Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

నాగబాబు సౌందర్య రహస్యం

nagababu beauty secret

ఆరడుగులపైనే వుంటాడతను.. ఆజానుబాహుడు. ఆ హైటుకి మించిన వెయిట్‌తో కన్పించే మెగా బ్రదర్‌ నాగబాబు ఇప్పుడు స్లిమ్‌గా కన్పిస్తున్నాడు. నటుడిగా, నిర్మాతగా సినిమాల్లోనూ, బుల్లితెరపైనా కన్పించిన నాగబాబు, హఠాత్తుగా స్లిమ్‌ అయ్యేసరికి అందరూ షాక్‌ తింటున్నారు. ఇప్పుడు నాగబాబు ఫిట్‌గా వున్నాడు.

ఇంత మార్పు ఎలా సాధ్యమయ్యిందంటే.. సన్నబడ్డానికి చాలా త్యాగం చేయాల్సి వచ్చిందట నాగబాబుకి. ప్రధానంగా నాన్‌ వెజ్‌ మానేశాడని, లిక్కర్‌ జోలికి అస్సలు వెళ్ళడంలేదనీ తెలుస్తోంది. సన్నబడే విషయంలో నాన్‌ వెజ్‌కి ఎక్కువమంది దూరమవుతారు. నాగబాబు చేసింది కూడా అదే.

'జబర్దస్త్‌' కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబు, పలు సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు. సన్నబడ్డాక నాగబాబు ఇంకా ఎక్కువగా సినిమాల్లో కన్పించే అవకాశముంది. ఇంకో విశేషమేంటంటే, నాగబాబు మునుపటికన్నా గ్లామరస్‌గా కన్పిస్తుండడం. ఓ సినిమా కోసం నాగబాబు సన్నబడాల్సి వచ్చిందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. కారణం ఏదైనా కుమారుడు వరుణ్‌ తేజ హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంటే, కొడుకుని మించిన అందగాడిలా నాగబాబు మారిపోతుండడం గొప్ప విషయమే.

మరిన్ని సినిమా కబుర్లు