ చరణ్‌ లాంటి హీరోతో చేస్తున్న సినిమా అంటే దర్శకుడు ఇంకా ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సింది. కమర్షియల్‌ పాయింట్‌నే ఎంచుకున్నా, కథ, కథనాల్లో కొత్తదనం కోసం ప్రయత్నిచకపోవడం దర్శకుడి మైనస్‌. కథ, కథనం పాతదే అయినప్పుడు సీన్స్‌ని అయినా కొత్తగా రాసుకుని, తగినన్ని ట్విస్ట్‌లు ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాల్లో దర్శకుడు కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించాడు. మొత్తం సినిమాని తన భుజాల మీద చరణ్‌ నిలబెడితే, డల్‌ అయిన మూమెంట్‌లో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి, సినిమా మొత్తాన్ని తానే మోయాల్సి వచ్చింది. ఫస్టాఫ్‌ అంతా వినోదాత్మకంగా సాగిపోవడం ప్లస్‌ అయితే, ఇంటర్వెల్‌ తర్వాత కథ నత్తనడకన సాగడం మైనస్‌. ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ అదరహో అనేలా ఉండడం డబుల్‌ ప్లస్‌. చరణ్‌ ఇమేజ్‌, మెగాస్టార్‌ రీ ఎంట్రీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సినిమా పైసా వసూల్‌ అవడం గ్యారంటీ. పండగ సీజన్‌ని ఎలాగూ క్యాష్‌ చేసుకుంటుంది, ప్రమోషన్‌ ఇంకొంచెం బాగా చేస్తే, మంచి గ్రాసర్‌గా కూడా నిలబడొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే
బ్రూస్‌లీ మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్‌

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka